గోపిచంద్ చేయాల్సిన పవర్ఫుల్ పాత్రలో రానా.. నిజంగా బ్యాడ్ లక్!
పెద్దగా బాక్సాఫీస్ హిట్స్ అందుకోకపోయినప్పటికి మాస్ ఆడియెన్స్ లో తనకంటూ ఒక మంచి క్రేజ్ దక్కించుకున్నాడు సీనియర్ హీరో గోపిచంద్. అయితే నిన్నా మొన్న వచ్చిన హీరోలు మంచి క్రేజ్ తో దూసుకుపోతుంటే గోపిచంద్ మాత్రం ఇంకా సరైన రేంజ్ లో కుదురుకోవడం లేదు. దానికి తోడు వరుస అపజయాలు హీరోను కాస్త ఇబ్బంది పెడుతున్నాయి.
ఇకపోతే గోపిచంద్ ఒక మంచి అవకాశం మిస్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన చేయాల్సిన ఒక పవర్ఫుల్ పాత్రను రానా చేస్తున్నాడు. ఆ సినిమా మరేదో కాదు. వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న విరాటపర్వం సినిమాలో రానా దగ్గుబాటి ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో నటిస్తున్నాడు. అయితే ఆ పాత్ర కోసం మొదట దర్శకుడు గోపిచంద్ నిసంప్రదించారట.

కానీ గోపిచంద్ సీటిమార్ సినిమాతో పాటు మరో రెండు సినిమాలను సెట్స్ పైకి తేవడంతో వేరే ఆఫర్స్ వచ్చినా డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయాడట. అందుకే విరాటపర్వం సినిమాను చేయలేకపోయాడట. నక్సల్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఆ సినిమాలో సాయి పల్లవి, ప్రియమణి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆ సినిమాపై ఇప్పటికే ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అయ్యాయి. అయితే నటనకు మంచి స్కోప్ ఉన్న అలాంటి సినిమాను మిస్ చేసుకోవడం నిజంగా గోపిచంద్ బ్యాడ్ లక్ అనే చెప్పాలి.


Click it and Unblock the Notifications











