ఎగ్జిట్ పోల్స్ ఎఫెక్ట్: పవన్ కళ్యాణ్‌‌ను టార్గెట్‌ చేసిన సినీ మాయగాళ్లు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చివరగా నటించిన చిత్రం 'అజ్ఞాతవాసి'. గతేడాది విడుదలైన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద పరాజయం పాలైంది. అంతకు ముందే రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ ఈ ఫలితం తర్వాత సినిమాలను పూర్తిగా వదిలేశారు. రాజకీయాల్లో బిజీ అయిపోయారు. ఇక సినిమాల్లోకి వచ్చే ఉద్దేశ్యం లేదని, ప్రజల కోసమే ఈ జీవితం అని ప్రకటించారు.

సీరియస్‌గా పాలిటిక్స్ చేస్తూ గడిచిన ఎన్నికల్లో జనసేన పార్టీ తరుపున ప్రచారం హోరెత్తించారు. మే 23 ఎన్నికల ఫలితాల తర్వాత... ప్రభుత్వ ఏర్పాటులో పవన్ కళ్యాణ్ కింగ్ మేకర్ అవుతారనే నమ్మకం అందరిలో కల్పించడంలో సక్సెస్ అయ్యారు. అయితే ఆదివారం విడుదలైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మాత్రం అందరికీ షాకిచ్చాయి.

జనసేనకు వ్యతిరేకంగా ఎగ్జిట్ పోల్స్

జనసేనకు వ్యతిరేకంగా ఎగ్జిట్ పోల్స్

ఆదివారం విడుదలైన అన్ని ఎగ్జిట్ పోల్స్ జనసేన పార్టీకి ఈ ఎన్నికల్లో యావరేజ్‌గా1 నుంచి 4 సీట్లకు మించి రావని తేల్చేశాయి. ప్రభుత్వ ఏర్పాటులో పవన్ కళ్యాణ్ కింగ్ మేకర్ అవుతాడని భావించిన వారంతా ఈ నెంబర్స్ చూసి షాకయ్యారు. అయితే ఎగ్జిట్ పోల్స్ నిజం అయ్యే అవకాశాలు చాలా తక్కువ అని, వీటిని నమ్మ వద్దని అభిమానులు అంటున్నారు. మే 23న విడుదలయ్యే ఫలితాల్లో జనసేన పార్టీకి మంచి ఆధిక్యం లభిస్తుందనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

ఎగ్జిట్ పోల్స్ ఎఫెక్ట్: పవన్ కళ్యాణ్‌‌ను టార్గెట్‌ చేసిన సినీ మాయగాళ్లు

ఎగ్జిట్ పోల్స్ ఎఫెక్ట్: పవన్ కళ్యాణ్‌‌ను టార్గెట్‌ చేసిన సినీ మాయగాళ్లు

ఎగ్జిట్ పోల్స్ విడుదల కాగానే.... పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేస్తూ వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఎన్నికల్లో జనసేన దారుణంగా ఓడిపోయే పరిస్థితి కనిపిస్తోందని, ఇక పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాల వైపు వస్తారంటూ ఆయన వ్యతిరేకులు కొందరు రూమర్స్ స్ప్రెడ్ చేయడం మొదలు పెట్టారు.

ఎన్నికల్లో తీవ్ర నష్టం కలిసిగించిన నెగెటివ్ ప్రచారం

ఎన్నికల్లో తీవ్ర నష్టం కలిసిగించిన నెగెటివ్ ప్రచారం

ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ గురించి కొందరు చేసిన నెగెటివ్ ప్రచారం తీవ్ర నష్టం కలిగింది. పవన్ కళ్యాణ్ ఎన్నికల తర్వాత సినిమాల్లోకి వెళతారంటూ కొందరు నెగెటివ్ ప్రచారం చేయడం ద్వారా జనసేన పార్టీపై వ్యతిరేకత పెంచారు. ఇది ఏపీ ఓటర్లపై ఏ మేరకు ప్రభావం చూపింది అనేది మే 23న వచ్చే ఎన్నికల ఫలితాలు విడుదలైతేగానీ చెప్పలేం.

సినిమాల్లోకి రానని స్పష్టం చేసిన పవన్ కళ్యాణ్

సినిమాల్లోకి రానని స్పష్టం చేసిన పవన్ కళ్యాణ్

సినిమాల్లోకి తిరిగి వెళ్లే ఆలోచన లేదని, తనపై జరుగుతున్న ఈ ప్రచారాన్ని నమ్మవద్దని పవన్ కళ్యాణ్ ఇటీవల జరిగిన జనసేన రివ్యూ మీటింగులో స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వచ్చినా నిరాశ చెందవద్దని, 25 ఏళ్ల పాటు యాక్టివ్ పాలిటిక్స్ చేస్తూ ప్రస్తుత వ్యవస్థలో మార్పు తేవడమే లక్ష్యంగా జనసేన ముందుకు సాగుతుందని వెల్లడించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X