ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్.. బుట్టబొమ్మ కోసం రెబల్ స్టార్ సర్‌ప్రైజ్..
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం అందరికంటే ఎక్కువగా రెబల్ స్టార్ ప్రభాస్ బిగ్ బడ్జెట్ సినిమాలను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. ఇక ముందుగా రాధేశ్యామ్ సినిమా విడుదల కానుంది. సాహో సినిమా అనంతరం ప్రభాస్ ఎంతో ఇష్టంగా మొదలుపెట్టిన ఈ సినిమా షూటింగ్ ఎంత త్వరగా పూర్తి చేయాలని అనుకుంటున్నా కూడా ఏదో ఒక విధంగా ఆలస్యం అవుతూ వచ్చింది. ఇటీవల మొత్తం పూర్తి చేసినట్లు టాక్ అయితే వచ్చింది. ఇక కొన్ని సన్నివేశాల విషయంలో మాత్రం ప్రభాస్ ఏ మాత్రం సంతృప్తిగా లేడనే కూడా టాక్ వినిపిస్తోంది. వీలైతే ఆ సన్నివేశాలను మరోసారి రీ షూట్ చేయడానికి కూడా నిర్మాతలు సిద్ధంగా ఉన్నారట.
ఆ కథనాలు ఎంతవరకు నిజమో తెలియదు కానీ అభిమానులు మాత్రం చాలా ఆగ్రహంతో ఉన్నారు అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటివరకు సినిమాకి సరైన క్రమంలో బజ్ అయితే క్రియేట్ చేసే విధంగా హడావుడి చేసింది లేదు. గతంలో పోస్టర్స్ విడుదల చేసినా కూడా అంతంత మాత్రంగానే ఉన్నట్లు నెగిటివ్ టాక్ వచ్చింది. ప్రభాస్ సినిమా అని తప్పితే ఏ విధమైన హైప్ అయితే ఇవ్వలేదు. ఒక విధంగా అభిమానులు ఆగ్రహంతో ఉన్నా కూడా యు వి క్రియేషన్స్ పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇక ప్రస్తుతం రెండు స్పెషల్ అప్డేట్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

ముందుగా పూజా హెగ్డే పుట్టినరోజు సందర్భంగా ఆమెకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన పోస్టర్ ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. రెబల్ స్టార్ ప్రభాస్ సోషల్ మీడియా ద్వారా ఆమెకు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు అందిస్తూ ఈ నెల 13ఒక పోస్టర్ ను విడుదల చేస్తారని తెలుస్తోంది. ఇక ఇదే నెల 23న ప్రభాస్ పుట్టిన రోజు కావడంతో ఆ రోజు అంతకుమించి అనేలా ఉండాలని అభిమానులైతే బలంగా కోరుకుంటున్నారు. ఇక ఎలాగైనా టీజర్ ను విడుదల చేయాలని చిత్ర యూనిట్ అనుకుంటోంది. రాధేశ్యామ్ అప్డేట్స్ వస్తే గాని మిగతా సినిమాల విషయంలో అప్డేట్ వచ్చే చాన్స్ లేదు అని తెలుస్తోంది.
అందుకే ఇప్పటి నుంచి ప్రమోషన్స్ డోస్ పెంచాలని కూడా ప్రభాస్ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. దర్శకుడు రాధాకృష్ణ ఎప్పుడు కూడా ఇచ్చిన మాట ప్రకారం అనుకున్న సమయానికి అప్డేట్స్ ఇవ్వడం లేదు. ఇక ఈ సినిమాను అయితే వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని ఒక ప్లాన్ అయితే సెట్ చేసుకున్నారు. మొదట జనవరి 16వ తేదీకి రానున్నట్లు ప్లాన్ వేసుకున్నారు. ఇక మళ్ళీ మారే ఆలోచనలో ఉన్నట్లు కూడా టాక్ అయితే వచ్చింది. మరి ఈ విషయంలో అభిమానులను ఎంతవరకు సంతృప్తి పరుస్తారో చూడాలి. ఇక ప్రభాస్ రాధేశ్యామ్ సినిమా అనంతరం సలార్ సినిమాతో బిజీ కానున్నాడు. కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఆ సినిమాపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక ఆ తర్వాత ఓం రావత్ దర్శకత్వంలో చేస్తున్న ఆదిపురుష్ సినిమాను విడుదల చేయనున్నాడు. ఇటీవల 25వ సినిమాపై కూడా క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఆ సినిమాకు స్పిరిట్ అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారు. ఇక 24 ప్రాజెక్ట్ పై త్వరలోనే క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











