Jr NTR: ఎన్టీఆర్ బర్త్‌డేకు ఫుల్ సర్‌ప్రైజ్‌లు.. నాలుగోది ఎవరూ ఊహించరు!

సినీ ఇండస్ట్రీలో హిట్లు కొట్టడం అంటే సాధారణమైన విషయం కాదు. అలాంటిది ఏకధాటిగా హిట్లు మీద హిట్లు కొడుతూ దూసుకుపోతోన్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. 'టెంపర్' నుంచి మొదలుకొని వరుసగా విజయాలను అందుకుంటోన్న అతడు.. RRR మూవీతో మరో సక్సెస్‌తో పాటు అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతిని సొంతం చేసుకున్నాడు. దీంతో మరింత ఉత్సాహంగా ఫ్యూచర్ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటోన్నాడు. ఇలా ఇప్పుడు తారక్ తన 30వ సినిమాను కొరటాల శివతో చేస్తోన్న విషయం తెలిసిందే.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు తన 30వ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. ఇలా ఇప్పటికే రెండు షెడ్యూళ్లను పూర్తి చేసుకున్న అతడు.. ఇప్పుడు మరో దానిలో కూడా భాగం కాబోతున్నాడు. ఇక, ఈ సినిమా నుంచి ఎన్టీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని టైటిల్‌తో కూడిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయబోతున్నారని ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం.. ఇది నిజమే అని అంటున్నారు. మే 19వ తేదీనే దీన్ని విడుదల చేసే అవకాశం ఉందట. ఇందులో తారక్ పవర్‌ఫుల్ లుక్‌తో దర్శనమివ్వబోతున్నాడని తెలుస్తోంది.

Four Surprises For Nandamuri Fans on Jr NTR Birthday

ఈ సినిమా నుంచే కాదు.. ఎన్టీఆర్ అభిమానుల కోసం మే 20వ తేదీన ఎన్నో సర్‌ప్రైజ్‌లను కూడా ప్లాన్ చేశారని తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. అతడి పుట్టినరోజున తారక్ 31వ సినిమాగా చెబుతోన్న WAR2 నుంచి అధికారిక ప్రకటనతో కూడిన పోస్టర్ రాబోతుందట. అలాగే, ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించే సినిమా నుంచి బర్త్‌డే విషెస్ పోస్టర్‌ను కూడా వదలబోతున్నట్లు తెలిసింది. ఈ రెండు పోస్టర్లలో అతడు డిఫరెంట్ లుక్‌లతో కనిపిస్తాడని సమాచారం.

Four Surprises For Nandamuri Fans on Jr NTR Birthday

ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అవుతోన్న సమాచారం ప్రకారం.. ఎన్టీఆర్ నటించబోయే మరో కొత్త సినిమాకు సంబంధించిన ప్రకటన కూడా మే 20వ తేదీన రాబోతుందట. ఈ ప్రాజెక్టును త్రివిక్రమ్ శ్రీనివాస్ లేదా వెట్రిమారన్ తెరకెక్కించే అవకాశం ఉందని అంటున్నారు. మొదటి మూడు ఊహించదగినవే అయినా.. ఇది మాత్రం అందరినీ కచ్చితంగా సర్‌ప్రైజ్ చేస్తుందని టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X