విలన్ పాత్ర తప్పకుండా చేస్తాను.. కానీ అ హీరో సినిమాలో మాత్రమే చేస్తాను: గోపిచంద్

మాస్ హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ను క్రియేట్ చేసుకున్న గోపీచంద్ ఇటీవల కాలంలో మాత్రం అనుకున్నంత స్థాయిలో సక్సెస్ అందుకోలేక పోతున్నాడు. అతని నుంచి ఎలాంటి సినిమా వచ్చినా కూడా కనీసం పది కోట్ల షేర్ కలెక్షన్స్ కూడా అందుకోలేకపోతుండడం విశేషం. అసలు ఒకప్పుడు గోపీచంద్ సినిమాలు స్టార్టింగ్ లోనే మంచి ఓపెనింగ్స్ అందుకునేవి.

కానీ ఇప్పుడు మారుతున్న కాలానికి తగ్గట్టుగా ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో గోపి విఫమవుతున్నాడు అనే చెప్పాలి. ఒక విధంగా అతనికి సరైన కథలు తగలడం లేదనే చెప్పాలి. అలాగే అగ్ర దర్శకులతో కూడా సినిమాలు చేసే అవకాశం రావడం లేదు అని చెప్పాలి. గోపిచంద్ కూడా విభిన్నమైన దర్శకులతో సినిమాలు చేయగలిగితే తప్పకుండా స్టార్ గా ఎదుగుతాడు అని ఫ్యాన్స్ చెబుతున్నారు. ఇక ఇప్పుడు మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన పక్కా కమర్షియల్ సినిమాతో సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు.

Gopichand about villan charecter for prabhas movies

అయితే గోపిచంద్ ప్రభాస్ మంచి స్నేహితుడు అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఇద్దరూ కలిసి చేసిన వర్షం సినిమా అప్పట్లో సంచలన విజయాన్ని అందుకుంది. ఒక విధంగా వర్షం సినిమాలో గోపీచంద్ విలన్ పాత్రలో నటించినప్పటికే ఆ పాత్ర దాదాపు హీరోటకు సమానంగా గుర్తింపు తీసుకొచ్చింది. అయితే గోపీచంద్ హీరోగా మారిన తర్వాత నెగిటివ్ క్యారెక్టర్ విలన్ పాత్రలు చేయలేదు. మళ్లీ అలాంటి పాత్రలు చేస్తే అద్భుతంగా ఉంటుంది అని చాలామంది సలహాలు కూడా ఇచ్చారట. కానీ గోపిచంద్ మాత్రం అలాంటి ప్రయోగాలు చేయడానికి ఇష్టపడలేదు.

ఇక రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూ లో గోపీచంద్ మళ్ళీ విలన్ గా నటిస్తారా అని అడిగితే ఒక అద్భుతమైన సమాధానం ఇచ్చాడు. విలన్ క్యారెక్టర్ తప్పకుండా చేస్తాను అది కూడా కేవలం ప్రభాస్ సినిమాలోనే నటిస్తానని ప్రభాస్ సినిమాల్లో కేవలం విలన్ పాత్ర అనే కాదు ఎలాంటి పాత్ర వచ్చిన కూడా చేస్తాను అని అన్నాడు. అలాగే అక్కడ క్యారెక్టర్ ముఖ్యం కాదు అని ఫ్రెండ్షిప్ అనేదాని కోసమే సినిమా చేస్తాను అని గోపీచంద్ చాలా వినయంగా వివరణ ఇవ్వడం విశేషం. ఒక విధంగా మా ఇద్దరి మధ్య స్నేహం వర్షం కంటే ముందు నుంచే వుంది అని ప్రభాస్ ను మొదటి చూసినప్పుడు అతను తప్పకుండా మంచి హీరో అవుతాడు అనిపించింది అని కూడా గోపీచంద్ పాజిటివ్ గా మాట్లాడాడు.

More from Filmibeat

Read more about: gopichand villan prabhas
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X