Jr NTR: విలన్ గా జూనియర్ ఎన్టీఆర్.. టాప్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్.. అదిరిపోతుంది అంటూ!
స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో హీరోగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఎంతో కాలంగా సినీ ఇండస్ట్రీలో తన మార్క్ చూపిస్తున్నాడు. విభిన్నమైన పాత్రలు పోషిస్తూ సత్తా చాటుతున్నాడు. ఈ క్రమంలోనే కొమురం భీమ్ గా నటించి తన నటనకౌశల్యాన్ని యావత్ ప్రపంచానికి రుచి చూపించాడు ఎన్టీఆర్.
దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ మాత్రమే కాకుండా గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు. దీంతో తారక్ తో సినిమాలు చేసేందుకు వివిధ సినీ ఇండస్ట్రీలు తెగ ఉత్సాహం చూపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ విలన్ గా నటించడంపై టాప్ డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

అంతర్జాతీయ స్థాయిలో..
వరుస హిట్లతో ఫుల్ జోష్ లో ఉన్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్.. దర్శక దిగ్గజం రాజమౌళి తరెకెక్కించిన RRR (రౌద్రం రణం రుధిరం) సినిమాతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాడు. భారీ అంచనాలతో పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలైన ఈ సినిమా భారీ హిట్ అయింది. అంతేకాదు, ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. అలాగే, తారక్‌కు అంతర్జాతీయ స్థాయిలో క్రేజ్‌ను తీసుకొచ్చి పాన్ వరల్డ్ స్టార్‌ను చేసేసింది.

తారక్ నటనకు నీరాజనం..
జూనియర్ ఎన్టీఆర్ RRR (రౌద్రం రణం రుధిరం) సినిమాలో కొమరం భీమ్ పాత్రను పోషించిన విషయం తెలిసిందే. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ నటన, పలికించిన హావభావాలు, చూపించిన ఎమోషన్స్, యాక్షన్ సీక్వెన్స్ కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి భారీ స్పందన దక్కింది. ఒక్క ఇండియాలోనే కాకుండా ఈ సినిమా విడుదలైన అన్ని దేశాల్లోనూ తారక్ నటనకు అక్కడి ప్రేక్షకులు నీరాజనం పలికారు. అలాగే విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు.

ఆస్కార్ లో దక్కని చోటు..
ఇక ఇటీవల యూఎస్ఏ టుడే (USA Today) పోర్టల్ ఆస్కార్ రేసులో నిలిచే టాప్ 10 హీరోల ర్యాంకింగ్ జాబితాను విడుదల చేయగా.. అందులో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు టాప్ ప్లేస్ అంటే మొదటి స్థానం ఇచ్చింది. అమెరికాలోనే ప్రముఖ పత్రిక అయిన యూఎస్ టుడే ఇండియన్ యాక్టర్ ఎన్టీఆర్ కు టాప్ ర్యాంక్ ఇవ్వడం సెన్సేషన్ గా మారింది. ఇలా ర్యాంక్ రావడంతో తారక్ కు ఆస్కార్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ఆశపడ్డారు తెలుగు ప్రేక్షకులు. కానీ చివరి నామినేషన్ ప్రక్రియలో ఎన్టీఆర్ కు చోటు దక్కలేదు.

మార్వెల్ సిరీస్ లో నటించాలని..
కొమురం భీమ్ పాత్ర పోషించిన ఎన్టీఆర్ నటనకు విదేశీ ఆడియెన్స్ ఫిదా అయ్యారు. ఎన్టీఆర్ కు హాలీవుడ్ నుంచి ఆఫర్లు వచ్చాయని.. అంతర్జాతీయ మీడియా సంస్థ కూడా పలు వార్తలు రాసుకొచ్చింది. తారక్, చెర్రీలను హాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ కాంటాక్ట్ అవుతున్నారనే వార్తలు ఆ మధ్య తెగ సందడి చేసిన విషయం తెలిసిందే. తారక్ కూడా హాలీవుడ్ మీడియాకు ఇచ్చిన పలు ఇంటర్వ్యూల్లో తనకు మార్వెల్ సిరీస్ లో నటించాలని ఉందని ఓపెన్ గా చెప్పాడు.

విలన్ గా నటిస్తే..
అయితే తాజాగా లవ్ అండ్ యాక్షన్ సినిమాలకు పేరొందిన కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ సైతం ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. RRR సినిమాతో ఎన్టీఆర్ స్థాయి హాలీవుడ్ వరకు వెళ్లిందని.. మన వాళ్లు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో సినిమాలు చేయాలని ఆయన అన్నారు. అలాగే మనవాళ్లు.. జేమ్స్ బాండ్, బౌర్న్ వంటి సినిమాల్లో నెగెటివ్ రోల్స్ చేస్తే.. విలన్ గా నటిస్తే మరింత ఆసక్తి ఉంటుందని తన అభిప్రాయాన్ని పంచుకున్నారు గౌతమ్ మీనన్.

మైఖేల్ లో ప్రతినాయకుడిగా..
ఇలా జూనియర్ ఎన్టీఆర్ హాలీవుడ్ సినిమాల్లో నటించాల్సి వస్తే.. విలన్ గా చేయడంతో సినీ ప్రేక్షకులను మరింతగా అట్రాక్ట్ చేయొచ్చనే విధంగా గౌతమ్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం గౌతమ్ మీనన్ డైరెక్టర్ గా కంటే విలన్ గా ఎక్కువగా బిజీ అయిపోయారు. తాజాగా సందీప్ కిషన్ మైఖేల్ సినిమాలో గౌతమ్ మీనన్ మెయిన్ విలన్ క్యారెక్టర్ రోల్ ప్లే చేశారు. అందుకే మన హీరోలు విలన్స్ గా హాలీవుడ్ చిత్రాల్లో కనిపిస్తే అదిరిపోతుందని ఆయన కోరికను బయటపెట్టారు. మరి గౌతమ్ మీనన్ కోరిక నెరవేరుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











