Nani Net Worth: క్లాప్ బాయ్ నుంచి పాన్ ఇండియా స్టార్‌గా.. నాని ఆస్తుల విలువ ఎన్ని కోట్లంటే?
విధి రాతను ఎవరూ తప్పించలేరు అనే నిజమని చెప్పడానికి నేచురల్ స్టార్ నాని లైఫ్‌ను చూస్తే నిజమే అనిపిస్తుంది. అతి సాధారణ జీవితం నుంచి అసాధారణ జీవితాన్ని సొంతం చేసుకొన్న వ్యక్తుల్లో ఒకరు ఆయన. లైఫ్‌లో సంకల్ప బలం ఉంటే సాధించలేనిది ఏదీ లేదంటూ నాని నిరూపించాడు. ప్రతీ ఫ్యామిలీలో సభ్యుడిగా, యూత్ ఆడియెన్స్‌లో ఒకడిగా పేరు తెచ్చుకొన్న నాని జన్మదిన ఫిబ్రవరి 24వ తేదీ. ఈ సందర్భంగా నాని లైఫ్ జర్నీ, ఆయన నికర ఆస్తుల విలువకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
క్లాప్ బాయ్‌గా కెరీర్ ప్రారంభించి..
సినీ అభిమానులు ముద్దుగా నేచురల్ స్టార్ అని పిలుచుకొనే నాని అసలు పేరు గంటా నవీన్ బాబు. వైజాగ్‌లో పుట్టి పెరిగిన ఆయన సినిమా రంగం అంటే చిన్నప్పటి నుంచి ప్రాణం. హైదరాబాద్‌లో సాధారణ జీవితాన్ని గడిపే యువకుడిగా తన తొలి ఉద్యోగాన్ని ప్రముఖ దర్శకుడు క్లాప్ బాయ్‌గా చేరారు. ఆ తర్వాత దర్శకుడు బాపు వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా ప్రమోట్ అయ్యారు. సినీ ప్రపంచంలో అదృష్టాన్ని పరీక్షించుకొనే పనిలో ఉంటూనే రేడియో జాకీగా కూడా పనిచేశారు.

రేడియో జాకీగా.. హీరోగా
ప్రముఖ రేడియో ఛానెల్ వరల్డ్ స్పేష్ శాటిలైట్ వద్ద రేడియో జాకీగా పనిచేశాడు. నాన్ స్టాప్ నాని అనే కార్యక్రమాన్ని హోస్ట్ చేశారు. ఇలాంటి పార్ట్ టైమ్ పనులు చేస్తూ అవకాశాల కోసం ఎదురు చూశారు. ఈ క్రమంలోనే దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ కంట్లో పడ్డారు. దాంతో అష్టాచెమ్మా సినిమా ద్వారా నటుడిగా పరిచయం అయ్యారు. వెంటవెంటనే రైడ్, స్నేహితుడా, భీమిలి కబాడ్డీ జట్టు చిత్రాల్లో నటించారు. ఆ తర్వాత అలా మొదలైంది సినిమాతో రెండో భారీ హిట్ అందుకొన్నారు. అనంతరం ఈగ, పిల్ల జమీందార్ ఇలా సక్సెస్ ఫుల్ చిత్రాల్లో నటించి నేచురల్ స్టార్ అయ్యారు.
నిర్మాతగా నేచురల్ స్టార్
నటుడిగా వరుస విజయాలు అందుకొంటూనే డీ ఫర్ దోపిడి సినిమాతో నిర్మాతగా మారారు. ఆతర్వాత ఆ సినిమాతో పూర్తిస్థాయి నిర్మాతగా మారారు. హిట్, మీట్ క్యూట్, హిట్ 2, హిట్ 3 సినిమాలు నిర్మించి సక్సెస్‌పుల్ ప్రొడ్యూసర్ అయ్యారు. ప్రస్తుతం నిర్మాతగా చిరంజీవి, ఓదెల శ్రీకాంత్‌తో సినిమాను నిర్మించే పనిలో ఉన్నాడు.
బుల్లితెర హోస్ట్‌గా
ఇక నటుడిగా, నిర్మాతగా ఆయన టాలెంట్ పరిమితం కాలేదు. బుల్లితెర మీద రియాలిటీ షోలకు హోస్ట్‌గా వ్యవహరించారు. బిగ్‌బాస్ తెలుగు 2 సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరించి మెప్పించాడు. ఇలా బహుముఖ ప్రతిభతో తెలుగు సినిమా రంగంలో ప్రముఖుడిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకొన్నాడు.
నాని నికర ఆస్తుల విలువ
ఇలా తన కెరీర్‌ను విజయవంతంగా కొనసాగిస్తున్న నాని నికర ఆస్తుల విలువ 150 కోట్ల రూపాయలు అని ఆర్థిక నిపుణుల అంచనా. హైదరాబాద్, వైజాగ్, ఇతర ప్రాంతాల్లో 50 కోట్ల రూపాయల స్థిర ఆస్తులు ఉన్నాయి. హైదరాబాద్‌లో 40 కోట్ల విలువైన ఇల్లు, 6 కోట్ల రూపాయల కార్లు, వాహనాలు ఉన్నాయి. ఇతరంగా 5 కోట్ల చర ఆస్తులు ఉన్నాయనేది తాజా లెక్కలు తెలియజేస్తున్నాయి. ఇక ప్రతీ సినిమాకు సుమారుగా 25 నుంచి 30 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకొంటున్నట్టు ట్రేడ్ వర్గాల సమాచారం.
పాన్ ఇండియా సినిమాలతో
ప్రస్తుతం రెండు పాన్ ఇండియా సినిమాలతో నాని రానున్నారు. శ్రీకాంత్ ఓదెలతో కలిసి ది ప్యారడైజ్ సినిమాలో నటిస్తున్నాడు. అలాగే సుజిత్ దర్శకత్వంలో బ్లడీ రోమియో సినిమాలో నటించనున్నారు. ది ప్యారడైజ్ చిత్రం ఆగస్టులో రిలీజ్ కానున్నది.


Click it and Unblock the Notifications











