Vijay Devarakonda: లైగర్​ కోసం విజయ్ దేవరకొండ ఇంతలా కష్టపడ్డాడా? వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే!

పెళ్లి చూపులు సినిమాతో హీరోగా తనముద్ర వేసుకున్నాడు రౌడీ హీరో విజయ్​ దేవరకొండ. తర్వాత వచ్చిన అర్జున్​ రెడ్డి, గీత గోవిందం సినిమాలతో ఫుల్​ పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఇక ఇటీవల పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లైగర్​ మూవీతో తన కెరీర్​లో మొదటగా పాన్ ఇండియా చిత్రం చేశాడు. అయితే అనేక భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ అనుకున్నంతగా హిట్ సాధించలేకపోయింది. కానీ ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ పడిన కష్టం చూస్తే షాక్ అవ్వాల్సిందే. లైగర్​లో బాక్సింగ్ సన్నివేశాల కోసం విజయ్​ దేవరకొండ ఎలా కష్టపడ్డాడో ఓ వీడియోలో చూపించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట ట్రెండ్​ అవుతోంది.

స్టోరీ ఎలా ఉన్నా..

స్టోరీ ఎలా ఉన్నా..

ఇక విజయ్ దేవరకొండ గురించి పక్కనే పెడితే.. టాలీవుడ్ డేరింగ్​ అండ్​ మాస్​ డైరెక్టర్ అంటే వెంటనే గుర్తు వచ్చే పేరు పూరీ జగన్నాథ్. ఆయన సినిమాలకు ఓ సెపరేట్​ ఫ్యాన్​ బేస్ ఉంది. జయాపజయాల సంగతి పక్కన పెట్టి ఆయన డైలాగ్స్​, స్క్రీన్​ ప్లేకు అభిమానులు ఎంతో మంది ఉన్నారు. పూరి జగన్నాథ్ సినిమా వస్తుందంటే చాలు స్టోరీ ఎలా ఉన్నా.. మూవీ టేకింగ్​, డైలాగ్స్ కోసం ఎగబడి చూసే వారు ఎక్కువే.

డిజాస్టర్ టాక్​..

డిజాస్టర్ టాక్​..

అలాంటి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రౌడీ హీరోగా ముద్ర వేసుకున్నవిజయ్​ దేవరకొండ సినిమా అంటే ఆ హైప్​ మాములుగా రాలేదు. మళ్లీ అందులోనూ లైగర్ మూవీ బాక్సింగ్​ (మిక్స్​డ్ మార్షల్​ ఆర్ట్స్​) నేపథ్యంలో ఉండటం, బాక్సింగ్​ లెజండరీ మైక్​ టైసన్​ నటించడంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటాయి. ఈ అంచనాలను తలకిందులు చేస్తూ లైగర్​ మూవీ డిజాస్టర్​ టాక్​ తెచ్చుకుంది.

విజయ్ దేవరకొండ యాక్టింగ్​కు ఫిదా..

విజయ్ దేవరకొండ యాక్టింగ్​కు ఫిదా..

ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన లైగర్​ చిత్రం ఎలా ఉన్నా విజయ్​ దేవరకొండ యాక్టింగ్​కు, యాక్షన్​కు ఆడియెన్స్ ఫిదా అయ్యారు. లైగర్​లో విజయ్ దేవరకొండ అలా స్టంట్స్​ చేయడానికి తెర వెనుక పడిన కష్టం చాలానే ఉంది. దాదాపు 2 సంవత్సరాలు సిక్స్ ప్యాక్​ను మెయింటేన్ చేయడం, బాక్సింగ్​లో శిక్షణ తీసుకోవడం, రెగ్యూలర్​గా డైట్​ ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి.

వీడియో చూస్తే షాక్​..

వీటన్నింటికి మించి లైగర్​లో బాక్సింగ్​ సీన్లలో నటించేందుకు విజయ్​ దేవరకొండ పడిన కష్టం చూస్తే ఔరా అనిపించేలా ఉంది. ఇందుకు సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్​ మీడియాలో హల్​చల్​ చేస్తోంది. లైగర్​ సినిమా కోసం విజయ్​ దేవరకొండ హార్డ్​ వర్క్​, డెడికేషన్​ చూడండి అంటూ ఫ్యాన్స్​, నెటిజన్లు ఆ వీడియోను నెట్టింట షేర్​ చేస్తున్నారు. ఈ వీడియోలో బాక్సింగ్​ రింగ్​లో చేసే ఫైట్​ సీన్​ కోసం విజయ్​ దేవరకొండ ప్రాక్టీస్​ చేసినట్లుగా తెలుస్తోంది.

థ్రిల్లింగ్​గా వీడియో..

థ్రిల్లింగ్​గా వీడియో..

ఈ వీడియో చూస్తే అది ప్రాక్టీస్​లా కనిపించట్లేదు. సేమ్​ సినిమాలో తెరకెక్కించిన ఫైట్​ సీన్​లానే కనిపిస్తోంది. ప్రత్యర్థిని విజయ్​ దేవరకొండ కొట్టడం, అతను విజయ్​ను తన్నడం, మధ్య మధ్యలో విజయ్​ దేవరకొండ సెటైరికల్​ నవ్వులతో ఆద్యంతం థ్రిల్లింగ్​గా ఉంది ఈ వీడియో. ఇక ఇదిలా ఉంటే ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన లైగర్​ మూవీ ఫ్లాప్ టాక్​ను తెచ్చుకున్న విషయం తెలిసిందే.

రెమ్యునరేషన్​లో కొంత వెనక్కి..

రెమ్యునరేషన్​లో కొంత వెనక్కి..

ఇలా అన్ని భాషల్లోనూ లైగర్ డిజాస్టర్​ టాక్​ తెచ్చుకోవడంతో మూవీ నిర్మాతలకు పెద్ద ఎత్తున నష్టాలను మిగిల్చిందని సినీ విశ్లేషకులు అంటున్నారు. దీంతో నాన్​ థియేట్రికల్​ రైట్స్​లో తన వాటాతో పాటు పారితోషికంలోని రూ. 6 కోట్లను నిర్మాతలకు విజయ్ దేవరకొండ తిరిగి వెనక్కి ఇచ్చి మంచి మనసు చాటుకున్నాడని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X