For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Mahesh Babu: సూపర్ స్టార్‌కు ఫ్యాన్స్ షాక్.. సినిమాలు ఆపేయ్ అంటూ డిమాండ్.. చరిత్రలో తొలిసారి ఇలా!

  |

  టాలీవుడ్‌లోకి ఎంతో మంది బడా హీరోల వారసులు పరిచయం అయ్యారు. అయితే, అందులో కొందరు మాత్రమే బడా స్టార్లుగా ఎదిగిపోయి హవాను చూపిస్తున్నారు. అలాంటి వారిలో సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన మహేశ్ బాబు ఒకడు. ఫాదర్ సపోర్టుతో సినిమాల్లోకి వచ్చినా.. తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయిన అతడు.. దాదాపు రెండు దశాబ్దాలుగా స్టామినాను చూపిస్తూ ముందుకెళ్తోన్నాడు. ఈ క్రమంలోనే వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా మహేశ్‌కు అతడి ఫ్యాన్స్ షాకిచ్చారు. ఆ వివరాలు మీకోసం!

   హ్యాట్రిక్ హిట్లతో మహేశ్ దూకుడు

  హ్యాట్రిక్ హిట్లతో మహేశ్ దూకుడు

  ఆ మధ్య కొన్ని డిజాస్టర్లతో ఇబ్బంది పడిన సూపర్ స్టార్ మహేశ్ బాబు ఈ మధ్య కాలంలో ఫుల్ జోష్‌లో ఉన్నాడు. కొరటాల శివతో చేసిన 'భరత్ అనే నేను' నుంచి వరుసగా 'మహర్షి', 'సరిలేరు నీకెవ్వరు' వంటి భారీ హిట్లు తన ఖాతాలో వేసుకున్న అతడు ఇలా హ్యాట్రిక్‌ను కూడా అందుకున్నాడు. అలాగే ఎన్నో రికార్డులను క్రియేట్ చేసి ఉత్సాహంగా దూసుకెళ్తోన్నాడు.

  బ్రాతో బిగ్ బాస్ దివి అరాచకం: బాడీ మొత్తం చూపిస్తూ హాట్ వీడియో

   సర్కారు వారి పాట ఫలితం ఇలా

  సర్కారు వారి పాట ఫలితం ఇలా

  ఈ ఏడాది సూపర్ స్టార్ మహేశ్ బాబు.. పరశురాం దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' అనే సినిమా చేశాడు. ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ దక్కాయి. అయితే, ఆ తర్వాత కాస్త నెమ్మదించిన ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను చేరకుండానే ఆగిపోయింది. అయినప్పటికీ మహేశ్ ఈ రిజల్ట్‌ను పట్టించుకోకుండా సినిమాలు చేస్తున్నాడు.

   త్రివిక్రమ్‌తో మహేశ్ క్రేజీ మూవీ

  త్రివిక్రమ్‌తో మహేశ్ క్రేజీ మూవీ

  కొంత కాలంగా వరుస చిత్రాలతో దూసుకుపోతోన్న మహేశ్ బాబు.. ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే ఇందులో హీరోయిన్‌గా చేస్తోంది. థమన్ దీనికి సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే పలు షెడ్యూళ్లు జరుపుకున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.

  శృతి మించిన శివాత్మిక బోల్డు షో: ఆ డ్రెస్సేంటి.. ఆ ఫోజులేంటి బాబోయ్!

  రాజమౌళి సినిమా.. వచ్చే ఏడాది

  రాజమౌళి సినిమా.. వచ్చే ఏడాది

  దర్శకధీరుడు రాజమౌళి.. సూపర్ స్టార్ మహేశ్ బాబుతో సినిమా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ, అదెప్పుడు మొదలవుతుందనేది చెప్పలేదు. దీంతో ఈ సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుంది? ఏ జోనర్‌లో రూపొందనుంది? ఏ రేంజ్‌లో దీన్ని తీస్తారు? అనే దానిపై ఆసక్తి నెలకొంది. అదే సమయంలో ఈ ప్రాజెక్టుపై ఎన్నో గాసిప్స్ వైరల్ అవుతున్నాయి.

  ఫ్యాన్స్ అసంతృప్తి.. రిక్వెస్ట్ చేసి

  ఫ్యాన్స్ అసంతృప్తి.. రిక్వెస్ట్ చేసి

  సూపర్ స్టార్ మహేశ్ బాబు ఎక్కువగా కమర్షియల్ చిత్రాలు చేస్తుంటాడు. అయితే, ఈ మధ్య కాలంలో అతడు సందేశాత్మక కథలతో మూవీలు చేస్తూ వస్తున్నాడు. అలా కొన్ని విజయాలను కూడా అందుకున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో అతడి అభిమానులు మెసేజ్‌లు ఇచ్చే సినిమాలు చేయొద్దని అతడికి రిక్వెస్టులు చేస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

  Bigg Boss: డబుల్ ఎలిమినేషన్ వెనుక కుట్ర.. ఒకరి బదులు మరొకరు ఎలిమినేట్.. లీకైన సెన్సేషనల్ న్యూస్

  మహేశ్ బాబుకు షాకిచ్చిన ఫ్యాన్స్

  మహేశ్ బాబుకు షాకిచ్చిన ఫ్యాన్స్

  ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న టాలీవుడ్‌లోని స్టార్ హీరోల్లో సూపర్ స్టార్ మహేశ్ బాబు ఒకడన్న విషయం తెలిసిందే. అతడి అభిమానుల కోసమే అతడు వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా మహేశ్ ఫ్యాన్స్ ట్విట్టర్‌లో StopDoingRoutineMoviesMahesh (రొటీన్ సినిమాలు చేయడం ఆపేయ్ మహేశ్) అనే ట్యాగ్‌ను బాగా ట్రెండ్ చేస్తున్నారు.

  ట్రెండింగ్‌లో.. తొలిసారి ఇలా

  ట్రెండింగ్‌లో.. తొలిసారి ఇలా

  మహేశ్ ఫ్యాన్స్ చేసిన StopDoingRoutineMoviesMahesh హ్యాష్ ట్యాగ్ నేషనల్ రేంజ్‌లో ట్రెండింగ్ అవుతోంది. ఈ క్రమంలోనే అతడి అభిమానులు ఫలానా జోనర్‌లో, ఫలానా కథతో, ఫలానా రోల్‌లో సినిమాలు చేయమని కూడా సలహాలు ఇస్తున్నారు. దీంతో ఇప్పుడిది హాట్ టాపిక్ అవుతోంది. ఇదిలా ఉండగా.. మహేశ్‌ ఫ్యాన్స్ ఇలా చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

  English summary
  Mahesh Babu Now Doing his 28 film with Trivikram Srinivas. Now His Fans Request to This Star Via Twitter Trend.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X