Happy Birthday Ram: ఎనర్జిటిక్ స్టార్‌గా అదుర్స్.. ఇస్మార్ట్‌గా మాస్‌తో RAPO కిర్రాక్

యాక్టింగ్‌తోపాటు స్టయిల్‌ను, ఎనర్జీని జోడించి వెండితెర మీద కిర్రాక్ పుట్టించే యువ హీరోల్లో రామ్ పోతినేని ఒకరు. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ స్రవంతి మూవీస్ అధినేత స్రవంతి రవికిషోర్ కుటుంబ వారసత్వాన్ని అందిపుచ్చుకొని సినీ పరిశ్రమలోకి ప్రవేశించిన రామ్ తనదైన శైలిలో రాణిస్తున్నారు. విభిన్నమైన పాత్రలను ఎంచుకొంటూ యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్‌ను మెప్పిస్తున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ జన్మదినం మే 15. ఈ సందర్భంగా రామ్ వ్యక్తిగత, ప్రొఫెషనల్ విషయాలు..

పెదనాన్న అడుగు జాడల్లో

పెదనాన్న అడుగు జాడల్లో

స్రవంతి రవికిషోర్ సోదరుడు మురళీమోహన్ కుమారుడిగా రామ్ పరిచయమైనప్పటికీ.. పెదనాన్న నీడలోనే పెరిగి ఆయన అడుగుజాడల్లోనే నడుస్తున్నట్టు కనిపిస్తారు. పాత్రల ఎంపికలోనూ తనదైన శైలిలో దూసుకెళ్తున్నారు. దేవదాస్‌తో మొదలైన ప్రయాణం.. ఆ తర్వాత వచ్చిన జగడంతో మాస్ క్యారెక్టర్లపై గురిపెట్టినట్టు అప్పట్లోనే సంకేతాలిచ్చారు. ఇక శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన రెడీ చిత్రం స్టార్‌గా మరో లెవెల్‌కు చేర్చిందని చెప్పవచ్చు.

 పాత్రల్లోకి పరకాయ ప్రవేశం

పాత్రల్లోకి పరకాయ ప్రవేశం

తన గత చిత్రాలను పరిశీలిస్తే పాత్రల కోసం తన శారీరక స్వరూపాన్ని, రూపు రేఖలను మార్చుకోవడానికి సైతం వెనుకాడని, ఎలాంటి సాహసానికైనా సిద్ధ అనే నటుడనే ఫీలింగ్‌ను రామ్ పోతినేని కలిగిస్తారు. అందుకు మసాలా, ఆ మధ్యలో వచ్చిన ఉన్నది ఒకటే జిందగీ.. ఇటీవల వచ్చిన ఇస్మార్ట్ శంకర్ చిత్రాల్లోని గెటప్‌లు తెరమీద కొత్తగా కనిపించాలనే తపన ఆయనలో కనిపస్తున్నది. ఇక త్వరలో రానున్న RED చిత్రంలోని గెటప్స్ మరింత ఆసక్తిని కలిగిస్తున్నాయి.

బాక్సాఫీస్ ఉస్తాద్‌గా

బాక్సాఫీస్ ఉస్తాద్‌గా

టాలీవుడ్‌లో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన రామ్ బాక్సాఫీస్‌ను కుమ్మేసిన సందర్భాలు అనేకం. నేను శైలజా చిత్రంతో తన సినిమాకు రికార్డు ఓపెనింగ్స్ సాధించి తానేంటో నిరూపించుకొన్నారు. ఆ చిత్రం తొలి రోజే రూ.7 కోట్లకుపైగా వసూళ్లను సాధించడం అప్పట్లో రికార్డు. తాజాగా ఇస్మార్ట్ శంకర్‌తోనూ తన స్టార్ పవర్‌ను రుచి చూపించారు. మొదటి రోజున రూ.10 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను, 8 కోట్లకు పైగా షేర్‌ను సాధించడం విశేషం. ఈ చిత్రం ద్వారా తన బాక్సాఫీస్ పవర్‌ను 100 కోట్ల మార్కుకు చేర్చడం విశేషం.

వివాదాలకు దూరంగా

వివాదాలకు దూరంగా

యువ హీరోలంటే వివాదాలకు, గాసిప్స్‌కు కేరాఫ్ అడ్డగా ఉంటారు. మీడియా కూడా యువ హీరోల జీవితాల్లో ఏం జరుగుతుందోననే ఆసక్తిని చూపిస్తూ మరో కోణాలను లాగేందుకు ప్రయత్నిస్తుంటుంది. అలాంటి వివాదాలకు, గాసిప్స్‌కు, రూమర్లకు దూరంగా ఉండే తెలుగు హీరోల్లో రామ్ ఒకరు అనే విషయాన్ని ఎలాంటి సందేహం లేకుండా చెప్పుకోవచ్చు అంటారు సినీ వర్గాలు.

సౌత్ ఇండియాలో ఏకైక హీరో

సౌత్ ఇండియాలో ఏకైక హీరో

ఇక హిందీ డబ్బింగ్ మార్కెట్‌లోనూ. అలాగే య్యూటూబ్‌లోను రామ్ సినిమాలకు విశేష ఆదరణ ఉన్నాయి. ఆయన నటించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాను హిందీలోకి డబ్ చేసి యూట్యూబ్‌లో వదిలితే సెన్సేషన్ క్రియేట్ చేసింది. దాదాపు 100 మిలియన్ల వ్యూస్‌తో అదరగొట్టింది. అంతేకాకుండా హిందీలోకి డబ్ చేసిన ఆయన నాలుగు చిత్రాలు 100 మిలియన్ల వ్యూస్‌ను నమోదు చేసుకోవడం ఓ రికార్డు. దక్షిణాది సినీ పరిశ్రమలో నాలుగు సినిమాలను 100 మిలియన్ల వ్యూస్‌కు చేర్చిన తొలి హీరోగా ఘనతను దక్కించుకొన్నారు.

Recommended Video

Mia Malkova's Climax Teaser Is Out | RGV | GST
REDతో మరోసారి మాస్‌, క్లాస్ హీరోగా

REDతో మరోసారి మాస్‌, క్లాస్ హీరోగా

ప్రస్తుతం RED మూవీ చిత్ర షూటింగ్, ఇతర పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్న రామ్.. ఈ ఏడాది జన్మదినాన్ని నిరాడంబరంగా జరుపుకోవాలని నిర్ణయించుకొన్నారు. దేశంలో నెలకొన్న పరిస్థితులు, అభిమానుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని బహిరంగ వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకొన్నారు. అభిమానులు, సన్నిహితులను ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని రామ్ సూచించారు. ఆయన జన్మదినం సందర్భంగా వివాదాలకు దూరంగా, మంచికి చేరువగా సాగాలని.. మరెన్నో పుట్టిన రోజులను విజయ గర్వంతో జరుపుకోవాలని తెలుగు ఫిల్మీబీట్ ఆయనకు బర్త్ డే విషెస్ అందజేస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X