Vijay Deverakonda: సింగిల్ కాదు రిలేషన్‌లోనే ఉన్నాం... ఓపెన్ అయిన విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ.. క్యారెక్టర్ ఆర్టిస్టు నుంచి స్టార్ హీరోగా ఎదిగారనే విషయం తెలిసిందే. అయితే ఈ హీరో తాజాగా చేస్తున్న చిత్రం ఫ్యామిలీ స్టార్. ఈ సినిమా వచ్చే నెల ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ కానుంది. ఈ క్రమంలో ఈ సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేశారు మేకర్స్. ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్స్, పాటలు ఆకట్టుకుంటున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విజయ్ తన లవ్ స్టేటస్ గురించి బయటపెట్టారు. తాను రిలేషన్లోనే ఉన్నాను అంటూ చెప్పి షాకిచ్చారు. అసలు విషయం ఏంటో ఈ స్టోరీలో చూసేద్దాం పదండి.

ఓవర్ నైట్ స్టార్డమ్...
నువ్విలా, లైఫ్ ఇజ్ బ్యూటిఫుల్, ఎవడే సుబ్రమణ్యం వంటి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసిన విజయ్ దేవరకొండ.. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన పెళ్లి చూపులు చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న విజయ్.. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. ఈ సినిమాతో స్టార్ హీరో స్టేటస్ సాధించుకున్నాడు. ఆ తర్వాత చేసిన గీత గోవిందం సినిమాతో ఫ్యామిలీ హీరోగానూ పేరు సొంతం చేసుకున్నాడు.

Family Star Vijay Devarakonda opened up about His Relationship Status News Goes Viral

ఫ్యామిలీ స్టార్ గా విజయ్...
గత ఏడాది ఖుషి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ గా రాబోతున్నాడు. ఈ సినిమాలో విజయ్ కు జోడీగా మృణాల్ థాకూర్ నటిస్తుంది. ఈ సినిమా ఏప్రిల్ 5న రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే సినిమా యూనిట్ ప్రచారపర్వం వేగవంతం చేసింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల అయిన పాటలు, ట్రైలర్స్ ఆకట్టుకుంటున్నాయి. విజయ్ దేవరకొండ స్వాగ్ కు అంతా ఫీదా అవుతున్నారు.

ది ట్యాగ్ మీద కామెంట్స్...
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ దేవరకొండ తన రిలేషన్ షిప్ గురించి బయటపెట్టారు. అంతే కాదు 'ది' ట్యాగ్‌పై కూడా స్పందించారు. ది ట్యాగ్ గురించి మాట్లాడుతూ... చాలా మంది హీరోలు సూపర్ స్టార్, తలైవా, తల అంటూ పెట్టేసుకున్నారు. నేను కూడా పెట్టుకోవాలని చాలా మంది నాపై ఒత్తిడి తెచ్చారు. హీరోల పేరు ముందు స్టార్‌ ట్యాగ్స్‌ పెట్టే సంప్రదాయం ఎక్కడ నుంచి వచ్చిందో నాకు తెలియదు కానీ.. నన్ను కూడా పెట్టుకోవాలని కొన్ని సజెస్ట్ చేశారు. అమ్మానాన్నలు పెట్టిన పేరుతో సంతోషంగా ఉన్నా.. విజయ్‌ దేవరకొండ ఒక్కడే... కాబట్టి నా పేరుకు ముందు ది యాడ్ చేసుకున్నా.. అంటూ చెప్పుకువచ్చారు విజయ్.

Family Star Vijay Devarakonda opened up about His Relationship Status News Goes Viral

రిలేషన్ గురించి చెప్తూ...
ఇక తన రిలేషన్ షిప్ గురించి అడగ్గా... అవును నేను రిలేషన్ లోనే ఉన్నాను. నా తల్లిదండ్రులు, సోదరుడు, స్నేహితులతో రిలేషన్‌ షిప్‌లో ఉన్నా అంటూ చెప్పి షాకిచ్చాడు విజయ్. ఇక ఈ సినిమా గురించి మాట్లాడుతూ... ప్రతి ఒక్కరికీ నచ్చే సినిమా అంటూ చెప్పుకువచ్చారు. ఇలాంటి కథలో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నాన్నట్లు వెల్లడించాడు. తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా చేసుకుని పరశురామ్‌ కథ రాశాడని తెలిపారు. అది విన్నప్పుడు హీరో పాత్ర నిజ జీవితానికి దగ్గర ఉంటుందనిపించినట్లు వివరించాడు.

ఇక ఈ సినిమా విషయానికి వస్తే...
విజయ్ దేవరకొండ 'గీత గోవిందం' తర్వాత పరశురామ్‌ తో కలిసి చేస్తున్నాడు. విజయ్ సరసన మృణాల్‌ ఠాకూర్‌ నటిస్తుండగా... దివ్యాంశ కౌశిక్‌, అజయ్‌ ఘోష్‌, వాసుకి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రష్మిక మందన్నా కూడా నటించనుందని తెలుస్తోంది. ఏప్రిల్‌ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌ రాజు నిర్మతగా వ్యవహిరంచగా.. గోపీ సుందర్‌ సంగీతం అందించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X