twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రభాస్‌కు మరో సర్జరీ జరిగిందా… అసలు విషయం ఇదే!

    |

    ప్రభాస్ వరుసగా ఫ్యాన్ ఇండియా సినిమాలను లైన్లో పెడుతున్న విషయం తెలిసిందే. అయితే ఆయన హీరోగా నటిస్తున్న సినిమాల్లో అందరి ఫోకస్ ఎక్కువగా సైన్స్ ఫిక్షన్ ఫిలిమ్ ప్రాజెక్ట్ K పైనే ఉంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను వైజయంతి మూవీస్ భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది. అయితే ఈ సినిమా విడుదల తేదీపై ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో నిర్మాత సి.అశ్వినీ దత్ అధికారికంగా క్లారిటీ ఇచ్చారు. నిజానికి 'సలార్' సినిమా షూటింగ్ లో ప్రభాస్ కి గాయాలయ్యాయని, దీంతో చిన్న ఆపరేషన్ చేయాల్సి వచ్చిందని అంటున్నారు. ఈ ఆపరేషన్ యూరప్ లో చేయించుకున్నారట ప్రభాస్. ఇదిలా ఉండగా.. రీసెంట్ గా 'ప్రాజెక్ట్ K' నిర్మాత అశ్వనీదత్.. ప్రభాస్ సర్జరీ కోసం విదేశాలకు వెళ్లారని కామెంట్స్ చేశారు.

    'సీతా రామం' సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు ప్రభాస్‌ చీఫ్ గెస్ట్‌గా రావాల్సి ఉందని.. కానీ కాలి సర్జరీ కోసం ఆయన ఫారెన్ కి వెళ్లినట్లు అశ్వినీదత్ మీడియాలో చెప్పారు. ఇప్పటికే ప్రభాస్ కి ఒకసారి సర్జరీ అయింది. ఇప్పుడు మళ్లీ సర్జరీ అని చెప్పడంతో ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. కానీ అసలు విషయం ఏమిటంటే నిజానికి ప్రభాస్ ఈసారి యూరప్ వెళ్లింది సర్జరీ కోసం కాదట. కేవలం ఆ సర్జరీకి సంబంధించిన చెకప్ కోసం ఆయన వెళ్లినట్లు తెలుస్తోంది. పోస్ట్ ఆపరేషనల్ చెకప్ లో భాగంగా ప్రభాస్ యూరప్ కి వెళ్లారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

    facts behind actor prabhas surgery news

    ఆగస్టు మొదటివారంలో ఆయన తిరిగి హైదరాబాద్ చేరుకుంటారని అంటున్నారు. అంతేకాక ఒకట్రెండు వారాల రెస్ట్ తీసుకున్న తరువాత తిరిగి 'సలార్', 'ప్రాజెక్ట్ K' సినిమాల షూటింగ్ పునః ప్రారంభిస్తారని అంటున్నారు. అశ్వినీ దత్ ఇచ్చిన ఇంటర్వ్యూలో అయితే సినిమాను 2023 అక్టోబర్ 18వ తేదీన విడుదల చేసే అవకాశం ఉందని అన్నారు. దసరా సమయంలో హాలిడేస్ ఉంటాయి కాబట్టి సినిమాకు తప్పకుండా మంచి కలెక్షన్స్ వస్తాయి అని అదే తేదీ బెస్ట్ అని అనుకుంటున్నాట్లుగా చెబుతున్నారు.

    English summary
    K, Aswini Dutt revealed that Prabhas wouldn't be attending the event as he flew to the foreign for surgery. but actually he went for post surgery checkup
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X