షూటింగ్ స్పాట్ లో గోపీచంద్ కు తీవ్ర గాయాలు.. అసలు ఏమైందంటే?
తెలుగు హీరో తొట్టెంపూడి గోపీచంద్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తొలుత హీరో ఎంట్రీ ఇచ్చిన ఆయన ఆ తర్వాత విలన్గా మారి మళ్ళీ హీరోగా మారి వరుస విజయాలు అందుకున్నాడు. గత కొంతకాలంగా సరైన హిట్ కోసం పరితపిస్తున్న ఆయన ప్రస్తుతం తనకు వరుస విజయాలు అందించిన శ్రీ వాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. అయితే ఆ సినిమా షూటింగ్ లో ఆయనకు భాగంగా తీవ్ర గాయాలు అయినట్లు ప్రచారం జరుగుతోంది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే

మహేష్ బాబుకు విలన్గా
దర్శకుడు టి కృష్ణ సినీ వారసుడిగా రంగ ప్రవేశం చేసిన గోవింద్ ముందుగా తొలి వలపు అనే సినిమా ద్వారా హీరోగా పరిచయం అయ్యారు. అయితే ఆ సినిమా ఆయనకు పెద్దగా పేరు తీసుకురాలేదు. ఆ తర్వాత ఆయన విలన్ గా మారి జయం సినిమాలో అందరినీ మెప్పించాడు. ఇక ఆ తర్వాత నిజం అనేది సినిమాలో మహేష్ బాబుకు విలన్గా నటించి ప్రేక్షకులను అలరించాడు.

హీరోగా నిలదొక్కుకుని
ఆ తర్వాత తమిళ జయం సినిమాలో కూడా ఆయన తన పాత్రనే నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక వర్షం సినిమాతో కూడా ప్రభాస్ కు విలన్ గా నటించి తెలుగులో ది బెస్ట్ విలన్ గా పేరు తెచ్చుకున్నాడు . ఇక ఆ తర్వాత యజ్ఞం సినిమాలో హీరోగా మారిన ఆయన మళ్లీ వెనక్కి తిరిగి చూసుకునే పని పడలేదు. ఆంధ్రుడు, రణం, రారాజు, ఒక్కడున్నాడు, లక్ష్యం, శౌర్యం వంటి అనేక సినిమాల్లో ఆయన హీరోగా నిలదొక్కుకున్నాడు.

మైసూర్ లో షూటింగ్
అయితే 2014వ సంవత్సరంలో లౌక్యం సినిమాతో చివరి హిట్ అందుకున్న ఆయన ఆ తర్వాత మరో హిట్ అందుకోవడానికి చాలా కష్టాలు పడ్డాడు. చివరిగా సీటీమార్ అనే సినిమాతో ఒక మోస్తరు హిట్ అందుకున్న ఆయన ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. అలాగే తనకు బాగా కలిసి వచ్చిన దర్శకుడు శ్రీవాస్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేస్తున్నాడు. అసలు విషయానికి వస్తే ప్రస్తుతానికి గోపీచంద్ శ్రీ వాస్ సినిమా షూటింగ్ కర్ణాటక రాష్ట్రం మైసూర్ లో జరుగుతోంది.

ఏమీ కాలేదు
అయితే మైసూర్లో షూటింగ్ జరుగుతున్న సమయంలో ఒక ఫైట్ సీన్ కోసం డూప్ లేకుండా గోపీచంద్ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలోనే గోపీచంద్ ప్రమాదానికి గురైనట్లు సమాచారం. షూటింగ్ స్పాట్ లో ఎత్తుగా ఉన్న ప్రదేశం నుంచి కాలు జారి కింద పడినట్లు సినిమా యూనిట్ ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతానికి గోపీచంద్ ఆరోగ్యం నిలకడగానే ఉందని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంటూ డైరెక్టర్ శ్రీవాస్ ఒక ప్రకటనలో తెలిపారు.

త్వరగా కోలుకోవాలని
అయితే తమ అభిమాన హీరోకి గాయాలయ్యాయి అన్న విషయం తెలుసుకున్న అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. త్వరగా కోలుకోవాలని దేవుని ప్రార్థిస్తున్నాను. ఇక ఈ ఏడాది మారుతి దర్శకత్వంలో వస్తున్న పక్కా కమర్షియల్ అలాగే శ్రీ వాస్ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమాలతో హిట్స్ అందుకొని మళ్లీ ఫామ్ లోకి రావాలని ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











