Megastar Chiranjeevi పై ఫ్యాన్స్ అంతులేని ప్రేమ.. 6 వేల మందితో అద్భుత దృశ్యకావ్యం
తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న చిరంజీవి ఆరుపదుల వయసు దాటినా కూడా ఇంకా అదే ఎనర్జీతో కనిపిస్తున్నారు. నేటితరం యువ హీరోలకు ఏమాత్రం తక్కువ కాకుండా శరవేగంగా ప్రాజెక్టులను పూర్తి చేస్తూ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. కేవలం వెండితెరపై మాత్రమే కాకుండా నిజజీవితంలో కూడా ఆయన ఎన్నో సామాజిక సేవ కార్యక్రమాల్లో పాల్గొని నలుగురికి స్ఫూర్తిగా నిలిచారు.
ఎంతోకాలంగా రక్తదానంతో కోట్లాదిమంది ప్రాణాలకు అండగా నిలిచారు. అలాగే కరోనా కష్టకాలంలో కూడా మెగాస్టార్ చిరంజీవి అభిమానుల చేత సేవా కార్యక్రమాలు కొనసాగేలా చేశారు. ఆక్సిజన్ లేక ఎంతోమంది ప్రాణాలు వదులుతున్న సమయంలో ఆయన రెండు రాష్ట్రాల్లో కూడా తన అభిమానుల సహాయంతో ఆపదలో ఉన్నవారికి ఆక్సిజన్ సిలిండర్స్ కూడా అందించారు. అలాగే తన అభిమానులు ఎవరైనా ప్రాణాపాయాపాస్థితిలో ఉన్నారు అని తెలిసిన కూడా ఆయన ఎన్నోసార్లు ఆర్థికంగా సహాయపడ్డారు. పేదవారికి కూడా చాలాసార్లు ఆర్థికంగా అండగా నిలిచారు.

అలాంటి మెగాస్టార్ కు అభిమానులలో ఉండే ప్రేమ అమితంగా ఉంటుంది అని చెప్పవచ్చు. అయితే రీసెంట్ గా కొంతమంది విద్యార్థులు మెగాస్టార్ పై ఉన్న అభిమానాన్ని చూపించిన విధానం అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటుంది. వందల సంఖ్యలో కాదు ఏకంగా 6000 మంది విద్యార్థులు ఒక గ్రౌండ్లో మెగాస్టార్ చిరంజీవి చిత్రాన్ని చూపించిన తీరుకు అందరూ ఆశ్చర్యపోయారు. ఆ విద్యార్థులు తమ అభిమానాన్ని ఓ కళాఖండంగా మలిచి కోట్లహృదయాలలో కొలువైన మెగాస్టార్ చిరంజీవి గారికి అందించిన అద్భుత దృశ్యకావ్యం.. ఇప్పుడు రెండు రాష్ట్రాల అభిమానులను కూడా ఆకట్టుకుంటుంది. అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వాల్తేరు వీరయ్య సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











