Ram Charan: డాక్టరేట్ అందుకున్న రామ్ చరణ్.. నెట్టింట వీడియో వైరల్.. మీరూ చూశారా?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పేరు తెలియని వాళ్లు.. ఈ దేశవ్యాప్తంగా లేరంటే అతిశయోక్తి కాదు. అద్భుతమైన టాలెంట్ కల్గిన ఈయన అదిరిపోయే సినిమాలు చేస్తూ అందరినీ మెప్పిస్తున్నారు. ముఖ్యంగా తెలుగు సినీ ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తం చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారాన ఈ మెగా పవర్ స్టార్.. తాజాగా ఓ అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. ఓ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

2007లో చిరుత సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. తొలి చిత్రమే సూపర్ డూపర్ హిట్ కావడంతో.. ఆతర్వాత కూడా వరుసగా అవకాశాలు అందిపుచ్చుకున్నాడు. అలా అదిరోపోయే చిత్రాలు చేస్తూ తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం 39 ఏళ్ల వయసు కల్గిన ఈయన మొత్తం 15 సినిమాలు చేశాడు. చేసినవి తక్కు చిత్రాలే అయినా ఇందులో బ్లాక్ బస్టర్ హిట్ లు ఎక్కువగా ఉండడంతో.. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ సినిమాతో ఈయన క్రేజ్ మరింతగా పెరిగిపోయింది.

Global Star Ram Charan Recieved Doctorate Vels Convocation 2024 Check Details

ఈ ఒక్క చిత్రం వల్లే అనేక అవార్డులు అందుకున్న రామ్ చరణ్.. ఇప్పుడో మరో గౌరవాన్ని కూడా దక్కించుకున్నాడు. రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలోని నాటు నాటు సాంగ్ కు అయితే ఆస్కార్ అవార్డు వచ్చింది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ సినిమాలో నటించి ప్రతీ ఒక్కరికీ మంచి గుర్తింపే వచ్చింది. అయితే తాజాగా మరో సారి అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. చెన్నైకు చెందిన వేల్స్ యూనివర్సిటీ చెర్రీకి డాక్టరేట్ ప్రకటించింది. ఏప్రిల్ 13వ తేదీ అంటే ఈరోజే రామ్ చరణ్ కు డాక్టరేట్ ను ప్రదానం చేశారు.

చెన్నైలోని వేల్స్ యూనివర్సిటీ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా వెళ్లిన ఈయనే అక్కడ అవార్డు అందుకున్నారు. అయితే మ్ చరణ్ తెలుగు సినీ రంగానికి అందిస్తున్న సేవలకు గానే ఈ డాక్టరేట్ ను వేల్స్ యూనివర్సిటీ అందరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చెర్రీ డాక్టరేట్ అందుకున్న వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో, ఫొటోలు చూసిన ప్రతీ ఒక్కరూ అభినందనలు తెలుపుతున్నారు. తెలుగు సినీ రంగ ఖ్యాతిని ఖండాంతరాలు దాటిస్తున్న మీరు భవిష్యత్తులో మరిన్ని అవార్డులు, గౌరవాలు అందుకుంటారని కామెంట్లు చేస్తున్నారు.

ఇదంతా ఇలా ఉండగా.. రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మెసేజ్ ఓరియెంటెడ్ కమర్షియల్ డ్రామాగా రాబోతుంది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తుండగా.. చెర్రీ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా చేస్తోంది. అలాగే అంజలి, సముద్రఖని, ఎస్.జే సూర్య, శ్రీకాంత్, సునీల్, జయరాం, రాజీవ్ కనకాల కీలక పాత్రల్లో కనిపించనున్నారు. చూడాలి మరి ఈ ఏడాది చివరలో విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్టు కొడుతుందనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X