అమ్మాయిలకు 'సీటీమార్' ఆఫర్ ఇచ్చిన స్టార్ హీరో
యాక్షన్ హీరోగా మాస్ ఆడియెన్స్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న గోపిచంద్ సీటీమార్ సినిమాతో ఈ సారి ఎలాగైనా బాక్సాఫీస్ హిట్ కొట్టాలని అనుకుంటున్నాడు. గత కొంతకాలంగా వరుస అపజయాలతో సతమతమవుతున్న గోపిచంద్ కు ఈ సినిమా హిట్టవ్వడం చాలా ముఖ్యం. బడ్జెట్ కూడా ఎక్కువగానే పెట్టారు.
కబడ్డీ గేమ్ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో గోపిచంద్ ఉమెన్స్ టీమ్ కోచ్ గా కనిపించబోతున్నాడు. ఇక హీరోయిన్ తమన్నా కూడా తెలంగాణ టీమ్ కోచ్ గా కనిపించబోతోంది. ఈ సినిమాపై ఓ వర్గం ఆడియెన్స్ లో అంచనాలు బాగానే ఉన్నాయి. ఇక ఏప్రిల్ 2న సినిమా విడుదల అవుతున్న సందర్భంగా చిత్ర యూనిట్ ప్రమోషన్ డోస్ పెంచింది. అమ్మాయిలకు చిత్ర యూనిట్ ఒక మంచి ఆఫర్ కూడా ఇచ్చింది.

Thigh-fi seetimar కాంటెస్ట్ లో భాగంగా స్పెషల్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వారికి చిత్ర యూనిట్ ను కలిసే అవకాశం ఇస్తున్నారు. మెప్పించిన అమ్మాయిలు స్టార్ హీరో గోపిచంద్ తో పాటు తమన్నాను కూడా కలుసుకోవచ్చట. ఇక ఈ సినిమాను సంపత్ నంది డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. గౌతమ్ నంద వంటి డిఫరెంట్ సినిమా అనంతరం గోపిచంద్ తో చేస్తున్న రెండవ సినిమా ఇది. మరి సీటీమార్ తో అయిన ఈ కాంబో బాక్సాఫీస్ వద్ద రికార్డులను క్రియేట్ చేస్తుందో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











