గోపీచంద్, రాశి ఖన్నా కొత్త చిత్రం ఎప్పటి నుంచి అంటే!
Recommended Video

హీరో గోపీచంద్ కెరీర్ ప్రస్తుతం ఒడిదుడుకులతో కొనసాగుతోంది. గోపీచంద్ చివరగా నటించిన పంతం సరైన విజయాన్ని తెచ్చిపెట్టలేదు. గోపీచంద్ చాలా కాలం నుంచి ఓ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇదిలా ఉండగా గోపీచంద్ తమిళ దర్శకుడు తిరు దర్శత్వంలో ఈ చిత్రంలో నటించేందుకు సిద్ధం అవుతున్నాడు. ఈ చిత్రంలో గోపీచంద్ సరసన రాశి ఖన్నా హీరోయిన్ గా నటించనుంది.
ఈ చిత్రానికి సంబందించిన తాజాగా ఓ అప్డేట్ వచ్చింది. జనవరి 18 నుంచి ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో గోపీచంద్ సరికొత్త గెటప్ లో కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర ఈచిత్రాన్ని ఏకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది.

తన కెరీర్ లో యజ్ఞం, రణం, లక్ష్యం లాంటి విజయాలు అందుకున్నాడు. ఇటీవల సరైన హిట్ లేక కెరీర్ జోరు బాగా తగ్గింది. దీనితో గోపీచంద్ తన కొత్త చిత్రంపై ఆశలు పెట్టుకున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి. సౌఖ్యం చిత్రం తరువాత గోపీచంద్ నటించిన గౌతమ్ నంద, ఆరడుగుల బులెట్ లాంటి చిత్రాలు నిరాశపరిచాయి.


Click it and Unblock the Notifications











