హృతిక్ రోషన్ భార్యకి 400 కోట్ల భరణం? 13 ఏళ్ల తర్వాత ఆమె షాకింగ్‌గా..

భారతదేశంలో నటీనటుల విడాకులు అనేది ఎప్పుడూ హాట్ టాపిక్కే. సహజంగానే సెలబ్రిటీల వ్యక్తిగత జీవితం, వారి గురించి ఆసక్తికర విశేషాలు తెలుసుకోవడానికి ప్రజలు ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఏళ్లు గడుస్తున్నా కొందరు తారల ప్రేమాయణాలు, పెళ్లిళ్లు, విడాకులు ఇప్పటికే చర్చనీయాంశంగానే ఉంటాయి. ఇలాంటి వాటిలోనే ఒకటి హృతిక్ రోషన్- సుసానే ఖాన్‌ల పెళ్లి, విడాకులు. విడిపోయి 13 ఏళ్లు కావొస్తున్నప్పటికీ ఇప్పటికీ ఈ జంట గురించి బాలీవుడ్‌లో చర్చించుకుంటూనే ఉంటారు. తాజాగా హృతిక్ - సుసానే ఖాన్‌ల విడాకుల సెటిల్‌మెంట్ అంశం తెరపైకి వచ్చింది. ఈ వివరాల్లోకి వెళితే..

గ్రీకు వీరుడి లాంటి రూపంతో అమ్మాయిల కలల రాకుమారుడిగా వెలుగొందుతున్నారు బాలీవుడ్ సూపర్‌స్టార్ హృతిక్ రోషన్. సామాన్యులే కాదు హీరోయిన్లు కూడా హృతిక్ అభిమానులే అంటే అతిశయోక్తి కాదు. తమకు కాబోయే భర్త హృతిక్‌లా ఉండాలని ఎంతో మంది అమ్మాయిలు కలగన్నారు. 50 ప్లస్‌లోనూ అదే ఎనర్జీ, అందంతో కుర్రాళ్లకు పోటీ ఇస్తున్నారు హృతిక్. బాలీవుడ్ దర్శక నిర్మాత రాకేష్ రోషన్ కుమారుడే హృతిక్ రోషన్. తండ్రి దర్శకుడు కావడంతో పాటు సినీ నేపథ్యం ఉండటంతో బాలనటుడిగా తొలుత ఎంట్రీ ఇచ్చారు హృతిక్. 2000లో కహోనా ప్యార్ హై సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, సింగర్‌గా భారతీయ చిత్ర పరిశ్రమపై తన ముద్ర వేశారు హృతిక్. మధ్యలో వరుస ఫ్లాప్స్‌ వచ్చినా నిలబడ్డారు.

Farah Khan Ali Denies Hrithik Roshan pays 400 Crore Alimony to Sussanne Khan as Divorce Settlement

సినీ పరిశ్రమలోకి రాకముందే సుసానే ఖాన్‌తో ప్రేమలో పడ్డారు హృతిక్. కుటుంబ సభ్యుల అంగీకారంతో ఆమెను 2000వ సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు హ్రెహాన్, హృదాన్ అనే కుమారులు సంతానం. కానీ ఏం జరిగిందో ఏమో కానీ 13 ఏళ్ల తమ వైవాహిక బంధానికి గుడ్‌బై చెప్పారు. 2013లో తాము విడిపోతున్నట్లు వీరిద్దరూ ప్రకటించారు. ఆ తర్వాత హృతిక్- సుసానే ఖాన్‌లకు కోర్టు విడాకులు మంజూరు చేసింది. ప్రేమించి పెళ్లి చేసుకుని, ఎంతో అన్యోన్యంగా జీవించిన వీరిద్దరూ విడిపోవడానికి కారణం ఏంటన్న దానిపై అనేక వాదనలు వినిపించాయి.

సుసానే‌తో విడిపోయిన తర్వాత హృతిక్ రోషన్ పలువురితో ప్రేమాయణాలు సాగించారు. బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్‌తో డేటింగ్ చేశారు. వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారని అనుకుంటుండగా అనూహ్యంగా ఈ రిలేషన్‌కు బ్రేకప్ చెప్పుకున్నారు. నాటి నుంచి హృతిక్‌ను టార్గెట్ చేస్తున్న కంగనా ఆయనపై పలుమార్లు సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది. కంగనాతో బంధానికి గుడ్ బై చెప్పిన తర్వాత నటి సబా ఆజాద్‌తో ప్రేమలో పడ్డ హృతిక్.. ప్రస్తుతం ప్రేమలో మునగి తేలుతున్నారు. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారని బాలీవుడ్ కోడై కూస్తోంది.

కాగా.. విడాకుల సమయంలో హృతిక్ రోషన్.. సుసానే ఖాన్‌కు 400 కోట్ల రూపాయల భరణం చెల్లించారని నాటి నుంచి నేటి వరకు వార్తలు వస్తూనే ఉన్నాయి. దీని ప్రకారం బాలీవుడ్‌లో అత్యంత ఖరీదైన విడాకులు వీరివేనని మీడియా చెబుతోంది. ఈ భరణం ద్వారా సుసానే ఖాన్ మరింత సంపన్నురాలు అయ్యిందని కథనాలు వచ్చాయి. అయితే ఇందులో ఏ మాత్రం నిజం లేదని అంటున్నారు సుసానే ఖాన్ సోదరి, ప్రముఖ జ్యువెలరీ డిజైనర్ ఫరాఖాన్ అలీ. హృతిక్ - సుసానే ఖాన్‌ల విడాకులపై మీడియాలో తీవ్ర చర్చ జరిగింది. వీరిద్దరి వ్యక్తిత్వంపై చాలామంది రకరకాలుగా కామెంట్స్ చేశారు. అయినప్పటికీ హృతిక్- సుసానేలు ఆ క్లిష్ట పరిస్ధితిని ఎదుర్కొన్నారు. అలాగే తన సోదరి 400 కోట్ల భరణం తీసుకున్నారన్న వార్తలు అవాస్తవం. ఈ కథనాలు చూసి ఎంతో బాధపడ్డానని ఫరాఖాన్ తెలిపారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు బాలీవుడ్‌లో తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. ఫరాఖాన్ క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పటి వరకు హృతిక్ - సుసానే ఖాన్‌ల విడాకుల సెటిల్‌మెంట్‌పై వస్తోన్న వార్తలకు చెక్ పడినట్లయ్యింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X