వెట్టయాన్ తర్వాత రజనీకాంత్ ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా? ఒక్కో మూవీకి రెమ్యునరేషన్ ఎంతంటే?
సూపర్ స్టార్ రజనీకాంత్ బెంగళూరులోని మరాఠీ కుటుంబంలో శివాజీ రావు గైక్వాడ్‌గా జన్మించినప్పటికీ.. అన్ని భాషల్లో సినీ అభిమానులనే కాకుండా అధ్యాత్మిక, హిందూ మతాన్ని ఆచరించే ప్రతీ ఒక్కరిని ఆకట్టుకొన్నారు. ఆయన జన్మదిన డిసెంబర్ 12. తాను 74వ పడిలోకి ప్రవేశించిబోతున్న ఈ సూపర్ స్టార్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన 74 ఏళ్లలో కూడా యాక్షన్, థ్రిల్లర్ చిత్రాలతో ప్రేక్షకులను ఆలరిస్తున్నారు. వెట్టయాన్ మూవీ తర్వాత ఆయన నికర ఆస్తులు ఎంత అనే వివరాల్లోకి వెళితే..
బెంగళూరులో బస్ కండక్టర్ ఉద్యోగిగా జీవితాన్ని ప్రారంభించిన రజనీకాంత్.. 1975 సంవత్సరంలో అపూర్వ రాగాంగల్ సినిమాతో బాలచందర్ దర్శకత్వంలో నట జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత విలన్‌గా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా అనేక చిత్రాల్లో నటించారు. దాదాపు 5 దశాబ్దాల సినీ కెరీర్‌లో ఎన్నో వందల చిత్రాల్లో నటించడమే కాకుండా మెప్పించి సూపర్ స్టార్‌గా అవతరించాడు.

రజనీకాంత్ తన జీవిత భాగస్వామిగా లతా రంగాచారిని చేసుకొన్నారు. అయితే వారిద్దరి పరిచయం ఆశ్చర్యకరంగా జరిగింది. ఆమె ఎథిరాజ్ కాలేజ్ విద్యార్థిగా తన మ్యాగజైన్ కోసం ఇంటర్వ్యూకు రావడం.. రజనీతో పరిచయం జరిగింది. ఆ తర్వాత వారి పరిచయం ప్రేమగా మారింది. 1981లో ఫిబ్రవరి 26వ తేదీన తిరుపతిలో వారి వివాహం జరిగింది. వీరికి ఐశ్వర్య రజనీకాంత్, సౌందర్య రజనీకాంత్ ఇద్దరు సంతానం.
రజనీకాంత్ ఇప్పటి వరకు సుమారుగా 170 సినిమాల్లో నటించారు. ఆయన నటించిన తాజా చిత్రం వెట్టియాన్. ఈ చిత్రం సినీ విమర్శకుల ప్రశంసలు పొందింది. అయితే తన కెరీర్‌లో 171 సినిమాను సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్‌తో చేస్తున్నారు. ఆయన తన కెరీర్‌లో అమితాబ్, ఎన్టీఆర్, చిరంజీవి, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, కమల్ హాసన్ లాంటి ప్రముఖులతో నటించారు.
తమిళనాడులో రజనీ కాంత్‌కు విశేషంగా అభిమానులు ఉన్నారు. దాంతో ఆయన ప్రజా జీవితంలోకి వచ్చేందుకు ప్లాన్ చేసి రాజకీయ పార్టీని ప్రారంభించారు.అయితే తన ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్ల తన పొలిటికల్ ఎంట్రీని రద్దు చేసుకొన్నారు. ఆ తర్వాత సినిమాలపై ఫోకస్ పెట్టారు. ఈ మధ్య కాలంలో భారీ విజయాలను అందుకొన్నారు.
ఇదిలా ఉండగా, రజనీకాంత్ తన కెరీర్‌లో ఎగుడుదిగుడులను చూశారు. 50 సంవత్సరాల నటజీవితంలో సుమారుగా 430 కోట్ల రూపాయల ఆస్తులు తన పేరిట ఉన్నాయని అంచనా వేశారు. ప్రతీ సినిమాకు ఆయన సుమారుగా 50 నుంచి 70 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకొంటారు అని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. దక్షిణాదిలో అత్యధికంగా పారితోషికం తీసుకొనే స్టార్ హీరోగా ఘనతను సాధించారు.


Click it and Unblock the Notifications











