twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆమెకు మూడో సారి, నాకు అదే ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్, వణికిపోయా: విజయ్ దేవరకొండ

    By Bojja Kumar
    |

    విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా పరశురాం దర్శకత్వంలో తెరకెక్కిన 'గీత గోవిందం' చిత్రం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదలై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. తొలి షో నుండే సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండటంతో విజయ్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ ఖాయమైంది. తాజాగా మీడియాతో మాట్లాడుతూ విజయ్ దేవరకొండ ఓ ఆసక్తికర విషయం వెల్లడించారు. సినిమాలో ఓ సీన్ చేసే సమయంలో తాను వణికిపోయాను అని తెలిపారు.

    ఇదే నాకు తొలి ఎక్స్‌పీరియన్స్

    ఇదే నాకు తొలి ఎక్స్‌పీరియన్స్

    ‘గీత గోవిందం' మూవీలో నా తొలి పెళ్లి సీన్ జరిగింది. పెళ్లి మండపంలో కూర్చోవడం, ఇవన్నీ ఓకేకానీ మూడు ముళ్లు కట్టే షాట్ చేసేపుడు నాకు ప్యాక్ అయిన ఫీలింగ్ వచ్చింది. అది షూటింగ్ అని తెలిసినా ఆ సీన్ చేసేపుడు వణికిపోయాను అని విజయ్ తెలిపారు.

    Recommended Video

    Geetha Govindam Movie Public Talk గీత గోవిందం సినిమా పబ్లిక్ టాక్
     ఆమెతో తేడాగా చేస్తున్నానేమో అనిపించింది

    ఆమెతో తేడాగా చేస్తున్నానేమో అనిపించింది

    నా ఎదురుగా ఆ అమ్మాయి పట్టుచీరలో కూర్చుంది. నేనూ పట్టుపంచెలో ఉన్నాను. పూలు, డెకొకేషన్ అంతా పర్ఫెక్టుగా రియల్ పెళ్లి సెటప్‍‌లా ఉంది. ఈ షాట్లో మూడు ముళ్లు కట్టేసేయ్ విజయ్ అని డైరెక్టర్ చెప్పగానే ఏదో తెలియని ఫీలింగ్ వచ్చింది. ఆ హీరోయిన్‌తో ఏదో తేడా చేస్తున్నానేమో అనిపించింది.

    నా జీవితంలో ఎప్పుడూ చేయలేదు

    నా జీవితంలో ఎప్పుడూ చేయలేదు

    నా జీవితంలో మూడు ముళ్లు వేయడం ఎప్పుడూ చేయలేదు. ఫేక్ అని తెలిసినా చాలా టెన్షన్ పడ్డాను. ఇలాంటివి చేసేపుడు ముందే ప్రిపేర్డ్‌గా ఉండాలి. కానీ ఆ రోజు ఎందుకో షివరింగ్ అనిపించింది అని విజయ్ తన అనుభవాన్ని గుర్తు చేసుకున్నాడు.

    ఆ అమ్మాయికి మూడోది

    ఆ అమ్మాయికి మూడోది

    ఆ అమ్మాయి(రష్మిక)కి ఇది మూడో ఫిల్మ్ పెళ్లంట. ఇట్స్ ఓకే అని ఆమె చాలా తేలిగ్గా చెప్పేసింది. ఆమె అలా అనడంతో కాస్త దైర్యం తెచ్చుకుని సీన్ పూర్తి చేశాను. రష్మిక గీత పాత్రలో జీవించడం వల్లే సినిమా ఇంత బాగా వచ్చింది అని తెలిపారు.

    English summary
    "For the first time am avted in the wedding scene. I got a little tension." Vijay Devarakonda about Geetha Govindam movie marriage scene. The film directed by Parasuram, produced by Bunny Vas under the banner of GA2 pictures. It stars Vijay Deverakonda, Rashmika Mandanna in the lead roles.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X