HBD Ram Charan: ఆస్తుల్లోనూ గేమ్ ఛేంజర్.. ఉపాసనతో కలిపి చరణ్ సంపద ఎన్ని వేల కోట్లంటే?

తెలుగు సినీ సామ్రాజ్యాన్ని నాలుగు దశాబ్ధాలుగా మకుటం లేని మహారాజుగా ఏలుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. స్వయంకృషితో సామాన్య స్థాయి నుంచి అసాధారణ స్థాయికి చేరుకున్న ఆయన ఎందరికో ఆదర్శంగా నిలిచారు. చిరంజీవి నట వారసుడిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన రామ్ చరణ్ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నారు. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్‌ ఎందులోనైనా తనకు తిరుగులేని నిరూపించుకున్న చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్‌గా వెలుగొందుతున్నారు. మార్చి 27న రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన గురించిన ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.

మెగాస్టార్ చిరంజీవి - సురేఖ దంపతులకు రెండో సంతానంగా మార్చి 27, 1985న చెన్నైలో జన్మించారు రామ్ చరణ్. మద్రాస్‌లోని పద్మశేషాద్రి బాల భవన్‌, లారెన్స్ స్కూల్ తర్వాత హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, సెయింట్ మేరీస్ కాలేజీలో చదువుకున్నారు చరణ్. విద్యాభ్యాసం తర్వాత సినిమాల వైపు వెళ్లాలనుకున్న ఆయన ముంబైలోని ఫేమస్ గురు.. కిషోర్ నమిత్ కపూర్ వద్ద నటనలో ఓనమాలు దిద్దారు. నటుడికి కావాల్సిన అన్ని అంశాల్లో శిక్షణ తీసుకున్న రామ్ చరణ్ డెబ్యూ కోసం చిరంజీవి గ్రౌండ్ వర్క్ సిద్ధం చేశారు.

Global Star Ram Charan birthday special here s the charan s net worth and Assets Details

అశ్వినీదత్ నిర్మాణంలో పూరీ జగన్నాథ్ హీరోగా తెరకెక్కిన చిరుత చిత్రం ద్వారా 2007లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన చరణ్ తొలి సినిమాతోనే మంచి మార్కులు సంపాదించారు. ఆ తర్వాత ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీరతో స్టార్ డమ్ అందుకున్నారు. ఆ వెంటనే ఆరెంజ్, రచ్చ, నాయక్, జంజీర్, ఏవడు, గోవిందుడు అందరివాడేలే, బ్రూస్ లీ, ధ్రువ, వినయ విధేయ రామ, ఆచార్య చిత్రాలలో నటించారు.

సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం చిత్రం చరణ్‌లోని నటుడిని బయటికి తీసుకురాగా.. మరోసారి రాజమౌళి దర్శకత్వంలో చేసిన ఆర్ఆర్ఆర్ సినిమా ఆయనను గ్లోబల్ స్టార్‌ను చేసింది. ఈ ఏడాది సంక్రాంతికి గేమ్ ఛేంజర్‌తో ప్రేక్షకులను పలకరించారు రామ్ చరణ్. ప్రస్తుతం ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానాతో తన 16వ చిత్రం చేస్తున్నారు. దీనికి పెద్ది అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ గురువారం చిత్ర యూనిట్ ప్రకటించింది. అపోలో హాస్పిటల్స్ అధినేత ప్రతాప్ సి రెడ్డి మనవరాలు ఉపాసన కామినేని 2012లో పెళ్లాడారు రామ్ చరణ్. ఈ దంపతులకు క్లీంకార ఆనే ఆడపిల్ల జన్మించారు.

భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే నటుల్లో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్ .. బ్రాండ్ అండార్స్‌మెంట్స్, వ్యాపారాలలో పెట్టుబడులతో భారీగా ఆస్తులను కూడబెట్టారు. మీడియా నివేదికల ప్రకారం చరణ్ ఆస్తుల విలువ రూ.1380 కోట్ల పైమాటేనట. ఆయన సతీమణి ఉపాసన ఆస్తులతో కలిపి దీని విలువ రూ.2500 నుంచి రూ.3000 కోట్ల వరకు ఉంటుందని అంచనా. సినిమాకు రూ.40 కోట్ల నుంచి రూ.50 కోట్ల మధ్యలో రెమ్యునరేషన్ తీసుకునే చరణ్ తన తాజా చిత్రం పెద్దికి రూ.100 కోట్ల పారితోషికం తీసుకోబోతున్నారని టాక్.

స్వతహాగా గుర్రపు స్వారీని ఇష్టపడే చరణ్ .. హైదరాబాద్ పోలో రైడింగ్ క్లబ్‌ను స్దాపించారు. అలాగే ఆయనకు ట్రూజెట్ అనే ప్రైవేట్ ఎయిర్‌లైన్స్ సంస్థ కూడా ఉంది. ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ అనే జట్టుకు యజమానిగా చరణ్ వ్యవహరిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పేరు మీద నిర్మాతగానూ పలు చిత్రాలు నిర్మించారు. చరణ్‌కు హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ప్యాలెస్ లాంటి ఇల్లు ఉంది. దీని విలువ రూ.70 కోట్ల వరకు ఉంటుందని అంచనా. అలాగే ముంబైలోనూ ఓ లగ్జరి అపార్ట్‌మెంట్ ఉన్నట్లు ఫిలింనగర్ టాక్.

లగ్జరీ కార్లను ఇష్టపడే చరణ్‌.. మార్కెట్‌లోకి వచ్చే ప్రతి టాప్ ఎండ్ కారును కొనుగోలు చేస్తుంటారు. ఆయన వద్ద రూ.10 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ ఫాంటమ్, రూ.4 కోట్ల విలువైన మెర్సిడేస్ మేబాచ్, ఆడి మార్టిన్ వీ8 వాంటేజ్, రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ, ఫెరారీ పోర్టోఫినో వంటి కార్లు కూడా ఉన్నాయి. ఆదాయంతో పాటు సామాజిక సేవలోనూ తాను తండ్రికి తగ్గ తనయుడినని నిరూపించుకున్నారు రామ్ చరణ్. తన సంపాదనలో కొత్త మొత్తాన్ని సామాజిక సేవా కార్యక్రమాలకు ఖర్చు చేస్తున్న గ్లోబల్ స్టార్ మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని ఆకాంక్షిస్తోంది ఫిల్మీబీట్.

More from Filmibeat

Read more about: ram charan rc 16 chiranjeevi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X