తల్లికి, భార్యకు ఎంత చేసినా అంతే.. వాళ్ల పరిస్థితి అంతే.. మంచి తండ్రిగా అంటూ ఎన్టీఆర్ భావోద్వేగం
జూనియర్ ఎన్టీఆర్‌కు ఫ్యామిలీ అంటే ప్రాణం కంటే ఎక్కువగా చూస్తారు. అభిమానులను కూడా కుటుంబ సభ్యులుగానే ట్రీట్ చేస్తారు అనే అభిప్రాయం సినీ వర్గాల్లో ఉంది. మార్చి 13వ తేదీ శనివారం ఎవరు మీలో కోటీశ్వరులు ప్రెస్ మీట్‌లో ఎన్టీఆర్ తన అభిమానులు, ఫ్యామిలీ గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. తన ఫ్యాన్స్ గురించి ఎన్టీఆర్ మాట్లాడుతూ...

ఫ్యాన్స్‌పై ప్రశంసల వర్షం
ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమంలో తన అభిమానుల సేవలపై ఎన్టీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. ఫ్యాన్స్‌కు నేను ఏం చేస్తున్నాననే విషయం పక్కన పెడితే.. నాకు నా అభిమానులు చాలా చేస్తున్నారు. నేను ఏ రోజు కూడా ఇలా చేయమని ఎవరికీ చెప్పలేదు. వాళ్లే ఇలా చేస్తే బాగుంటుందని ఓ మహోన్నతమైన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. మనుషులుగా అలాంటి సేవ కార్యక్రమాలు చేస్తే చాలా సంతోషంగా ఉంటుంది అని ఎన్టీఆర్ తెలిపారు.
కన్నడ బ్యూటీ అషికా రంగనాథ్ హాట్ వర్కౌట్ ఫొటోలు

వారి రుణం తీర్చుకోలేను అంటూ
నా అభిమానులకు ఏం చేయబోతున్నాననేది చాలా పెద్ద విషయం. నా అభిమానులకు నేను ఎంత చేసినా వారి రుణాన్ని తీర్చుకోలేను. తల్లికి ఏం చేసినా సరిపోదు. భార్యకు ఎంత చేసిన సరిపోదు. అలాగే అభిమానులకు ఎంత చేసిన సరిపోదు అని ఎన్టీఆర్ భావోద్వేగానికి గురి అయ్యారు.

కాలర్ ఎగరేసుకొనేలా చేస్తా
అయితే నా అభిమానులకు ఒక్కటి మాత్రం చేస్తాను. వారు ఎన్టీఆర్ అభిమానిని అని కాలర్ ఎగురవేసుకొనేలా చేస్తాను. వారిని ఎట్టి పరిస్థితిలో కూడా వారి నమ్మకాన్ని వమ్ము చేయను. వారు గర్వపడేలా చేయడమే నా ముందున్న కర్తవ్యం అనే విధంగా ఎన్టీఆర్ తెలిపారు.

నటుడిగా మారిన తర్వాత జీవితం
ఇక ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమంలో మాట్లాడుతూ.. చిన్నతనంలో చాలా మంది ఫ్రెండ్స్ ఉండేవారు. అలాగే కాలేజ్‌లో కూడా చుట్టూ ఫ్రెండ్స్ ఉండేవాళ్లు. ఓ కాలనీలో ఉన్న సమయంలో కూడా చాలా మంది తెలిసినవాళ్ల మధ్య ఉండేవాడిని. నటుడిగా మారిన తర్వాత జీవితం చాలా కుంచించుకుపోయింది. ఎవరితో మాట్లాడుదామన్నా.. కలుద్దామన్నా బెరుకుగా ఉంటుంది అని ఎన్టీఆర్ అన్నారు.

మంచి భర్తగా, తండ్రిగా, కొడుకుగా
ఎవరు మీలో కోటీశ్వరులు షోతో ప్రజలను, అభిమానులను కలిసి అవకాశం దక్కుతుందనే నమ్మకం ఉంది. ప్రజలు చెప్పే విషయాలతో స్పూర్తి పొందే అవకాశం లేకపోలేదు. ఇలాంటి షోతో నేను మంచి మనిషిగా, కొడుకుగా, భర్తగా, తండ్రిగా మారుతాననే అభిప్రాయం కలుగుతున్నది. అందుకే ఈ షోను ఒప్పుకొన్నాను అని ఎన్టీఆర్ అన్నారు.


Click it and Unblock the Notifications











