ఒకే ఫ్రేమ్ లో సందడిగా కనిపించిన F2 టీమ్.. మొత్తానికి ఓ పని పూర్తి చేశారు..
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో చాలా కాలంగా వాయిదా పడుతున్న సినిమాల్లో F3 కూడా ఉంది. విక్టరీ వెంకటేష్ మెగా హీరో వరుణ్ తేజ్ కలిసి నటించిన F 2 సినిమాకు ఫ్రాంచైజ్ గా వస్తున్న ఈ సినిమాపై అంచనాలు అయితే భారీగానే ఉన్నాయి. కామెడీ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమాను తెరపైకి తీసుకు రాబోతున్నాడు. దిల్ రాజు నిర్మాతగా తమన్నాభాటియా, మెహ్రీన్ హీరోయిన్స్ గా నటించారు. 2019 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎఫ్ 2 సినిమా ఏ స్థాయిలో సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఇప్పుడు అదే ఫ్రాంచైజ్ లో రాబోతున్న F3 సినిమా కూడా అంతకుమించి అనేలా కామెడీ గా ఉంటుంది అని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.
అయితే ఈ సినిమాను కూడా ఈ ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకున్నారు. కానీ అప్పుడు పోటీ తీవ్రత ఎక్కువగా ఉంది అని వాయిదా వేసుకోక తప్పలేదు. అంతేకాకుండా కరోనా పరిస్థితుల కారణంగా సినిమా షూటింగ్ వాయిదా పడిన విషయం తెలిసిందే. ఎఫ్2 సినిమాలో దర్శకుడు అనిల్ రావిపూడి భార్య భర్తల కు సంబంధించిన చిన్నచిన్న గొడవలను ఎంతో హాస్యాస్పదంగా చూపించి బాక్సాఫీస్ వద్ద వంద కోట్ల కలెక్షన్స్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు సినిమాల్లో మాత్రం డబ్బు అనే కాన్సెప్ట్ తో డిఫరెంట్ గా ఆకట్టుకోబోతున్నట్లు తెలుస్తోంది. వెంకటేష్, వరుణ్ తేజ్ తో పాటు ఈ సినిమాలో మరికొన్ని పాత్రలు కూడా కొత్తగా ఆకట్టుకోబోతున్నట్లు సమాచారం.

ముఖ్యంగా సునీల్ పాత్ర చాలా కామెడీగా ఉంటుందట. ఇక ఈ సినిమా కోసం అయితే ఓ వర్గం ప్రేక్షకులు మాత్రం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పవచ్చు. ఇక నిర్మాత దిల్ రాజు ఈ సినిమాలో సరైన సమయంలో విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఇక మొత్తానికి ఇటీవల సినిమాకు సంబంధించిన పూర్తి షూటింగ్ పనులను పూర్తి చేశారు. కేవలం ఒక పాట మినహా మిగతా షూటింగ్ మొత్తం పూర్తి అయినట్లుగా ఒక స్పెషల్ వీడియో ద్వారా తెలియజేశారు. ఒక బస్సులో చిత్ర యూనిట్ సభ్యులు అందరూ కూడా ఈ సినిమా షూటింగ్ పూర్తయింది అన్నట్టుగా కూడా గట్టిగా సంబరపడుతూ చెప్పారు.
'మా షూటింగ్ జర్నీ పూర్తి అయింది. మీ నవ్వుల జర్నీ మొదలవుద్ది. వస్తే, కొద్దిగా ముందుగా.
వెళ్ళినా కొద్దిగా వెనకగా. థియేటర్స్ కి రావడం మాత్రం పక్కా!'. ఇక నవ్వుల పండుగ ఏప్రిల్ 28 వ తేదీన మొదలవుతుందని కూడా క్యాప్షన్ విచ్చేశారు. ఈ సినిమాను ఫిబ్రవరిలో కూడా విడుదల చేయాలని మొదట అనుకున్నారు. కానీ పరిస్థితులు తారుమారయ్యాయి. ఇప్పుడు ఎలాగైనా అనుకున్న సమయానికి ఏప్రిల్ 28వ తేదీన విడుదల చేయాలని చూస్తున్నారు. సమ్మర్ హాలిడేస్ లో తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకుంటుందని నిర్మాతలు నమ్ముతున్నారు. మరి సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో సక్సెస్ ని అందుకుంటుందో చూడాలి. దర్శకుడు అనిల్ రావిపూడి మిగిలిన ఒక పాట షూటింగ్ ను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి తన తదుపరి ప్రాజెక్టును కూడా సెట్స్ పైకి తీసుకురావాలని అనుకుంటున్నాడు. ఇప్పటికే ఆయన నందమూరి బాలకృష్ణతో సినిమా చేయడానికి చర్చలు జరుపుతున్నాడు. అలాగే మరొక హీరోతో కూడా కథా చర్చలు జరుగుతున్నట్లు టాక్ వస్తోంది.


Click it and Unblock the Notifications











