మహేష్ అభిమానులకు గుడ్ న్యూస్.. సంక్రాంతికి సర్కారు వారి పాట సర్‌ప్రైజ్

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో సర్కారు వారి పాట కూడా టాప్ లిస్టులో ఉంది అనే చెప్పాలి. గీత గోవిందం సినిమా తర్వాత దర్శకుడు పరుశురామ్ ఎంతో ఇష్టంగా మహేష్ బాబు కోసం తయారుచేసిన సర్కారు వారి పాట కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది అని ఇప్పటికే చాలా ఇంటర్వ్యూలలో తెలియజేశారు. ఇక ఈ సినిమా కోసం చిత్రనిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ భారీ స్థాయిలో ఖర్చు చేస్తోంది. అయితే ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ RRR సినిమా కోసం వాయిదా పడక తప్పలేదు. మొత్తానికి సమ్మర్లో అయినా ఎలాంటి వాయిదాలు లేకుండా విడుదల అవుతుంది అని అభిమానులు ఒక నమ్మకంతో అయితే ఉన్నారు.

చిత్ర యూనిట్ సభ్యులు కూడా రెగ్యులర్ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. సినిమా విడుదల పై ఒక క్లారిటీ ఇచ్చిన తర్వాతనే పాటలను విడుదల చేయాలని అనుకున్నారు. ఇక ఇటీవల చర్చల అనంతరం సంగీత దర్శకుడు థమన్ కూడా ట్విట్టర్ ద్వారా ఒక వివరణ ఇచ్చాడు. సినిమాకు సంబంధించిన అన్ని పనులు కూడా దాదాపు పూర్తయ్యాయట. ఇక రెగ్యులర్ ప్రమోషన్ లో భాగంగా సినిమా అప్డేట్స్ అలాగే సాంగ్స్ కూడా విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఇటీవల సోషల్ మీడియాలో స్పందించిన థమన్ త్వరలోనే బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ తో మిమ్మల్ని అలరించబోతున్నాము అని వివరణ ఇచ్చేశాడు.

Good news for mahesh babu fans big surprise in sankranti

మీ నుంచి మేము చాలా వింటున్నాము.. అలాగే మా కూడా మీరు చాలా వినబోతున్నారు అంటూ సంగీత దర్శకుడు తమన్ పరశురామ్ తో దిగిన ఒక ప్రత్యేకమైన ఫోటోను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దర్శకుడు పరశురామ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం అద్భుతమైన 'సర్కారు వారి పాట'ను సిద్ధం చేసి ఉంచారు.. అంతేకాకుండా చిత్ర యూనిట్ అందరూ కూడా చాలా కష్టపడుతున్నారు. హార్డ్ వర్క్ చేస్తున్నారు అని..ముఖ్యంగా మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా కోసం చాలా కృషి చేస్తున్నట్లు తనతో తన ట్విట్టర్లో వివరణ ఇచ్చాడు.

ఇక ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ అప్డేట్ సంక్రాంతి నుంచి రాబోతున్నట్లు మైత్రి మూవీ మేకర్స్ కూడా సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చింది. అంటే జనవరి 13వ తేదీ నుంచి ఈ సినిమాకు సంబంధించిన పాటలు కూడా రాబోతున్నట్లు వివరణ ఇచ్చారు. మరి థమన్ ఇచ్చే మ్యూజిక్ ఈ సారి మహేష్ బాబు సినిమాకు ఎంత వరకు హెల్ప్ అవుతుందో చూడాలి. ప్రస్తుతం థమన్ టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద సినిమాలకు వర్క్ చేస్తున్నాడు. అంతేకాకుండా రాధేశ్యామ్ సినిమా కు కూడా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇక సర్కారు వారి పాట సినిమాను ఏప్రిల్ ఒకటో తేదీన విడుదల చేయాలని మైత్రి మూవీ మేకర్స్ ముందుగానే ఎనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. మరి అనుకున్న సమయానికి విడుదల చేస్తారో లేదో తెలియాలి అంటే కాలమే సమాధానం చెప్పాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X