Vijay Devarakonda: ఒకే సమయంలో ఇద్దరితో ప్రేమ.. బ్రేకప్ గురించి రీవిల్ చేసిన విజయ్ దేవరకొండ

ది విజయ్ దేవరకొండ తన తాజా చిత్రం ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా వేసవి కానుకగా ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ కానుంది. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో విజయ్ దేవరకొండ వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ తన లవ్, బ్రేకప్ గురించి షాకింగ్ విషయాలు చెప్పుకువచ్చారు. ఓకే సమయంలో ఇద్దరితో ప్రేమ, తన లవ్ బ్రేకప్ గురించి రివిల్ చేశారు. ఆ వివరాలు ఈస్టోరీలో చూసేద్దాం.

రౌడీ హీరో విజయ్ దేవరకొండ గత ఏడాది ఖుషి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా విజయ్ ఫ్యాన్స్ ను కాస్త ఖుషి చేసింది కానీ సాలిడ్ హిట్ కాలేకపోయింది. ఇప్పుడు విజయ్ దేవరకొండ తనకు గీతా గోవిందం వంటి సూపర్ హిట్టును అందించిన డైరెక్టర్ పరుశురామ్ తో కలిసి ఫ్యామిలీ స్టార్ సినిమా చేశాడు. ఈ సినిమాలో తొలిసారిగా విజయ్ సరసన సీతారామం హీరోయిన్ అందాల ముద్దుగుమ్మ మృణాల్ థాకూర్ నటిస్తుంది.

Family Star Vijay Devarakonda Talk About His Love And Breakup Full Details Here

ఇక ఈ సినిమా ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రచారం వేగవంతం చేశారు మేకర్స్. ఈ సినిమా ప్రమోషన్స్ లో విజయ్ దేవరకొండ పాల్గొంటున్నారు. అందులో ఆయన తన లవ్ గురించి బయటపెట్టారు. ఒకే సమయంలో ఇద్దరు వ్యక్తులతో రిలేషన్‌షిప్‌లో ఉండొచ్చా అనే ప్రశ్నకు విజయ్ దేవరకొండ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. దానితో పాటు.. ఆయన లవ్ బ్రేకప్ గురించి చెప్పి షాకిచ్చారు.

ఓకే సమయంలో ఇద్దరిని ప్రేమించడం తను అంగీకరిచనన్న దేవరకొండ.. వేర్వేరు వ్యక్తులతో ప్రేమలో పడటం సహజమేనని చెప్పుకువచ్చారు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో రిలేషన్‌షిప్‌లో ఉంటారన్న విజయ్.... ఉదాహరణకు నా స్నేహితులు చాలామంది రిలేషన్‌షిప్‌లో ఉన్నారని తెలిపారు. తమ భాగస్వామిని ఎంతగానో ప్రేమించారు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ రిలేషన్ ముందుకు వెళ్లలేదని చెప్పుకువచ్చారు. దానివల్ల కొన్నేళ్లపాటు బాధ అనుభవించారని తెలిపారు.

Family Star Vijay Devarakonda Talk About His Love And Breakup Full Details Here

ఆ తర్వాత మరొకరిని కలిశారు.. వారు మళ్లీ ప్రేమలో పడ్డారని చెప్పుకువచ్చాడు. కాబట్టి, వేర్వేరు వ్యక్తులతో ప్రేమలో ఉండటం ఓకే... కానీ, ఒకే సమయంలో ఇద్దరితో ప్రేమలో ఉండటాన్ని నేను ఒప్పుకోను అంటూ వెల్లడించారు విజయ్ దేవరకొండ. మహిళలపై తనకు అమితమైన గౌరవం ఉందన్న విజయ్... ఒకరితో ప్రేమలో ఉన్నప్పుడు వేరే అమ్మాయిని తన జీవితంలోకి ఆహ్వానించనని తెలిపాడు. ప్రేమించిన అమ్మాయినే సర్వస్వంగా భావిస్తానని చెప్పుకువచ్చాడు.

గతంలో నేనొకరిని ప్రేమించా. అది వర్కౌట్‌ కాలేదని బయటపెట్టాడు విజయ్. ప్రస్తుత విజయ్ కామెంట్స్, ఆయన లవ్ గురించి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక కొత్త దర్శకులతో కలిసి వర్క్‌ చేస్తారా అని అడగ్గా... కొత్త దర్శకులతో వర్క్‌ చేయాలని నేను అనుకోవడం లేదన్నట్లు చెప్పుకువచ్చాడు. ఇక ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్ పై నిర్మించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X