SS Rajamouli నన్ను చూసి అసహ్యించుకొన్నాడు.. మొహమాటం లేకుండా బయటపెట్టిన ఎన్టీఆర్!
యంగ టైగర్ నందమూరి తారక రామారావు ప్రస్తుతం టెలివిజన్ రియాలిటీ షో ఎవరు మీలో కోటీశ్వరుడు బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకొంటున్నారు. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు విషయాలను తారక్ ఎలాంటి మొహమాటం లేకుండా బయటపెడుతున్నారు. తాజాగా తన శరీర బరువు గురించి దర్శకుడు రాజమౌళి ఎలాంటి మొహమాటం లేకుండా చెప్పిన విషయాలను వెల్లడించారు. లావుగా ఉన్న ఎన్టీఆర్‌ను చూసి జక్కన్న ఏమన్నారంటే. .

ఎవరు మీలో కోటీశ్వరులు కంటెస్టెంట్‌తో
ఎవరు మీలో కోటీశ్వరులు మంగళవారం నాటి ఎపిసోడ్ నంబర్ 7లో కంటెస్టెంట్ మనీష్ మర్యాద 320000 గెలుచుకొన్న తర్వాత ఆత్మ విశ్వాసం కోల్పోవడంతో నేను సినిమాల్లో నటించాలనే కోరికను వెనుకకు తీసుకొన్నాననే విషయాన్ని గుర్తు చేస్తూ.. నేను ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్లు అవుతున్నది. అప్పట్లో నేను చాలా లావుగా ఉండేవాడిని. కానీ నాకు ఎప్పుడు లావుగా ఉన్నావని అనిపించలేదు. కానీ ఒకరోజు మా జక్కన్న అంటే దర్శకుడు రాజమౌళి నన్ను లావుగా ఉన్నావని హెచ్చరించారు అని ఎన్టీఆర్ చెప్పారు.

యమదొంగకు ముందు లావుగా
ఎన్టీఆర్ వరుస విజయాలతో దూసుకెళ్తున్నారు. కానీ ఓ దశలో రాఖీ చిత్రం తర్వాత ఎన్టీఆర్ శరీరంలో ఊహించనంతగా మార్పు వచ్చింది. అయితే లావుగా ఉన్నప్పటికీ అతడి నటనలో గ్రేస్ తగ్గలేదు. డ్యాన్స్‌లో స్పీడ్ తగ్గలేదు. కానీ యమదొంగ చిత్రానికి ముందు తాను ఊహించుకొన్నట్టుగా లేకపోవడంతో కాస్త మందలించినట్టు ఎవరు మీలో కోటీశ్వరుడు షో వేదిగక ఎన్టీఆర్ చెప్పారు.

జక్కన నన్ను చూసి
నేను విపరీతంగా లావుగా మారడంతో ఓ రోజు నన్ను చూసి చాలా అసహ్యంగా ఉన్నావు. ఆ రోజు నాకు నేనేంటో నాకు తెలిసింది. ఆ తర్వాత నేను బరువు, లావు తగ్గించుకొన్నాను. ఆ రోజు వెలగకపోతే పరిస్థితి ఎలా ఉండేదో. మన చుట్టు ఉండే ఫ్రెండ్స్ మాత్రమే మనల్ని గైడ్ చేస్తారు. ఆ రోజు నుంచి నేను జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నిస్తున్నాను. మీ జుట్టు ప్రాబ్లెం, నాకు కొవ్వు ప్రాబ్లెం అని ఎన్టీఆర్ అన్నారు.

నటనలో రాణించాలంటే ఉండాల్సిన క్వాలిటీ
మనీష్ మర్యాదకు ఎన్టీఆర్ సలహాలు ఇస్తూ... మీకు ఫ్రెండ్లీగా కొన్ని విషయాలు చెబుతాను. నటనలో రాణించాలంటే.. మనకు కావాల్సింది నిజాయితీ. మనకు తెలియకుండా ఎన్నో విషయాలు జరిగిపోతుంటాయి. కానీ మనం తెలుసని అనే ధైర్యంతో ఉంటాం. కానీ వాస్తవాలను గ్రహించి మనకు మనం లొంగిపోవడం నేర్చుకోవాలి. నిజాయితీగా ఉండాలి. మీకు నిజాయితీ లేదని నేను చెప్పడం లేదు. అప్పుడే మన కల నెరవేరుతుంది. మీ కల తప్పకుండా నేరవేరుతుంది అని ఎన్టీఆర్ పేర్కొన్నారు.
Recommended Video

ఎన్టీఆర్ లావు తగ్గిన తర్వాత
ఇక ఎన్టీఆర్ లావు తగ్గిన తర్వాత మరింత హ్యాండ్సమ్‌గా మారారు. సిక్స్ ప్యాక్‌తో కూడా ప్రేక్షకులను, అభిమానులను ఆకట్టుకొన్నారు. ఇప్పటికీ తన ఆకారానికి తగినట్టుగా బాడీని మెయింటెన్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన RRR చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. RRR చిత్రం తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమాను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం ఎవరు మీలో కోటీశ్వరుడుతో ప్రతీ ఒక్కరి ఇంటిలో, హృదయంలో గూడు కట్టుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు.


Click it and Unblock the Notifications











