దుమ్మురేపుతున్న భారతీయుడు2 ఫ్యాన్ మేడ్ పోస్టర్!

గత కొన్ని రోజులుగా విశ్వనటుడు కమల్ హాసన్ నటించబోయే భారతీయుడు 2 గురించి చర్చ ఎక్కువగా జరుగుతోంది. దాదాపు 22 ఏళ్ల తరువాత కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో రాబోతున్న చిత్రం కావడంతో అందరిలో ఉత్కంఠ మొదలైంది. ఇప్పటికే శంకర్ ఈ చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభించాడు.
ఏపీలోని కడప జిల్లాలో శంకర్ లొకేషన్ల వేట ప్రారంభించాడు. ఇదిలా ఉండగా భారతీయుడు 2 పోస్టర్ ఒకటి సోషల్ మీడియాలో దుమ్ము రేపుతోంది. ఈ ఉదయం నుంచి పోస్టర్ వైరల్ గా మారింది. కానీ అది అధికారికంగా విడుదుల చేసిన పోస్టర్ కాదు. ఫ్యాన్ మేడ్ పోస్టర్.
చిత్ర యూనిట్ విడుదల చేసిందంటూ జరుగుతున్న ప్రచారంపై స్వయంగా కమల్ హాసన్ పీఆర్వో స్పందించారు. భారతీయుడు 2 చిత్రానికి సంబంధించి ఎలాంటి పోస్టర్ విడుదల చేయలేదు. భారతీయుడు చిత్రానికి ఉన్న క్రేజ్, కమల్ పై ఉన్న అభిమానంతో ఫ్యాన్స్ కొన్ని పోస్టర్స్ తయారు చేసి వైరల్ చేస్తున్నారని తెలిపారు.
ఫ్యాన్ మేడ్ పోస్టర్ అయినప్పటికీ చాలా ఆసక్తికరంగా ఉంది. భారతీయుడు చిత్రంలో కమల్ ఉపయోగించిన మర్మ కళని చూపుతూ చేతిని ఈ పోస్టర్ లో చూపించారు. 2.0 చిత్రం ఓ కొలిక్కి వచ్చిన వెంటనే ఈ చిత్రం ప్రారంభమయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











