twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మెగాస్టార్ 28 ఏళ్ళ కోరిక.. చరణ్ ద్వారా ఆ డ్రీమ్ నిజమవుతోంది!

    |

    మెగాస్టార్ చిరంజీవి ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నారు అంటే తప్పకుండా ఆ సినిమాలో ఎదో ఒక హైలెట్ పాయింట్ ఉంటుంది. కమర్షియల్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నా కథ అన్నిటి కంటే ముఖ్యమని ఆయన జడ్జ్ చేస్తుంటారు. ఆయన జడ్జిమెంట్ వల్లనే మెగా హీరోలు అందరూ కూడా వారికాంటూ ఒక ట్రాక్ ను సెట్ చేసుకోగలిగారు. ఇక మెగాస్టార్ 28ఏళ్ల నుంచి మనసులో అనుకుంటున్న ఒక కోరిక ఇప్పుడు చరణ్ ద్వారా నిజం కాబోతున్నట్లు తెలుస్తోంది.

     దర్శకుడు నచ్చితే..

    దర్శకుడు నచ్చితే..

    మెగాస్టార్ చిరంజీవి చాలా వరకు టాలెంటెడ్ దర్శకులకు పిలిచి మరి అవకాశం ఇస్తుంటారు. దర్శకుడికి అనుభవం ఎంత అనే దానిపై కంటే అతని కాన్ఫిడెన్స్ ను ఆయన ఎక్కువగా నమ్ముతారు. కొత్తగా ట్రై చేసే దర్శకులకు సొంతంగా ఆఫర్స్ ఇచ్చేస్తుంటారు. ప్రస్తుతం మెగాస్టార్ వరుసగా నాలుగు సినిమాలను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే.

     28 ఏళ్ళ కోరిక..

    28 ఏళ్ళ కోరిక..

    అయితే ఒక దర్శకుడితో సినిమా చేయలేని మెగాస్టార్ గత 28 ఏళ్ల నుంచి కోరుకుంటున్నారు. శంకర్ మొదటి సినిమా జెంటిల్ మెన్ సినిమా చూసి అప్పట్లో ఫిదా అయిన మెగాస్టార్ ఆ సినిమాను శంకర్ తోనే బాలీవుడ్ లో రీమేక్ చేయాలని అనుకున్నాడు. కానీ ఆ తరువాత మహేష్ భట్ తో చేయాల్సి వచ్చింది. సినిమా అనుకున్నంత రేంజ్ లో అయితే సక్సెస్ అవ్వలేదు.

    శంకర్ కూడా ట్రై చేశాడు..

    శంకర్ కూడా ట్రై చేశాడు..

    ఇక శంకర్ తో సినిమా చేయాలని మధ్యలో కొన్నిసార్లు చర్చలు కూడా జరిగాయి కానీ వర్కౌట్ కాలేదు. రోబో సినిమా టైమ్ లోనే మెగాస్టార్ అతనితో వర్క్ చేయాలని ఉందని మొహమాటం లేకుండా చెప్పేశారు. శంకర్ కూడా డైరెక్ట్ గా తెలుగులో సినిమా చేయలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు. కానీ ఎందుకో మరి వర్కౌట్ కాలేదు.

    అఫీషియల్ అప్డేట్..

    అఫీషియల్ అప్డేట్..

    మెగాస్టార్ కు ఇంతవరకు శంకర్ తో సినిమా చేయాలనే కోరిక నెరవేరలేదు గాని ఆయన తనయుడు రామ్ చరణ్ తో సినిమా చేస్తే మాత్రం ఆ కోరిక తీరినట్లే. శంకర్ తో రామ్ చరణ్ సినిమా చేయడానికి రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల చర్చలు కూడా జరిగినట్లు సోషల్ మీడియాలో అనేక రకాల కథనాలు వస్తున్నాయి. త్వరలోనే ప్రాజెక్ట్ పై అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రానున్నట్లు సమాచారం.

    English summary
    Needless to say, the mega-fans are looking forward to the first film Acharya, directed by Megastar Chiranjeevi Star Director Koratala Siva. There has already been a clarion call that the megastar will appear in a different role than ever before. Otherwise, the suspense of the release of the film is yet to go
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X