‘Deepika Padukone ను ముద్దులు పెట్టుకోవడానికి.. రణ్‌వీర్ సింగ్ పర్మిషన్ కావాలా?‘

బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపిక పదుకోన్, అనన్య పాండే, సిద్దాంత్ చతుర్వేది నటించిన గెహ్రాయియాన్ చిత్రం అనేక విమర్శలను, వివాదాలను ఎదుర్కొంటున్నది. ఈ చిత్రంలోని శృంగార సన్నివేశాల్లో దీపిక పదుకోన్ హద్దు మీరి నటించారనే విషయంపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో దీపిక పదుకోన్ ఇంత బోల్డ్‌గా నటించడం ఇదే మొదటిసారి కావడంతో విమర్శలు కాస్త ఘాటుగానే వినిపించాయి. అయితే దీపిక పదుకోన్తో‌ హాట్ హాట్‌గా నటించిన గల్లీబాయ్ ఫేమ్ సిద్దాంత్ చతుర్వేది తమ శృంగార సన్నివేశాలు, ఇతర అంశాల గురించి తొలిసారి జాతీయ మీడియాతో మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ సినిమా వివాదాలు, మితిమీరిన శృంగారం గురించి సిద్దాంత్ అభిప్రాయాల్లోకి వెళితే..

గెహ్రాయియాన్ హాట్ సీన్లపై

గెహ్రాయియాన్ హాట్ సీన్లపై


గెహ్రాయియాన్ సినిమాలో తన కజిన్‌ తియా (అనన్య పాండే)కు కాబోయే భర్త (సిద్దాంత్ చతుర్వేది)తో అక్రమ సంబంధాన్ని దీపిక పెట్టుకొంటుంది. అయితే సిద్దాంత్ తనకు మోసం చేయడంతో దీపిక తీవ్రమైన నిర్ణయం తీసుకొంటుంది. అయితే ఈ నిర్ణయానికి ముందు సిద్దాంత్‌తో గడిపిన శృంగార జీవితంపై విమర్శల వెల్లువ వెత్తుతున్నది. టాప్ హీరోయిన్‌గా దీపిక చేసిన రొమాంటిక్ విన్యాసాలపై సాంప్రదాయ ప్రేక్షకులు భగ్గుమంటున్నారు. యువతకు స్పూర్తిగా నిలువాల్సిన తారలు ఎలాంటి సంకేతాలను ఇస్తున్నారనే విషయం చర్చనీయాంశమైంది.

మాకెందుకు కోపం రావాలి?

మాకెందుకు కోపం రావాలి?

దీపికతో రొమాంటిక్ సీన్ల గురించి విమర్శలు రావడం కోపం కలిగించలేదు. ఎందుకంటే మేము ప్రొఫెషనల్‌గా బిహేవ్ చేస్తున్నాం. ఈ సినిమా షూటింగ్‌ గోవాలో చేసే సమయంలో రణ్‌వీర్ కూడా అక్కడికి వచ్చి కొన్ని రోజులు ఉన్నారు. మేమంతా పార్టీలు చేసుకొంటూ ఆ సమయాన్ని ఫుల్లుగా ఎంజాయ్ చేశాం. మా మధ్య అలాంటి ప్రొఫెషనల్ బాండింగ్ ఉంది అంటూ సిద్దాంత్ చెప్పారు.

రణ్ వీర్ సింగ్ ఫోన్ చేసి..

రణ్ వీర్ సింగ్ ఫోన్ చేసి..

గెహ్రాయియాన్ సినిమా నేను అంగీకరించిన సమయంలో మొదట నాకు రణ్‌వీర్ ఫోన్ చేసి అభినందించాడు. అంతకు ముందు గల్లీభాయ్ సినిమాలో కలిసి నటించడం వల్ల మా మధ్య మంచి బాండింగ్ ఉండేది. నేను రణ్‌వీర్‌ను మెంటర్‌గా భావిస్తాను. దీపిక పదుకోన్ పక్కా ప్రొఫెషనల్. అందుకే సినిమాలో మా మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరింది అని సిద్దాంత్ అన్నారు.

విమర్శలు పట్టించుకోను..

విమర్శలు పట్టించుకోను..

గెహ్రాయియాన్ చిత్రంలో దీపిక పదుకోన్‌తో నేను ఘాటైన సీన్లలో కనిపించడంపై వస్తున్న విమర్శలను పెద్దగా పట్టించుకోను. ఎవరేమనుకొన్నా మాకు ఎలాంటి సంబంధం లేదు. ఎవరో ఏమనుకొంటే మేము చేసేది ఏముంటుంది. మా ప్రొఫెషనల్ పరంగా మేము ఎలా చేయాలో అలా చేస్తాం. మా డ్యూటిని మేము పూర్తి చేశాం అని సిద్దాంత్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

రణ్‌వీర్ సింగ్ పర్మిషన్‌పై

రణ్‌వీర్ సింగ్ పర్మిషన్‌పై

గెహ్రాయియాన్ చిత్రంలో శృంగార సన్నివేశాల్లో పాత్రల్లో లీనమై నటించాం. పాత్రల మధ్య భావోద్వేగాన్ని పండించడానికి చాలా కష్టపడ్డాం. మీకు ఒక్క శృంగారం మాత్రమే కనిపిస్తుంది. కానీ ఆ రేంజ్‌లో ఎమోషన్స్ పడించడానికి తెర వెనుక ఎంత కసరత్తు జరుగుతుందో తెలియదు. దీపికను ముందు పెట్టుకోవడానికి రణ్‌వీర్ సింగ్ పర్మిషన్ అవసరమా అంటూ తమపై వస్తున్న విమర్శలకు ఘాటుగా సమాధానం చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X