మెగా ప్రిన్సెస్ ఎంట్రీ.. ఎవరికీ అందనంత ఎత్తుకు రామ్ చరణ్!

మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ తేజ్.. ఆ తర్వాత తనదైన మార్క్ తో మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ఉపాసనతో ప్రేమ వివాహం చేసుకుని.. 11 ఏళ్ల తర్వాత ఓ ఆడపిల్లకు జన్మనిచ్చాడు. అయితే మెగా ప్రిన్సెస్ రాకతో మెగా కుటుంబంలోనే కాదు.. అభిమానులంతా పండగ చేసుకుంటున్నారు. కొణిదెల కుటుంబంలో మహాలక్ష్మీ వచ్చిందని.. సంబరాలు చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. మెగా ప్రిన్సెస్ రాకతో... రామ్ చరణ్ ఇమేజ్ మారబోతుందంటూ సోషల్ మీడియాలో అభిమానులు పోస్టులు పెడుతున్నారు. ఆ వివరాల్లోకి వెళ్తే...

టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ లవబుల్ కపుల్స్ లో రామ్ చరణ్ ఉపాసన జోడి ఒకటి. 2012లో జూన్ 14వ తేదీన వీళ్ల పెళ్లి జరిగింది. అయితే దాదాపు 11 ఏళ్ల తర్వాత తల్లిదండ్రులు అయ్యారు. దీనితో ఆడబిడ్డ పుట్టడంతో మెగా, అల్లు కుటుంబాలు ఆనందంలో మునిగిపోయాయి. పెళ్లైన 11 ఏళ్ల తర్వాత చరణ్ తండ్రి కావడంతో తమ కొణిదెల కుటుంబంలోకి మహాలక్ష్మీ వచ్చిందంటూ చిరంజీవి తెగ సంబరపడిపోతున్నారు. కుటుంబ సభ్యులంతా ఆసుపత్రికి వెళ్లి లిటిల్ ప్రిన్సెస్‌ ను చూసొచ్చారు.

 good days are coming for Ram Charan With the entry of Mega Princess

అయితే జూన్ 23వ తేదీన ఆసుపత్రి నుంచి ఉపాసన, బేబీ డిశ్చార్జి అయ్యారు. పాప నాన్నలానే ఉందని మీడియాకు రామ్ చరణ్ చెప్పుకొచ్చాడు. సంప్రదాయం ప్రకారం పేరు పెడతామని వెల్లడించారు. అటు మెగా అభిమానులు రామ్ చరణ్ జాతకం మారబోతుందని అంటున్నారు. పాప కడుపులో పడ్డప్పటి నుంచి అంతా మంచే జరుగుతుందని అనుకుంటున్నారు.

ఒకసారి పరిశీలిస్తే.. ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్ కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఆ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ కూడా వచ్చింది. అంతేనా చరణ్ త్వరలో హాలీవుడ్ మూవీ చేయబోతున్నారని వార్తలు కూడా వచ్చాయి. ఈ పాప జాతకం కలిసి వస్తే.. రాబోయే రోజుల్లో చరణ్ హాలీవుడ్ స్టార్ గా ఎదుగుతాడు కావొచ్చు అంటున్నారు. మరోవైపు ఎన్నో ఏళ్లుగా ప్రేమలో ఉన్న వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిల పెళ్లి కుదిరింది. ఇవన్నీ మంచి శకునాలుగా భావిస్తున్నారు. అయితే ఈ మెగా ప్రిన్సెస్ ఎంట్రీతో అన్ని మంచి జరుగుతున్నాయని అంటున్నారు.

 good days are coming for Ram Charan With the entry of Mega Princess

అయితే చరణ్ మాదిరిగానే తొలి సంతానంగా కుమార్తెకు జన్మనిచ్చిన స్టార్స్ కొందరు లెజెండరీ యాక్టర్లుగా మారారు. వారి లిస్టు ఓ సారి చూస్తే... చిరంజీవికి మొదటి సంతానంగా సుస్మిత జన్మించింది. ఆ తర్వాత ఆయన మెగాస్టార్ గా మారిపోయారు. బాలకృష్ణకు బ్రాహ్మణి మొదటి సంతానం.

వెంకటేష్ కు ఆశ్రిత, మోహన్ బాబుకు లక్ష్మీ ప్రసన్న, అమితాబ్ బచ్చన్ కు శ్వేత బచ్చన్..రజినీ కాంత్ కు ఐశ్యర్య, కమల్ హాసన్ కు శృతి హాసన్, సైఫ్ అలీ ఖాన్, రణ్‌బీర్ కపూర్, అనిల్ కపూర్, షాహిద్ కపూర్ వంటి స్టార్లందరికీ మొదటి సంతానంగా ఆడపిల్లలే పుట్టారు. ఆడపిల్ల రాకతో వీళ్లు స్టార్లుగా మారిపోయారు. దీనితో చరణ్ కూడా మరింత ఎదుగుతారని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X