సమ్మర్ రేసులో గోపీచంద్ కూడా.. పవన్ కళ్యాణ్ కంటే ముందే..
లాక్ డౌన్ దెబ్బకు సైలెంట్ అయిన బాక్సాఫీస్ సింహాలు ఒక్కసారిగా దండయాత్రకు సిద్ధమైనట్లు అనిపిస్తోంది. ఒకరి తరువాత మరొకరు రిలీజ్ డేట్స్ ను ఎనౌన్స్ చేస్తున్నారు. వేలాది థియేటర్స్ ఉన్నప్పటికీ మళ్ళీ సమయానికి రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయకపోతే ఖాళీ దొరకదని ముందే ఎనౌన్స్ చేస్తున్నారు. గోపిచంద్ కూడా పవర్ఫుల్ గా రెడీ అవుతున్నాడు.
మరింత గ్లామర్‌గా శృతి హాసన్.. క్రాక్ విజయంతో మరింత జోష్‌గా

ముందు జాగ్రత్తగా..
సమ్మర్ లో ఈ సారి ఆడియెన్స్ కోల్పోయిన అసలైన ఎంటర్టైన్మెంట్ ఒక్కసారిగా టన్నుల లెక్కన దొరకబోతున్నట్లు అర్ధమవుతోంది. ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద క్రాక్ ఇచ్చిన బూస్ట్ చాలా మందికి నమ్మకాన్ని ఇచ్చింది. మళ్ళీ రిలీజ్ డేట్స్ ను మరొకరు బుక్ చేసుకోకుండా ఉండడానికి ముందుగానే ఎనౌన్స్ చేస్తున్నారు.

సమ్మర్ రేసులో సీటీమార్ కూడా..
అసలు మ్యాటర్ లోకి వస్తే ప్రస్తుతం గోపిచంద్ సీటీమార్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. సమ్మర్ రేసులో ఈ సినిమా కూడా పోటీకి దిగుతోంది. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కబడ్డీ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది. గత ఏడాది రావాల్సిన ఈ సినిమా కరోనా వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఇక తమన్నా భాటియా కథనాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే.

రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చిన హీరో
ఇక ఫైనల్ గా సినిమా రిలీజ్ డేట్ పై హీరో క్లారిటీ ఇచ్చేశాడు. ఏప్రిల్ 2న సినిమా గ్రాండ్ గా విడుదల కాబోతున్నట్టుకు వివరణ ఇచ్చేశారు. ఇంతకుముందు ఆగస్ట్ లో వచ్చే ఛాన్స్ ఉందని కొన్ని రూమర్స్ వచ్చాయి. కానీ దర్శకుడు ఏప్రిల్ మొదట్లోనే ఫిక్స్ చేసుకున్నాడు. అప్పుడైతే పెద్దగా పోటీ ఉండదు.
Recommended Video

సీటిమార్ తరువాత వకీల్ సాబ్
ఏప్రిల్ సెకండ్ వీక్ లోనే పవన్ కళ్యాణ్ సినిమా కూడా వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. పవర్ స్టార్ నెక్స్ట్ వకీల్ సాబ్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక సినిమాను ఏప్రిల్ 9న విడుదల చేయాలని అనుకుంటున్నారు. మరి గోపిచంద్ సీటీమార్, వకీల్ సాబ్ క్రేజ్ ను ఎంతవరకు తట్టుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











