ఇంటర్వ్యూలు ఎందుకు ఇవ్వరు? పుష్ప విలన్ తెలివైన సమాధానం
తన అద్భుతమైన యాక్టింగ్ తో సౌత్ లో స్టార్ హీరోగా మంచి గుర్తింపు దక్కించుకున్న మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ పుష్ప 2 మూవీలో విలన్ గా నటించి అదరగొట్టాడు. ఈ మూవీ ద్వారా ఆయన పాపులారిటీ మరింతగా పెరిగింది. ఈ నేపథ్యంలోనే అందరు స్టార్స్ లాగా ఎందుకు తరచుగా ఇంటర్వ్యూలు ఇవ్వడానికి ఇష్టపడరు అనే విషయంపై స్పందించారు. మరి ఫహాద్ ఎందుకు ఇంటర్వ్యూలు ఇవ్వరు అనే విషయంపై లుక్కేద్దాం.
స్టార్స్ అనగానే నిరంతరం కెమెరా కళ్ళు వాళ్ల చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. పబ్లిక్ ఫిగర్స్ గా మారిన తర్వాత వాళ్లు తమ ప్రైవసీని త్యాగం చేయాల్సి ఉంటుంది. కానీ కొంతమంది నటీనటులు మాత్రం తమ ఆన్ స్క్రీన్ ప్రజెన్స్ ను దాటి ముందుకు వెళ్లరు. మీడియా లైమ్ లైట్ నుంచి తమను తాము సక్సెస్ ఫుల్ గా దూరంగా ఉంచుకోగలుగుతారు.

మీడియా ప్రజెన్స్ కి దూరంగా ఉండే నటుల్లో ఫహాద్ ఫాజిల్ ఒకరు. విపరీతమైన పాపులారిటీ ఉన్నప్పటికీ అతను లో ప్రొఫైల్ ను కొనసాగించడానికి ఇష్టపడతాడు. అనవసరంగా ప్రజల దృష్టి తన పర్సనల్ లైఫ్ పై పడి, లేనిపోని వివాదాలు చోటు చేసుకోవడానికి ఆయన అస్సలు ఒప్పుకోరు.
అందుకే తన సినిమాల గురించి కాకుండా ప్రజలు తన గురించి మాట్లాడుకూడదు అంటూ తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో సహజ ఫాజిల్ తాను ఇంటర్వ్యూలో ఇవ్వకపోవడం గురించి తెలివిగా సమాధానం చెప్పారు. ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్న ఫహాద్ ఫాజిల్ ప్రజల దృష్టికి దూరంగా ఉండడానికి ఇష్టపడతాడు.

ఈ నేపథ్యంలోనే ఫహాద్ కు ఇంటర్వ్యూలు ఇవ్వడం ఇష్టం లేదా అని ఇటీవల ఇంటర్వ్యూలో ప్రశ్నించారు. ఫహాద్ సమాధానం చెప్తూ ఇంటర్వ్యూలు ఇవ్వడం నాకు నచ్చదు అని కాదు. కానీ ఏం మాట్లాడాలో తెలియదు. నేను మాట్లాడను కానీ సినిమాలు చేస్తాను. ప్రేక్షకులతో మాట్లాడడానికి ఇదే నాకు సులభమైన మార్గం అని అన్నారు. అంతేకాకుండా నా సినిమాలు బాగుంటే చూడండి, బాలేకపోతే చూడొద్దు అంటూ అభిమానులకు సలహా ఇచ్చారు.ఇక కుటుంబంతో కలిసి ఉన్నప్పుడు ఫోటోలు తీయడం నాకు ఇష్టం ఉండదు.
నన్ను చూసి దూరం నుంచే చిన్న స్మైలిస్తే అదే నాకు అభిమానులు ఇవ్వగలిగే అతిపెద్ద బహుమతి అని చెప్పుకొచ్చారు.అంతేకాకుండా వివాదాలకు దూరంగా ఉండడానికే తాను ఇంటర్వ్యూలు ఇస్తున్న సమయంలో నోరు జారకుండా ఉంటాను అంటూ బహిరంగంగానే ఒప్పుకున్నాడు.ప్రస్తుతం ఎంతోమంది సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ పై ట్రోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. అందుకే పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ ను సెపరేట్ గా ఉంచడం మంచిది. ఇంకేముంది ఫహాద్ తెలివైన పనికి, సమాధానానికి జనాలు సలామ్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











