'అందుకే నా కూతురుతో మాట్లాడటం మానేశా..కానీ, ': రాజేంద్రప్రసాద్ ఎమోషనల్ వీడియో వైరల్
Rajendra Prasad: సీనియర్ హీరో, విలక్షణ నటులు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదం నెలకొంది. రాజేంద్ర ప్రసాద్ గారాలపట్టి గాయత్రి గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయింది. శుక్రవారం సాయంత్రం గాయత్రికి కార్డియాక్ అరెస్ట్ కావడంతో హైద్రాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఈ రోజు (శనివారం) మరణించారు. దీంతో రాజేంద్ర ప్రసాద్ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ నేపథ్యంలో రాజేంద్ర ప్రసాద్ తన కూతురి గురించి గతంలో చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
ప్రముఖ నటులు రాజేంద్రప్రసాద్ కూతురు గాయత్రి కార్డియాక్ అరెస్ట్ కావడంతో ప్రాణాలు కోల్పోయారు. గాయత్రి ఆకస్మిక మృతితో షాక్ లోకి వెళ్లింది రాజేంద్రప్రసాద్ కుటుంబం. గాయత్రి భౌతికకాయానికి హైదరాబాద్ కూకట్‌పల్లిలోని ఇంటికి తరలించారు. రాజేంద్రప్రసాద్ కు ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న కన్న కూతురు తన కండ్లముందే చనిపోవడంతో రాజేంద్ర ప్రసాద్ కన్నీరుమున్నీరు అవుతున్నారు. అక్టోబర్ 6వ తేదీ ఆదివారం రోజున గాయత్రి అంత్యక్రియలు జరగనున్నాయి.

రాజేంద్ర ప్రసాద్ కూతురు గాయత్రి వృత్తి రీత్యా డాక్టర్. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న తన కూతురు తననీ కాదనీ, ప్రేమ పెళ్లి కారణంగా రాజేంద్రప్రసాద్ తో కాస్త విభేదాలు చోటు చేసుకున్నాయి. అయితే.. ఈ మధ్య కాలంలో కాస్త కలుసుకున్నారు. గాయత్రికి ఓ కూతురు ఉంది. ఆ చిన్నారి 'మహానటి' సినిమాలో జూనియర్ సావిత్రిగా నటించింది. ఒక్క సినిమాతోనే ఓ స్పెషల్ ఐడెంటి క్రియేట్ చేసుకుంది. గాయత్రి మరణంతో రాజేంద్రప్రసాద్ కుటుంబంలో విషాదఛాయలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో సినీ, రాజకీయ ప్రముఖులు రాజేంద్ర ప్రసాద్‌ను పరామర్శిస్తున్నారు.
ఈ క్రమంలో లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. రాజేంద్ర ప్రసాద్ కు ప్రగాఢ సానుభూతి తెలియజేసారు. రాజేంద్ర ప్రసాద్ గారి కుమార్తె శ్రీమతి గాయత్రి హఠాన్మరణం దిగ్భ్రాంతి కలిగించిందనీ, గాయత్రి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాననీ, రాజేంద్ర ప్రసాద్ గారికి, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నారు. పుత్రిక వియోగాన్ని తట్టుకొనే మనో ధైర్యాన్ని రాజేంద్ర ప్రసాద్ గారికి ఇవ్వాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నట్టు పవన్ కళ్యాన్ సానుభూతి ప్రకటించారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా రాజేంద్ర ప్రసాద్ కు ప్రగాఢ సానుభూతి తెలియజేసారు. రాజేంద్ర ప్రసాద్ గారి కుమార్తె గాయత్రి గారి మరణం చాలా విషాదకరమనీ, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. రాజేంద్ర ప్రసాద్ గారికి , కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని ట్వీట్ చేశారు జూనియర్ ఎన్టీఆర్.
ఈ క్రమంలో రాజేంద్రప్రసాద్ గతంలో తన కూతురు గురించి మాట్లాడిన వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరలవుతోంది. గతంలో 'బేవార్స్' అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు. ఆ సినిమాలో సుద్దాల అశోక్ తేజ అమ్మపై రాసిన పాట గురించి మాట్లాడుతూ తన కూతురు గాయత్రిని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు. " ఒక్క వ్యక్తికి తల్లి లేకపోతే.. తన కూతురులో తన తల్లిని చూసుకుంటాడు. నాకు పదేళ్ల వయసు ఉన్నప్పుడే మా అమ్మ చనిపోయారు. ఆ తర్వాత నాకు పుట్టిన కూతురిలోనే మా అమ్మను చూసుకున్నా. బేవార్స్ సినిమాలో సుద్దాల అశోక్ తేజ అమ్మపై రాసిన పాట విని చాలా ఎమోషనల్ అయ్యాను.
నాకు ఒక్కేక్క కూతురు దాని పేరు గాయత్రి. కానీ కొన్నాళ్ల క్రితం తన కూతురు ఒకరిని ప్రేమించి వాడితో వెళ్ళిపోయింది. ఆ సమయం నుంచి నా కూతురితో నాకు మాటల్లేవు. అయినా నా కూతుర్ని ఇంటికి పిలిపించి, నా కుతూరు ముందు కూర్చోని ఈ సినిమాలోని 'అమ్మ' పాటను నాలుగు సార్లు విపించాను"అంటూ రాజేంద్ర ప్రసాద్ కన్నీళ్లు పెట్టుకున్నారు. నిజంగా రాజేంద్రప్రసాద్ కు తన కూతురు పై ఎంత ప్రేమ ఉందో అంటూ.. నెటిజన్లు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











