twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Prabhas రిస్క్ చేయక తప్పట్లేదు.. వాళ్ళతో వద్దంటూ ఫ్యాన్స్ డిమాండ్?

    |

    టాలీవుడ్ డార్లింగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుసగా రెండు సినిమాలతో బాక్సాఫీస్ వద్ద దారుణమైన ఫలితాలను అందుకోవడం అభిమానులకు ఏ మాత్రం నచ్చలేదు. మొదటి సినిమా సాహో పరవాలేదు అనిపించినప్పటికీ ఆ తర్వాత వచ్చిన రదే శ్యామ్ సినిమా అయితే మరి దారుణంగా ఏ భాషలో కూడా వర్కౌట్ కాలేకపోయింది. అయితే ఆ రెండు సినిమాలో చేదు అనుభవాలను మిగిల్చినప్పటికీ కూడా ప్రభాస్ రేంజ్ అయితే తగ్గలేదు.

    ప్రస్తుతం అతని లైనప్ లో ఉన్న సినిమాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ముఖ్యంగా అందరి ఫోకస్ అయితే వచ్చే ఏడాది రాబోయే సలార్ సినిమా పైనే ఉంది. అంతకుముందు రామాయణం కథ ఆదిపురుష్ సినిమా విడుదలవుతున్నప్పటికీ కూడా ఎక్కువ మంది మాస్ ప్రేక్షకులు మాత్రం సలార్ కోసమే ఎదురు చూస్తున్నారు. ఇక ఆ సినిమా కంటే ముందు ప్రభాస్ యూవి క్రియేషన్స్ లోనే మరొక సినిమా చేయాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే సాహూ రాదే శ్యామ్ రెండు సినిమాలు కూడా దారుణంగా దెబ్బకొట్టడంతో వారి మిత్రులు యూవీ క్రియేషన్స్ ఆర్థికంగా కొంత నష్టపోవాల్సి వచ్చింది.

    Fans not happy on Prabhas uv creations next project

    అయితే వారితోనే ప్రభాస్, మారుతి దర్శకత్వంలో చిన్న బడ్జెట్లో భారీగా లాభాలు వచ్చే సినిమా చేయాలని అనుకున్నారు. కానీ ఇటీవల మారుతి పక్కా కమర్షియల్ సినిమాతో డిజాస్టర్ అందుకోవడం వలన మళ్ళీ ఆ కాంబో డైలామాలో పడింది. అయినప్పటికీ కూడా అంతకుముందే మారుతీతో వద్దు అని ఆడియన్స్ కొనుకున్నారు. కానీ ఇచ్చిన కమిట్మెంట్ కారణంగా ఇప్పుడు ప్రభాస్ మారుతితో కాకపోయినా యూవీ ప్రొడక్షన్ లోనే మరెవరితో అయినా సినిమా చేయాలని అనుకుంటున్నాడు.

    ఏదేమైనా కూడా మళ్లీ యూవి క్రియేషన్స్ కు మంచి సక్సెస్ అందించే ట్రాక్ లోకి తీసుకురావాలని కూడా అనుకుంటున్నాడు. కానీ యూవి క్రియేషన్స్ మాత్రం మంచి స్క్రిప్టులను సెలెక్ట్ చేయడం లేదు అలాగే సక్సెస్ ఇచ్చే దర్శకులను కూడా సెలెక్ట్ చేయడం లేదు అనే నెగిటివ్ కామెంట్స్ అయితే అందుకుంటుంది. అభిమానులు అయితే యూవీ క్రియేషన్స్ తో కాకుండా మరెవరితో అయినా చేయాలి అని డిమాండ్ చేస్తున్నారు. మరి ప్రభాస్ ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో తెలియాలి అంటే తదుపరి అప్డేట్ వచ్చేవరకు ఆగాల్సిందే.

    English summary
    Fans not happy on Prabhas uv creations next project
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X