వద్దని చెప్పినా... అర్ధరాత్రి ఎన్టీఆర్ ఇంటి వద్ద అభిమానుల హంగామా!

Recommended Video

Jr NTR Fans Hungama @ NTR house

జూ ఎన్టీఆర్ అభిమానులకు నేడు(మే 20) పండగ రోజు. సన్నిహితులు ముద్దుగా తారక్ అని పిలుచుకునే ఈ నందమూరి స్టార్ 36వ వసంతంలోకి అడుగు పెడుతున్నాడు. యంగ్ టైగర్‌ను విష్ చేసేందుకు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి అభిమానులు హైదరాబాద్ తరలివచ్చారు.

అభిమానుల రాకతో మెహదీపట్నంలోని ఎన్టీఆర్ నివాస ప్రాంగణం సందడిగా మారింది. ఆదివారం అర్ధరాత్రి నుంచే ఫ్యాన్స్ ఇక్కడికి చేరుకుని హంగామా చేయడం ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఎన్టీఆర్

తన తండ్రి హరికృష్ణ మరణించి ఇంకా సంవత్సరం పూర్తి కాని నేపథ్యంలో ఈ సారి పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండాలని ఎన్టీఆర్ నిర్ణయించుకున్నారు. అయితే అభిమానులు మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా ఎన్టీఆర్‌ను విష్ చేసేందుకు ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు.

బాణాసంచా పేలుస్తూ హంగామా

అర్దరాత్రి 12 దాటగానే అభిమానులు ఎన్టీఆర్ ఇంటి వద్ద బాణా సంచా పేలుస్తూ హంగామా క్రియేట్ చేశారు. జై ఎన్టీఆర్, హ్యాపీ బర్త్ డే ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేస్తూ పరిసరాలను హోరెత్తించారు. కొందరు ఫ్యాన్స్ తెల్లవారు ఝాము వరకు అక్కడే గడిపారు. అయితే నందమూరి నివాసంలో పుట్టినరోజు హడావుడి ఏమీ కనిపించక పోవడం కొందరు నిరాశగా వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.

RRR టీం విషెస్

RRR టీం ఎన్టీఆర్‌ను విష్ చేస్తూ ట్విట్ చేసింది. ‘‘శక్తివంతుడు, భయంకరుడు మా కొమురం భీంకు పుట్టినరోజు శుభాకాంక్షలు'' అంటూ విష్ చేసింది. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ కొమురం భీం పాత్రలో పాటు రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. బాహుబలి తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ ప్రాజెక్ట్ ఇది. డివివి దానయ్య రూ. 350 కోట్ల నుంచి రూ. 400 కోట్ల బడ్జెట్ రేంజిలో దీన్ని తెరకెక్కిస్తున్నారు.

దద్దరిల్లుతున్న సోషల్ మీడియా

దద్దరిల్లుతున్న సోషల్ మీడియా

తెలుగు సోషల్ మీడియా సర్కిల్‌లో ఎక్కడ చూసినా ఎన్టీఆర్ పుట్టినరోజుకు సంబంధించిన హడావుడే కనిపిస్తోంది. ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఇలా అన్ని మాధ్యమాల్లోనూ ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. పలువురు తెలుగు సెలబ్రిటీలు సైతం ఎన్టీఆర్‌ను విష్ చేస్తూ ట్వీట్స్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X