Don't Miss!
- Lifestyle
Today Rasi Phalalu:ఈ రోజు మీ ప్రయత్నాలలో విజయం సాధిస్తారు? మీ రోజువారీ జాతకం చెబుతుంది.
- News
టీఆర్ఎస్కు మును‘గోడు’: కూసుకుంట్లను వ్యతిరేకిస్తూ రచ్చ, ఓటమి ఖాయమంటూ వార్నింగ్
- Sports
లక్నో ఫ్రాంచైజీ గ్రూప్ కొన్న జట్టు తరఫున సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఆడబోయే స్టార్లు వీరే..!
- Finance
Investments: చైనా, తైవాన్లలో పెట్టుబడులు పెట్టిన దేశీయ ఇన్వెస్టర్లకు కన్నీళ్లు.. ఎందుకంటే..
- Travel
దక్షిణ మధ్య రైల్వేలో విస్టాడోమ్ కోచ్‌తో నడిచే మొట్టమొదటి రైలు
- Technology
ఇన్స్టాగ్రామ్ వినియోగదారుల డేటాను ట్రాక్ చేస్తోంది!!
- Automobiles
బ్రేకింగ్ న్యూస్: మారుతి సుజుకి స్విఫ్ట్ సిఎన్జి Swift CNG విడుదల, ధర రూ.7.77 లక్షలు
Happy Father's Day: తండ్రితో ఉన్న లవ్లీ ఫొటోను షేర్ చేసుకున్న మెగాస్టార్.. స్పెషల్ పోస్ట్ వైరల్
తెలుగు చిత్ర పరిశ్రమలో ఎనలేని గుర్తింపును అందుకున్న వారిలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన చూడని సక్సెస్ లేదు అందుకోని రికార్డులు లేవు. తెలుగు చిత్ర పరిశ్రమలో చిరస్థాయిగా నిలిచిపోయే అతికొద్ది మంది పేర్లలో మెగాస్టార్ చిరంజీవి పేరు టాప్ లిస్ట్ లో ఉంటుంది అనే చెప్పాలి. ఆరు పదుల వయసు దాటినా కూడా మెగాస్టార్ చిరంజీవి ఇంకా అగ్రహీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉన్నారు.
ఇక పోటీగా ఎంత మంది స్టార్ హీరోలు ఉన్నప్పటికీ కూడా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది అని చెప్పాలి. మెగాస్టార్ చిరంజీవికి అభిమానులతో పాటు ఫ్యామిలీ అంటే కూడా ఎంతగానో ఇష్టపడతారు. సినిమాలతోనే కాకుండా ఆయన కుటుంబ సభ్యులతో కూడా ఎక్కువ సమయాన్ని గడిపే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక స్టార్ హీరోగా ఎంత స్థాయికి ఎదిగినా కూడా ఆయన ఏనాడు కూడా జన్మనిచ్చిన తల్లిదండ్రులను కాస్త కూడా మరువలేదు.

మెగాస్టార్ గా గుర్తింపు అందుకున్న తర్వాత కూడా చిరంజీవి తన తండ్రి దగ్గర మాత్రం ఎంతో వినయంగా ఉండేవారు. మెగాస్టార్ తండ్రి కొణిదెల వెంకటరావు గురించి ఇండస్ట్రీలో కూడా చాలామందికి తెలుసు. ఆయన కొన్ని సినిమాల్లో కూడా చిన్న తరహా పాత్రల్లో నటించారు. కానీ ఎక్కువగా నటుడిగా మాత్రం కొనసాగలేదు. కేవలం చిరంజీవి కోరిక మేరకు ఆయన తండ్రి పాత్రలలో అలా గెస్ట్ పాత్రలో కనిపించేవారు.
అయితే నేడు ఫాదర్స్ డే సందర్భంగా మెగాస్టార్ ఎంత జ్ఞాపకమైన తన తండ్రి ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ఆయన తండ్రి గా ఉండడం ఎంతో గర్వకారణం అంటూ ఆయన కొడుకు పుట్టడం తన అదృష్టమని కూడా సోషల్ మీడియాలో ప్రత్యేకంగా ట్వీట్ చేశారు. ఎమోషనల్ గా అనిపించినా ఆ ట్వీట్ మెగా అభిమానులు కూడా ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇక మెగాస్టార్ ఒకప్పటి స్టిల్ కూడా అద్భుతంగా ఉంది అని ఆ ఫోటో పై నెటిజన్లు పాజిటివ్ గా కామెంట్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం మెగాస్టార్ బోళా శంకర్ సినిమాను ఫినిష్ చేసే పనుల్లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.