గోపీచంద్ ఇంట్లో హోలీ సంబరాలు.. ఫ్యామిలీ పిక్స్ వైరల్

గోపీచంద్.. యాక్షన్ హీరోకు కావాల్సిన హైటు, వెయిటు అన్నీ ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే మాస్ హీరోగా మంచి యాక్షన్ సినిమలతో అందర్నీ ఆకట్టుకున్నాడు. అయితే అదృష్టం మాత్రం ఈ హీరోకు అంతగా లేదనిపిస్తుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక్క హిట్ కొట్టలేకపోతున్నాడు. వరుసగా ఫ్లాపులు మూటగట్టుకుంటున్నా.. పట్టువదలని విక్రమార్కుడి విజయం కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు.

గోపీచంద్ ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేస్తున్నాడు. సీటీమార్ అంటూ రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్ అండ్ ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలను పెంచేసింది. తమన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం చకచకా జరగుతోంది.

 Gopichand family Pics While Holi Celebrations

అదంతా కాసేపు పక్కనపెడితే గోపీచంద్ వ్యక్తిగత జీవితానికి వద్దాం. గోపీచంద్ ఫ్యామిలీతో ఎక్కువ సమయం గడిపేందుకు ఇష్టపడతానని అందరికీ తెలిసిందే. శ్రీకాంత్ మేనకోడలు రేష్మను గోపీచంద్ 2013లో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి ఇద్దరు (విరాట్ కృష్ణ, వియాన్) పిల్లలున్నారు. గోపీచంద్ ఇంట తాజాగా హోలీ సంబరాలు జరిగినట్టు తెలుస్తోంది. ఈ మేరకు గోపీచంద్ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అందులో గోపీచంద్ ఇద్దరు పిల్లలు ఎంతో క్యూట్‌గా ఉన్నారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X