Don't Miss!
- News హైదరాబాద్, కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థులు వీరే: ఖమ్మంలో హీరో వెంకటేష్ వియ్యంకుడు
- Sports T20 World Cup 2024 బ్రాండ్ అంబాసిడర్‌గా పరుగుల చిరుత.!
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
గోపిచంద్ యాక్షన్ మూవీ.. మొత్తానికి టార్గెట్ సెట్టయ్యింది
టాలీవుడ్ లో మాస్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న హీరో గోపీచంద్. విలన్ పాత్రలు చేసి మొదట ఒక నటుడిగా తానేంటో నీరూపించుకున్న తరువాతే హీరోగా సక్సెస్ అందుకున్నాడు. గోపిచంద్ సినిమా కోసం బాగానే కష్టపడతాడు గాని అతనికి కరెక్ట్ కథలు పడటం లేదు. మాంచి మాస్ యాక్షన్ కథలు పడితే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్. మరో రేంజ్ లో ఉంటాయని చెప్పవచ్చు.
గత ఐదేళ్ల నుంచి కూడా గోపిచంద్ కు సరైన సక్సెస్ లేదు. చివరగా జిల్ సినిమా తప్పితే మరేసినిమా పెద్దగా సక్సెస్ కాలేదు. ఆ మధ్య వచ్చిన గౌతమ్ నంద కాస్త హడావుడి చేసింది కానీ బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత రేంజ్ లో లాభాలు అందించలేకపోయింది. అనంతరం ఆక్సిజన్, పంతం, చాణక్య వంటి సినిమాలు కూడా బోల్తా కొట్టాయి. ఇక తన ఆశలన్నీ కూడా గోపిచంద్ సీటిమార్ సీనిమాపైనే పెట్టుకున్నారు.
టీవీ యాంకర్ అర్చన విజయ: బికినిలో అందాలు ఆరబోత (ఫొటోలు)
సంపత్ నంది దర్శకత్వంలో చేస్తున్న సీటీ మార్ సినిమా ఉగాదికి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా కబడ్డీ బ్యాక్ గ్రౌండ్ లో తెరకెక్కుతోంది. గోపీచంద్, తమన్నా ఇద్దరు కూడా కబడ్డీ జట్ల యొక్క కోచ్ లుగా నటిస్తున్నారు. ఈ సారి రిలీజ్ విషయంలో ఆలస్యం చేయకుండా ఉగాదికి రావాలని నిర్మాతలు కూడా ఫిక్స్ అయినట్లు సమాచారం. మరి సినిమా ఏ రేంజ్ లో హిట్టవుతుందో చూడాలి.