Happy Birthday Ravi Teja: కష్టాన్ని నమ్ముకొని వేల రూపాయల నుంచి 50కోట్లకు చేరుకున్న హీరో
మాస్ మహారాజా రవితేజ నేడు 53 వసంతంలోకి అడుగు పెట్టారు. ఈ వయసులో కూడా చాలా యంగ్ గా కనిపిస్తున్న రవితేజ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టలను లైన్ లో పెట్టాడు. ఇప్పుడు తనకంటూ ఒక స్థాయి మార్కెట్ తో ఉన్నాడు కానీ కెరీర్ ప్రారంభంలో ఆయన ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. దర్శకుడు అవ్వాలని వచ్చి ఆ తరువాత తన టాలెంట్ తో నటుడిగా బిజీ అయ్యాడు. ముఖ్యంగా సైడ్ క్యారెక్టర్ నుంచి హీరో స్థాయికి వచ్చాడు. ఇక ఆయన కెరీర్ పై ఒక లుక్కేస్టుబి
Recommended Video

కేవలం తన కష్టాన్ని నమ్ముకొని..
1968 జనవరి 26న ఆంధ్రప్రదేశ్ జగ్గంపేటలో జన్మించిన రవితేజ చిన్నప్పుడే సినిమాల్లోకి రావాలని ఎన్నో కలలు కన్నాడు. సినిమా అంటే ఎంత ప్రాణమంటే రోజుకు నాలగులు షోలు చూసిన సందర్భాలు చాలానే ఉన్నాయట. రవితేజ అసలు పేరు బుపతిరాజు రవి శంకర్ రాజు. సినిమా తప్పితే మరే కోరికలు లేకుండా పెరిగాడు రవితేజ.

ఆ దర్శకులు రూమ్ మేట్స్
ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో పరిచయాలు తక్కువగా ఉన్న సమయంలో రబితేజకు చాలా దగ్గరగా ఉంది దర్శకులు గుణశేఖర్, వైవిఎస్.చౌదరి. వీరు ముగ్గురు రూమ్ మేట్స్ కూడా. ముగ్గురు కూడా సక్సెస్ ఫుల్ కెరీర్ ను చూశారు. వీరి కలయికలో అప్పట్లో నిప్పు సినిమా కూడా వచ్చింది.

వెనక్కి తిరిగి చూసుకోకుండా
రవితేజ మొదట నీ కోసం సినిమాతో హీరోగా పరిచయమైన విషయం తెలిసిందే. శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమాతో ఇండస్ట్రీలో మంచి క్రేజ్ అందుకున్నాడు. ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకోకుండా ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, వెంకీ, విక్రమార్కుడు, కిక్ వంటి సినిమాలతో తన స్థాయిని మరింత పెంచుకున్నాడు.

రవితేజ కెరీర్ బిగెస్ట్ హిట్
మాస్ మహారాజా రవితేజ ఈ సంక్రాంతికి క్రాక్ సినిమాతో బాక్సాఫీస్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఇప్పటికే 50కోట్ల వసూళ్లను అందుకొని రవితేజ కెరీర్ లోనే బిగెస్ట్ బాక్సాఫీస్ హిట్ గా నిలిచింది. గోపిచంద్ మలినేని ఆ సినిమాను డైరెక్ట్ చేసిన విషయం తెలిసిందే.

ఆకలిని ఏ మాత్రం లెక్క చేయకుండా
మాస్ మహారాజా రవితేజ మొదట్లో నటనపై ఆసక్తి కనబరిచినప్పటికీ ఎందుకో దర్శకుడు కావాలనే పట్టుదలతోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. అగ్ర హీరోల సినిమాల్లో కూడా సపోర్టింగ్ రోల్స్ చేస్తూ వచ్చాడు. అవమానాలను ఆకలిని ఏ మాత్రం లెక్క చేయకుండా కేవలం తన కష్టాన్ని నమ్ముకొని ఉన్నత శిఖరాలను ఎదిగాడు.


Click it and Unblock the Notifications











