twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    HBD Megastar Chiranjeevi మొదటి జీతం ఎంతో తెలుసా.. ఆ డబ్బును వారి చేతుల్లో పెట్టేసి..

    |

    టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో అగ్ర హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ డమ్ సెట్ చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. వెండితెర పై స్టార్ హీరోగానే కాకుండా నిజ జీవితంలో కూడా రియల్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్నాడు. ఎలాంటి సినిమా చేసినా కూడా తనదైన శైలిలో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో మెగాస్టార్ స్టైలే వేరు. చేసిన ప్రతి పాత్రకు కూడా సరైన న్యాయం చేయడంలో ఆయన సిద్ధహస్తుడు. నిజ జీవితంలో ఎన్నో మంచి పనులు చేసి అభిమానుల ముఖ్నసుకు మరింత దగ్గరయ్యాడు. ఇక నేడు మెగాస్టార్ చిరంజీవి 66 వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మెగాస్టార్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇక మెగాస్టార్ కెరీర్ కు సంబంధించిన ఎన్నో విషయాలను కూడా గుర్తు చేసుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం రెమ్యునరేషన్ ఏ స్థాయిలో అందుకుంటున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఆయన మొదటి రెమ్యునరేషన్ ఎంత అనేది కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.. ఒకసారి ఆ వివరాల్లోకి వెళితే...

    అత్యధిక పారితోషికం

    అత్యధిక పారితోషికం

    మెగాస్టార్ చిరంజీవి చాలా కాలంగా తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాకుండా సౌత్ ఇండస్ట్రీ మొత్తంలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న స్టార్ హీరోలలో ఒకరు. ప్రస్తుతం ఆయన ఒక సినిమా కోసం దాదాపు 40 నుండి 50 కోట్ల మధ్యలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. అంతేకాకుండా, మెగాస్టార్ తన సినిమాల నుండి వచ్చే లాభాల్లో వాటాను కూడా పొందుతున్నట్లు తెలుస్తోంది. ఆ విధంగా చూస్తే మెగాస్టార్ కొన్ని సందర్భాల్లో ఎవరు ఊహించని స్థాయిలో కూడా ఆదాయం అందుకుంటున్నట్లు చెప్పవచ్చు.

    మొదటి రెండు సినిమాలకు ఉచితంగా

    మొదటి రెండు సినిమాలకు ఉచితంగా

    ఇక ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి అత్యధిక పారితోషికం తీసుకుంటున్న టాప్ 10 తెలుగు నటులలో ఒకరుగా ఉన్నప్పటికీ, చిరంజీవి తన కెరీర్ ప్రారంభ రోజుల్లో మాత్రం ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోకుండా ఉచితంగా వర్క్ చేయాల్సి వచ్చింది. చిరంజీవి 1979 లో పునాదిరాళ్లు సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో తన కెరీర్ ను ప్రారంభించారు. అయితే, థియేటర్లలో ముందుగా ప్రాణం ఖరీదు సినిమా విడుదలైంది. ఒక ప్రముఖ పోర్టల్‌లో ప్రచురించిన నివేదిక ప్రకారం, చిరంజీవి తన మొదటి రెండు సినిమాలకు ఎలాంటి పారితోషికం తీసుకోలేదట.

    నటన అంటే ఎంత ఇష్టమో..

    నటన అంటే ఎంత ఇష్టమో..

    ప్రస్తుత కాలంలో, కొత్తవారు తమ మొదటి సినిమా కోసం భారీ స్థాయిలో రెమ్యునరేషన్ ను అందుకుంటున్నారు. కానీ ఎంతో టాలెంట్ ఉన్నటువంటి మెగాస్టార్ చిరంజీవి వంటి నటులు అప్పట్లో ఉచితంగా పనిచేశారు. ఈ విధంగా చూసుకుంటే ఒకప్పటి నటులు వారి పని పట్ల ఎంత మక్కువ చూపుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఒక సినిమాకు అంటే ఏమో అనుకోవచ్చు. కానీ కంటిన్యూగా రెండు సినిమాలకు రెమ్యునరేషన్ తీసుకోకపోవడం విశేషం.మెగాస్టార్ తన కెరీర్ ను స్టార్ట్ చేసినప్పుడు రెమ్యునరేషన్ విషయం గురించి పెద్దగా ఆలోచించలేదు. కేవలం నటుడిగా సినిమాకు ఏ స్థాయిలో హెల్ప్ అవుతున్నాము అనే విషయంపై మాత్రమే ఎక్కువగా ఫోకస్ పెట్టారు. అనుకున్నట్లుగానే తన డ్రీమ్ ను సాధ్యం చేసుకున్నారు. ఇక హీరోగా క్లిక్కయిన తరువాత మెగాస్టార్ ఆదాయం అంతకంతకూ పెరుగుతూనే వచ్చింది.

     మొదటి జీతం ఎంతంటే..

    మొదటి జీతం ఎంతంటే..


    ఇక అలా ఉచితంగా పనిచేసిన తర్వాత, చిరంజీవి తన మూడవ చిత్రం కోసం మాత్రం నిర్మాతల మన్ననలను పొంది మొదటి జీతాన్ని అందుకున్నాడు. మన వూరి పాండవులు సినిమా కోసం మొదటి జీతం రూ రూ.1116 గా పొందారని సమాచారం. ఈ చిత్రానికి బాపు దర్శకత్వం వహించారు. భూస్వామ్య వ్యవస్థపై పోరాటం నేపథ్యంలో తెరకెక్కిన ఏ సినిమాలో మెగాస్టార్ చేసిన పాత్రకు మంచి గుర్తంపు లభించింది. మన వూరి పాండవులు కన్నడ చిత్రం 'పదువారల్లు పాండవారు' సినిమాకి రీమేక్ గా తెరకెక్కింది. అనంతరం 1980 లో మిథున్ చక్రవర్తి నటించిన హమ్ పాంచ్ పేరుతో హిందీలో రీమేక్ చేయబడింది.

    Recommended Video

    Brandy Diaries ఫ్రెండ్షిప్ కి నిదర్శనం.. క్రౌడ్ ఫండెడ్ మూవీ - Director Sividu
    ఆ డబ్బును వారి చేతుల్లో పెట్టి..

    ఆ డబ్బును వారి చేతుల్లో పెట్టి..

    మనవూరి పాండవులులో చిరంజీవి సహాయక పాత్ర పోషించారు. ఇందులో కృష్ణం రాజు ప్రధాన పాత్ర పోషించారు. ఇక మొదటి రెమ్యునరేషన్‌గా 1116 రూపాయలు సంపాదించిన తరువాత చిరంజీవి ఆ డబ్బును ఏమాత్రం ఖర్చు పెట్టకుండా తల్లిదండ్రులకు ఇవ్వడం విశేషం. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే వరుసగా నాలుగు సినిమాలు లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. ముందుగా ఆచార్య సినిమాతో రాబోతున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ మరో ముఖ్యమైన పాత్రలో కనిపిస్తున్నాడు. అనంతరం మోహన్ రాజా దర్శకత్వంలో లూసిఫర్ రీమేక్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మెగాస్టార్ బాబి మెహర్ రమేష్ అంటే కమర్షియల్ దర్శకులతో కూడా 2 సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే ఈ సినిమాలతో పాటు మారుతి దర్శకత్వంలో 156 సినిమాలు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

    English summary
    Happy birthday Megastar chiranjeevi first remuneration details,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X