Junior సినిమాతో వెండితెర ఎంట్రీకి సిద్దమైన గాలి జనార్ధన్ తనయుడు.. హీరోయిన్ ఎవరంటే?

కర్ణాటక మాజీమంత్రి ప్రముఖ వ్యాపారవేత్త గాలి జనార్దన్ రెడ్డి తనయుడు వెండి తెరకు హీరోగా ఏఎంట్రీ ఇవ్వబోతున్నాడు. గాలి జనార్ధన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కర్ణాటకలో అత్యంత ధనవంతులైన రాజకీయ నాయకులలో ఆయన ఒకరు. గతంలోని ఆయన కూతురు పెళ్లితో దేశమంతా మాట్లాడుకునేలా చేశారు. వందల కోట్లు పెళ్లి కోసం ఖర్చుపెట్టినట్టు అప్పట్లో అనేక రకాల వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు ఆయన కొడుకు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు అనగానే ఒక్కసారిగా ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిపోయింది.

ఇక అతడి మొదటి సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు టైటిల్ కూడా రిలీజ్ చేశారు. జూనియర్ అనే సినిమాతో గాలి జనార్ధన్ కొడుకు గాలి కిరీటి వెండితెరకు పరిచయం కాబోతున్నాడు. ఇక ఈ సినిమా కేవలం కన్నడలోనే కాకుండా తెలుగు తమిళ్ మలయాళం భాషల్లో కూడా విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు. ఇక ఈ సినిమాలో భారీ క్యాస్టింగ్ తో పాటు ప్రముఖ టెక్నీషియన్స్ కూడా చేయబోతూ ఉండడం విశేషం. సినిమాలో హీరోయిన్ గా ప్రస్తుతం సక్సెస్ ట్రాక్లో కొనసాగుతున్న శ్రీలీల ను సెలెక్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

Gali Janardhan Reddys son Kireeti Official debut film titled Junior

ఇక మ్యూజిక్ డైరెక్టర్ గా పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్ అందుకున్న దేవి శ్రీ ప్రసాద్ ను ఫైనల్ చేసినట్లు తెలియజేశారు. ఇక RRR సినిమాటోగ్రాఫర్ గా సెంథిల్ కుమార్ ఈ సినిమాకు వర్క్ చేస్తూ ఉండడం విశేషం. ఇక ఒకప్పటి సౌత్ స్టార్ హీరోయిన్ జెనీలియా ఇందులో ఒక ముఖ్యమైన పాత్రలో కూడా కనిపించబోతోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ అయితే కర్ణాటకలో జరుగుతోంది. ఇక ప్రముఖ కన్నడ దర్శకుడు రాధ కృష్ణ రెడ్డి ఈ సినిమాను డైరెక్టర్ చేస్తున్నాడు. తప్పకుండా ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అని రొమాంటిక్ యూత్ ఫుల్ లవ్ స్టోరీ గా సినిమాను తెరకెక్కిస్తున్నట్లు రెగ్యులర్ ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టి సినిమా విడుదల తేదీ పై క్లారిటీ ఇవ్వాలి అని అనుకుంటున్నారు. మరి ఈ సినిమాతో గాలి జనార్దన్ ఏ విధంగా సక్సెస్ అందుకుంటాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X