Mahesh Babu 'గుంటూరు కారం' రిజల్ట్ - త్రివిక్రమ్‌కు ఆ మాట ఇచ్చిన మహేశ్ బాబు
సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్ కలయికలో 'అతడు', 'ఖలేజా' సినిమాల తర్వాత రీసెంట్గా 'గుంటూరు కారం' సినిమా వచ్చింది. అయితే ఈ సినిమా వసూళ్ల పరంగా పర్వాలేదనిపించినప్పటికీ మిక్స్డ్ టాక్‌ను మాత్రమే సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా తీయడానికి ముందు మహేశ్ - త్రివిక్రమ్ మధ్య పెద్ద డ్రామానే జరిగిందట! అందుకే రిజల్ట్ ఇలా వచ్చిందని తెలిసింది. దీంతో ఫైనల్‌గా మహేశ్ - మాటల మాంత్రికుడికి ఓ మాట ఇచ్చారంట. అదేంటంటే..
భారీ అంచనాలతో ఈ సంక్రాంతి బరిలో నిలిచిన భారీ బడ్జెట్ సినిమా 'గుంటూరు కారం'. సంక్రాంతి పండుగ, అందులోనూ ఓ 'స్టార్ హీరో - స్టార్ డైరెక్టర్' కాంబోలో సినిమా అంటే ఆ హంగామానే వేరుగా ఉంటుంది. రిలీజ్‌కు ముందు 'గుంటూరు కారం' విషయంలోనూ అదే జరిగింది. చాలా కాలం తర్వాత మహేశ్ - త్రివిక్రమ్ కలిసి చేసిన సినిమా అవ్వడం అందరూ మొదటి ప్రాధాన్యత దీనికే ఇచ్చారు. కానీ సీన్ రివర్స్ అయింది.

ఎందుకంటే తన సినిమాల్లో కథపై పూర్తి పట్టుని ప్రదర్శిస్తూ బలమైన భావోద్వేగాలు, పదునైన మాటలతో మేజిక్ చేసే త్రివిక్రమ్ ఈ చిత్రంలో అలాంటి మేజిక్‌ను పునరావృతం చేయలేకపోయారు. తల్లి కొడుకుల బంధం పాయింట్‌తో సాగే ఈ కథ ఆదిలోనే తేలిపోయింది. త్రివిక్రమ్ బలహీనమైన రచనతో నిరాశపరిచారు.
అయితే వాస్తవానికి గుంటూరు కారం కోసం మొదట అనుకున్న కథ ఇది కాదట. త్రివిక్రమ్.. మహేశ్ బాబుతో ఓ యాక్షన్ సినిమా చేయాలని అనుకున్నారట. సినిమా ఓకే కూడా అయింది. దీనినే అనౌన్స్ చేశారు. కానీ తర్వాత కొద్ది రోజులకు మహేశ్ బాబు మనసు మారిందట. ఎందుకంటే నెక్ట్స్ దర్శకధీరుడు రాజమౌళితో చేసేది కూడా పక్కా యాక్షన్ సినిమానే. అందుకే యాక్షన్‌కు ముందు ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సినిమా చేస్తే బాగుంటుందని త్రివిక్రమ్‌తో చెప్పారట.

దీంతో త్రివిక్రమ్ తన కథను మార్చుకోవాల్సి వచ్చిందట. కానీ అప్పటికే సంక్రాంతికి అంటూ సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేసేశారు. దీంతో మాటల మాంత్రికుడు త్వరత్వరగా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా కొత్త కథను రెడీ చేసి గుంటూరు కారం పేరుతో తీసుకొచ్చారు. పైగా షూటింగ్ వాయిదాల పర్వంతో కొనసాగడం, సినిమాలోని టెక్నిషియన్స్‌తో పాటు ఇతర కాస్ట్ తప్పుకోవడం సహా ఇతరత్ర సమస్యల వల్ల 'గుంటూరు కారం' కొత్త కథ ఔట్ పుట్ సరిగ్గా రాలేదని అంటున్నారు.
మహేశ్ ముందుగా అనుకున్న కథను మార్చడం, ఆ తర్వాత త్రివిక్రమ్ తన స్టైల్ అండ్ మేజిక్కు తగ్గట్టుగా తీయలేకపోవడం వల్ల ఈ సినిమా రిజల్ట్ మిక్స్డ్ టాక్ అందుకుంది. ఇదంతా అర్థం చేసుకున్న మహేశ్ - త్రివిక్రమ్ ఈ సారి మళ్లీ ముందుగా అనుకున్న విధంగా యాక్షన్ సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారట. మహేశ్ కూడా కచ్చితంగా సినిమా చేస్తానని త్రివిక్రమ్‌కు మాట ఇచ్చారట. అయితే ఇది రాజమౌళి సినిమా అయ్యాకే పట్టాలెక్కుతుందని తెలిసింది. అంటే జక్కన్న సినిమాకు ఎలాగో రెండు, మూడేళ్లు పడుతుంది కాబట్టి త్రివిక్రమ్ - మహేశ్ సినిమా రావడానికి చాలా సమయమే పట్టొచ్చు.


Click it and Unblock the Notifications











