బాక్సాఫీస్ హీరో అనిపించుకోవడానికి ఇదే మంచి అవకాశం!
మాస్ హీరోగా క్రేజ్ అందుకోవాలి అంటే నిజంగా చాలా కష్టపడాల్సి ఉంటుంది. అలాగే ఆ క్రేజ్ వచ్చిన తరువాత దాన్ని మరో స్థాయికి తీసుకు వెళ్ళాలన్నా కష్టమే. ఇక హీరో గోపిచంద్ అలాంటి కష్టాన్నే చూస్తున్నాడు. మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు గాని ఇంకా అనుకున్నంత రేంజ్ కి రాలేదు. అందుకే ఎలాగైనా బాక్సాఫీస్ వద్ద సాలీడ్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు.
ఆ మధ్య సాహసం సినిమాతో కాస్త హైప్ క్రియేట్ మంచి ఓపెనింగ్స్ అయితే అందుకున్నాడు. కానీ బాక్సాఫీస్ రికార్డులు మాత్రం క్రియేట్ చేయలేకపోయాడు. అసలు మ్యాటర్ లోకి వస్తే ఇన్నాళ్లకు గోపిచంద్ కి బాక్సాఫీస్ వద్ద ఒక ట్రెండ్ సెట్ చేసే అవకాశం దొరికింది. ఎలా అంటే.. నెక్స్ట్ ఈ హీరో మారుతి దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు.

ఎక్కువగా కామెడీ ఎంటర్టైన్మెంట్ కథలు తీసే మారుతి గోపిచంద్ బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా ఒక కథను సెట్ చేశాడట. అందులో మాస్ అంశాలతో పాటు మారుతి మార్క్ కి తగ్గట్టుగా కామెడీ కూడా ఉంటుందట.
ఇక మారుతి గత సినిమాలు ఎలాంటి ఓపెనింగ్స్ ని అందుకున్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. నాని, శర్వానంద్, సాయి ధరమ్ తేజ్ లాంటి హీరోల బాక్సాఫీస్ రేంజ్ ని పెంచిన మారుతి అదే తరహాలో గోపిచంద్ మార్కెట్ ని కూడా ఈజీగా పెంచే ఛాన్స్ ఉంది. మరి ఈ కాంబినేషన్ ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











