Mahesh Babu: 'ఏ మాయ చేశావే' అసలు హీరో మహేశ్ బాబు.. రెజెక్ట్ చేసిన కారణం తెలిస్తే షాక్!

సుమారు ఇరవై ఏళ్లుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో తనదైన చిత్రాలు చేస్తూ.. హవాను చూపిస్తూ దూసుకెళ్తోన్నాడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు. దిగ్గజ నటుడు సూపర్ స్టార్ కృష్ణ కుమారుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. కెరీర్ ఆరంభంలోనే తనదైన నటనతో ప్రేక్షకులను ఫిదా చేశాడు. దీనికితోడు హ్యాండ్సమ్ లుక్స్‌తో లేడీ ఫ్యాన్స్‌ను సైతం విపరీతంగా సంపాదించుకున్నాడు.

అంతేకాదు, ఎన్నో హిట్లను సొంతం చేసుకుని స్టార్‌గా ఎదిగిపోయాడు. అప్పటి నుంచి వరుసగా సినిమాలు చేస్తూ సత్తా చాటుతోన్నాడు. అయితే నాగ చైతన్య, సమంత జంటగా నటించిన ఏ మాయే చేశావే సినిమా కథ ముందుగా ఈ సూపర్ స్టార్ దగ్గరికే వచ్చిందట. అయితే ఆ మూవీ చేసేందుకు ఒప్పుకోని మహేశ్ బాబు చెప్పిన కారణం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

ముందుగా మహేశ్ వద్దకు..

ముందుగా మహేశ్ వద్దకు..

ముందుగా బడా హీరోల ముందుకు వచ్చిన కథల్ని వారు రెజెక్ట్ చేయడం, తర్వాత అవి సూపర్ హిట్ కొట్టడం మాములు విషయమే. అలాంటివి ఇప్పటికీ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో చిత్రాలకు జరిగింది. అయితే తాజాగా ఇలాంటి ఓ విషయమే హాట్ టాపిక్ గా మారింది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు వద్దకు ఏ మాయ చేశావే సినిమా కథ ముందుగా వచ్చిందట. ఈ మూవీ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఈ కథను తొలిసారిగా మహేశ్ బాబుకే వినిపించాట.

కారణం తెలిసి షాక్!

కారణం తెలిసి షాక్!

కానీ, ఆ మూవీలో ఎవరెవరూ నటించారో మనకు తెలిసిందే. అయితే ఆ చిత్రాన్ని మహేశ్ బాబు రిజెక్ట్ చేసేందుకు చెప్పిన కారణం విని గౌతమ్ వాసుదేవ్ మీనన్ షాక్ అయ్యాడట. అక్కినేని నాగ చైతన్య, సమంత తొలిసారిగా జోడీ కట్టి, హిట్ కొట్టి, ప్రేక్షకుల మన్ననలు పొందిన చిత్రం ఏ మాయ చేశావే. ఈ మూవీ ఎంతపెద్ద సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈ చిత్రాన్ని ముందుగా తమిళంలోనే చిత్రీకరించాలనుకున్నాడట గౌతమ్ వాసుదేవ్ మీనన్.

ముందుగా మంజులకు..

ముందుగా మంజులకు..

ఈ కథను సూపర్ స్టార్ మహేశ్ బాబుకు వినిపించాలనుకున్నాడట గౌతమ్. అందుకు ముందుగా మంజులకు ఈ కథ గురించి చెప్పాడట. కథ బాగుంది కానీ, మహేశ్ చేస్తాడో? లేదో? అని గౌతమ్ వాసుదేవ్ మీనన్ తో మంజుల తెలిపినట్లు సమాచారం. తర్వాత ఈ కథను మహేశ్ బాబుకు చెప్పగా.. చిన్న స్టోరీ కదా? అని అనేశాడట. మహేశ్ బాబు, గౌతమ్ వాసుదేవ్ మీనన్ కలిసి సినిమా చేస్తున్నారంటే ఆ అంచనాలు వేరే లెవెల్లో ఉంటాయి కదా. ఏదైనా యాక్షన్ కథ చేద్దామని మహేశ్ బాబు చెప్పినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఆ మూవీని మహేశ్ చేసి ఉంటే పెద్ద సినిమా అయ్యేదని గౌతమ్ మీనన్ తెలిపాడు.

ఎలా ఉండేదో..

ఎలా ఉండేదో..

ఒకవేళ నిజంగా ఆ చిత్రంలో కార్తిక్ పాత్రలో మహేశ్ బాబు చేసి ఉంటే ఈ మూవీ ఫలితాలు ఇంకా ఎలా ఉండేవో? అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఇక ఇదిలా ఉంటే మహేశ్ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు తివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ముచ్చటగా మూడో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

రా ఏజెంట్ గా..

రా ఏజెంట్ గా..

ఈ సినిమాలో మహేశ్ బాబు.. రా ఏజెంట్‌గా కనిపిస్తాడని టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఇందులో మహేశ్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. ఇక, ఈ మూవీకి 'పార్థు', 'అతడే పార్థు', 'అర్జునుడు' అనే టైటిళ్లు పరిశీలనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి తమన్ సంగీతం ఇస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X