బడా చిత్రాల బాటలోనే ‘పక్కా కమర్షియల్’: కీలక నిర్ణయం తీసుకున్న గోపీచంద్
విలన్‌గా కెరీర్‌ను ఆరంభించి.. హీరోగా మారాడు టాలెంటెడ్ స్టార్ గోపీచంద్. కెరీర్ ఆరంభంలోనే రెండు రకాలుగా మెప్పించిన అతడు.. ఎన్నో విజయాలను అందుకున్నాడు. హీరోగా చేసిన సుదీర్ఘమైన ప్రయాణంలో చాలా సినిమాల్లో నటించాడు. అయితే, వాటిలో కొన్ని మాత్రమే హిట్లుగా నిలిచాయి. ఇక, ఈ మధ్య కాలంలో 'లౌక్యం' తర్వాత సరైన హిట్ లేక ఇబ్బందులు ఎదుర్కొంటోన్నాడు. అప్పటి నుంచి విజయాన్ని అందుకోవడం కోసం వరుస పెట్టి సినిమాలు చేస్తున్నా ఏమాత్రం ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఓ సినిమా చేస్తున్నాడు.
గోపీచంద్ ప్రస్తుతం చేస్తున్న చిత్రం 'పక్కా కమర్షియల్'. వినోదభరిత చిత్రాలతో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా పేరొందిన మారుతి దీన్ని రూపొందిస్తున్నాడు. గత నెలలోనే ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం అయింది. అప్పటి నుంచి ఏమాత్రం బ్రేక్ లేకుండా చిత్రీకరణ జరుపుతున్నారు. అయితే, ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండడంతో.. ఈ సినిమా షూటింగ్‌ను నిలిపి వేయాలని గోపీచంద్ డిసైడ్ అయినట్లు తాజాగా తెలిసింది. ఇందులో భాగంగానే ఈరోజు నుంచి చిత్రీకరణను ఆపేశారని సమాచారం. వైరస్ ప్రభావం తగ్గిన తర్వాతనే దీన్ని పున: ప్రారంభిస్తారని తెలుస్తోంది.

గోపీచంద్ కెరీర్‌లోనే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న 'పక్కా కమర్షియల్' చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో యూవీ క్రియేషన్స్, జీఏ2 బ్యానర్లపై బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారట. అందులో ఒకరు గ్లామరస్ క్వీన్ రాశీ ఖన్నా కాగా.. మరొకరు తెలుగు అమ్మాయి ఈషా రెబ్బా అని తెలుస్తోంది. షూటింగ్ ప్రారంభం కాక ముందే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించారు. ఇదిలా ఉండగా.. గోపీచంద్.. సంపత్ నంది దర్శకత్వంలో నటించిన 'సీటీమార్' కూడా కరోనా ప్రభావం కారణంగా విడుదల వాయిదా పడిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











