పాలకొల్లులో బన్నీ సంక్రాంతి సెలబ్రేషన్స్... ఫ్యాన్స్ గ్రాండ్ వెల్‌కం, ర్యాలీగా (ఫోటోస్)
Recommended Video

పండగ వచ్చిందంటే సిటీలో ఉండే వారంతా తమ సొంతూరు వెళ్లేందుకు, అక్కడే ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకునేందుకు ఇష్టపడతారు. హైదరాబాద్ సిటీ సగం ఖాళీ అయిపోతుంది. తాజాగా సంక్రాంతి సందర్భంగా భాగ్యనగరంలో అలాంటి పరిస్థితే ఉంది. సినీ స్టార్లు కూడా సంక్రాంతి వేడుకలను తమ సొంతూర్లో జరుపుకునేలా ప్లాన్ చేసుకున్నారు.
మొన్న దసరా సంబరాలను తెలంగాణలోని తన అత్తారింట్లో(నల్గొండ జిల్లా పెద్దవూర మండలం చింతపల్లి గ్రామం) జరుపుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్... ఇపుడు సంక్రాంతి వేడుకల కోసం తన సొంతూరైన పాలకొల్లుకు వెళ్లారు.

గ్రాండ్ వెల్‌కం...
పాలకొల్లు వెళ్లేందుకు హైదాబాద్ నుంచి రాజమండ్రి ఎయిపోర్టులో ఫ్యామిలీతో కలిసి ల్యాండ్ అయిన స్టైలిష్ స్టార్‌కు అభిమానుల నుంచి గ్రాండ్ వెల్‌కం లభించింది.

ర్యాలీగా...
రాజమండ్రి నుంచి పాలకొల్లు దాదాపు 50 కిలోమీటర్ల దూరం. భారీగా తరలి వచ్చిన అభిమానులు అక్కడి నుంచి బైక్ ర్యాలీగా బన్నీనీ పాలకొల్లు తీసుకెళ్లారు. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ పాల్గొన్నారు.

అభిమానులకు అభివాదం చేస్తూ...
అభిమానులకు అభివాదం చేస్తున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. సంక్రాంతి పండగ పూర్తయ్యే వరకు బన్నీ పాలకొల్లులోనే గడపబోతున్నారు.

అల్లు అర్జున్ మూవీస్
అల్లు అర్జున్ సినిమాల విషయానికొస్తే... ఆయన చివరి సినిమా 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' విడుదలై ఆరు నెలలు దాటిపోయింది. తర్వాతి సినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయబోతున్నారు. అల్లు అర్జున్- త్రివిక్రమ్ కాంబినేషన్లో గతంలో జులాయి, సన్నాఫ్ సత్యమూరి లాంటి హిట్ సినిమాలు వచ్చాయి. దీని తర్వాత వీరు ముచ్చటగా మూడోసారి కలిసి పని చేస్తున్నారు. సంక్రాంతి తర్వాత షూటింగ్ ప్రారంభం కానుంది.


Click it and Unblock the Notifications











