twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిరంజీవి లాంటి అన్నయ్య ఉంటే.. అలాంటి ఆత్మహత్యలు ఉండేవి కావు.. పవన్ కల్యాణ్

    |

    Recommended Video

    Pawan Kalyan Speech At Chiranjeevi Birthday Celebrations || Filmibeat Telugu

    మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు భారీ ఎత్తున్న అభిమానులు తరలి వచ్చారు. పెద్ద ఎత్తున్న అభిమానులు తరలి రావడంతో వేదిక ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఈ వేడుకకు నిర్మాత అల్లు అరవింద్, చిరు అల్లుడు కల్యాణ్ దేవ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడుతూ..

    నాకు అన్నయ్య స్ఫూర్తి ప్రదాత

    నాకు అన్నయ్య స్ఫూర్తి ప్రదాత

    మా అన్నయ్య చిరంజీవి నాకు స్ఫూర్తి ప్రదాత. నా జీవితంలో నాకు ఇద్దరు ఇష్టం. ఒకరు చిరంజీవి అయితే మరొకరు అమితాబ్ బచ్చన్. అలాంటి అమితాబ్ బచ్చన్‌ను కలిసే అవకాశం సైరా షూటింగ్‌లో కలిగింది. నాకు జీవితంలో చిరంజీవి గారు స్పూర్తి ఎందుకంటే.. అందుకు ఓ మాట చెప్పాలి. తెలంగాణలో ఇంటర్ ఫలితాల్లో అవకతవకల కారణంగా విద్యార్థులు చనిపోయారు. ఆ సంఘటనలు చాలా బాధించాయి. అప్పుడు నాకు అన్నయ్య గుర్తొచ్చాడు.

    మూడుసార్లు దారితప్పితే

    మూడుసార్లు దారితప్పితే

    నా జీవితంలో కూడా అలాంటి సంఘటనలే ఎదురుయ్యారు. నా జీవితంలో మూడుసార్లు దారి తప్పితే సరిదిద్దిన వారిలో అన్నయ్య ఒకరు. నేను ఇంటర్మీడియెట్ ఫెయిల్ అయితే నేను ఎలాంటి అఘాయిత్యం చేసుకోకుండా మంచి మాటలు చెప్పారు. తెలంగాణలో కూడా చిరంజీవి లాంటి అన్నయ్య ఉంటే విద్యార్థులు ఆత్మహత్య చేసుకొనే వాళ్లు కాదు అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

    ఉద్యమకారుడి అవుతాననే భయంతో

    ఉద్యమకారుడి అవుతాననే భయంతో

    యుక్త వయసులో ఉన్నప్పుడు భారతదేశాన్ని ఎవరైనా ఏమన్నా అంటే ఉద్రేకపడిపోయే వాడిని. అలాంటి సమయంలో అన్నయ్య చూసి వీడు ఉద్యమకారుడు అయిపోతాడేమోనని భయపడ్డాడు. అప్పుడు నాకు ఓ మాట చెప్పాడు. కులం, మతం వదిలేసి మానవత్వాన్ని ఒంటపట్టించుకో అని చెప్పడంతో నేను ఉద్యమకారుడిని అవ్వాలనే ఆలోచనను మానుకొన్నాను.

    నీకు బాధ్యత లేదనే చురకతో

    నీకు బాధ్యత లేదనే చురకతో

    నా జీవితంలో ఏం సాధించలేదనే నిరాశలో ఉండి తిరుపతిలోని ధ్యాన కేంద్రంలో చేరాను. ఆరు నెలలు అన్నయ్యకు కనిపించకుండా ఉన్నాను. ఆ తర్వాత ధ్యానం, యోగా విశిష్టతను చెప్పి.. అధ్యాత్మికం వైపు వెళుతానని చెప్పగానే.. మరోసారి మంచి మాట చెప్పాడు. భగవంతుడు వైపు వెళితే నీ స్వార్ధం. సమాజానికి ప్రయోజనం ఉండవు. అలాంటి పనుల చేయడానికి వేరే వాళ్లున్నారు. నీపై ఆధారపడి లేని వాళ్లు లేరనే ఆలోచనలో ఉన్నావు కాబట్టే ఇలా ఆలోచిస్తున్నావు. నీకు బాధ్యత ఉంటే ఇలా ఆలోచించే వాడివి కాదు అని అన్నారు. దాంతో మూడోసారి నా ఆలోచనల్లో మార్పు వచ్చింది అని పవన్ కల్యాణ్ అన్నారు.

    English summary
    Happy Birth Day Chiranjeevi: Pawan Kalyan birthday wishes to Megastar Chiranjeevi. He writes a heart felt message in social media. He stated that he is the Inspirational personality for him. Shilpa Kala vedika has filled with big crowd which the place is organised Chiranjeevi birthday event. Pawan is the chief guest for this function
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X