అదే జరిగితే హీరోల అవసరమే ఉండదు.. సోనూ సూద్‌పై రామ్ కామెంట్
కరోనా వైరస్ వచ్చి ఎంత అతలాకుతలం చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. లాక్ డౌన్ పెట్టడం వల్ల ఎందరో తిండిలేక, ఉపాధి కరువై, మలమలమాడిపోయారు. వలస కార్మికుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అయితే అలాంటి సమయంలోనే ఒకడు వచ్చాడు. దేశం నలుమూలలో ఎక్కడ సాయం కావాలన్న పిలుపు వినబడినా క్షణం ఆలస్యం చేయకుండా వారి అవసరాలను తీర్చాడు.అతనెవరో, అతని పేరేంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతడే రీల్ లైఫ్ విలన్.. రియల్ లైఫ్ హీరో.
నేడు (జూలై 30) సోనూ సూద్ బర్త్ డే. దేశం మొత్తం సోనూ సూద్ పుట్టిన రోజును జరుపుకుంటోంది. రియల్ హీరో అంటూ సోనూ సూద్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. టాలీవుడ్ నుంచి సైతం సోనూ సూద్‌కు విషెస్ వెల్లువెత్తుతున్నాయి. అనంతపురం రైతుకు ట్రాక్టర్ బహుమతిగా ఇచ్చిన క్షణం నుంచి తెలుగు రాష్ట్రాల్లో సోనూ సూద్ హాట్ టాపిక్‌గా మారిపోయాడు. నేషనల్ లెవెల్ ఈ ఘటన అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. అందుకే నేడు సోనూ సూద్ బర్త్ డే మరింత స్పెషల్ అయింది.

సోనూ సూద్‌పై ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. సోనూ సూద్ సేవా స్ఫూర్తిని కొనియాడాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో చేసిన ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. 'జనాలు ఉన్నారు.. అందులో హీరోలు కూడా ఉన్నారు.. అయితే మానవత్వం ఉన్న మనుషులు కూడా ఉన్నారు..ఒకవేళ అలాంటి వారే ఎక్కువగా ఉంటే.. హీరోల అవసరం మనకు రాదు.. డియర్ బ్రదర్ సోనూ సూద్.. ఇలాంటి మాటలు చాలా తక్కువ మందిని ఉద్దేశించి మాత్రమే అనగలను.. నీకే నా ఓటు.. హ్యాపీ బర్త్ డే' అంటూ సోనూ సూద్‌పై ప్రేమను కురిపించాడు.


Click it and Unblock the Notifications











