రిస్క్ చేయడానికి సిద్దమైన గోపిచంద్.. ఒకేసారి రెండు సినిమాలు..
యాక్షన్ హీరో గోపిచంద్ బ్యాడ్ లక్ ఏమిటో గాని స్టార్ హీరో అయ్యే లక్షణాలు నిండుగా ఉన్నప్పటికీ ఇంకా సరైన రేంజ్ లో క్లిక్కవ్వడం లేదు. గత కొన్నేళ్లుగా మీడియం హీరోగానే కొనసాగుతున్నాడు. అలాగే అతని కెరీర్ కి సరైన సాలీడ్ కథలు కూడా తగలడం లేదు. ఇక నెక్స్ట్ సినిమాలతో ఎలాగైనా సాలీడ్ సక్సెస్ అందుకోవాలని చూస్తున్నడు.
సీటిమార్ సినిమాను రిలీజ్ కి రెడీ చేసే పనిలో ఉన్న గోపిచంద్ కరోనా తగ్గితే వీలైనంత త్వరగా ఆ సినిమాను రిలీజ్ చేయాలని అనుకుంటున్నాడు. అందుకే ఆగస్ట్ లోనే మరో సినిమాను మరో సినిమాను స్టార్ట్ చేయాలని చూస్తున్నాడు. ఇక నుంచి సినిమాలకు ఎక్కువగా గ్యాప్ ఇవ్వకూడదని మరో ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు.

తేజ దర్శకత్వంలో అలివేలు వెంకటరమణ అనే సినిమా స్టార్ట్ చేయబోతున్న గోపి ఆ సినిమా షూటింగ్ ని ఆగస్ట్ లోనే స్టార్ట్ చేయనున్నడు. కరోనా పరిస్థితి ఎలా ఉన్నా కూడా ఆగస్టులోనే సినిమాను సెట్స్ పైకి తేవాలని గోపిచంద్ రిస్క్ చేస్తున్నాడు. అదే సమయంలో సీటిమార్ కి సంబంధించిన పనులను పూర్తి చేయనున్నాడు. అలాగే మరో రెండు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన గోపిచంద్ తేజ దర్శకత్వంలో సినిమా ఎండ్ అయిన తరువాత తన కొత్త సినిమాను స్టార్ట్ చేయనున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











