Happy Birthday Vijay Devarakonda: క్యారెక్టర్ ఆర్టిస్టు నుంచి పాన్ ఇండియా వరకు.. పవర్ఫుల్ రౌడి!

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ క్రేజియస్ట్ స్టార్ అని చెప్పాలి. అతనికున్న ఫ్యాన్ ఫాలోయింగ్ స్టార్ హీరోలతో సమానంగా ఉంది. లైగర్ సినిమా తెలుగులో కంటే హిందీ మార్కెట్ లో ఎక్కువ మందికి రీచ్ అయ్యింది. దీనిని బట్టి నార్త్ ఇండియాలో విజయ్ దేవరకొండకి ఏ రేంజ్ ఫాలోయింగ్ ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక నేడు విజయ్ దేవరకొండ 32వ వసంతంలోకి అడుగు పెడుతున్నాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి పాన్ ఇండియా రేంజ్ వరకు వచ్చిన విజయ్ పర్ఫెక్ట్ స్టార్ డమ్ అందుకున్నాడు అని చెప్పవచ్చు. ఇక ఆ వివరాల్లోకి వెళితే..

మొదట్లో అలా హార్డ్ టైమ్: విజయ్ దేవరకొండ మొదట్లో అవకాశాల కోసం చాలా స్టూడియోల చుట్టూ దర్శక నిర్మాతల చుట్టూ తిరిగాడు. ఫ్యామిలీ సపోర్ట్ బాగానే ఉన్నప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్నాడు. నటుడిగా తనను తాను సరికొత్తగా ప్రజెంట్ చేసుకోవాలి అని అతను చేసిన హార్డ్ వర్క్ ప్రతీ సినిమాలో కనిపించింది. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ చేసిన అతను ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ కి రావడం అంటే అంత సాధారణమైన విషయం కాదు.

Happy Birthday Vijay Devarakonda

సైలెంట్ గా వచ్చి.. సెన్సెషనల్ హిట్స్: విజయ్ రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు కాకుండా విభిన్నమైన సినిమాలతోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్నాడు. మొదట పెళ్లి చూపులు సినిమాతో సైలెంట్ గా బిగ్ హిట్ అందుకున్న రౌడి స్టార్ అనంతరం అర్జున్ రెడ్డి, గీత గోవిందం, టాక్సీ వాలా సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేశాడు. విజయ్ మార్కెట్ కూడా 50 కోట్లు దాటేసింది.

Happy Birthday Vijay Devarakonda

కెరీర్ బిగ్గెస్ట్ మూవీ: పూరి జగన్నాద్ దర్శకత్వంలో విజయ్ చేసిన లైగర్ సినిమా ఫ్యాన్ ఇండియా రేంజ్ లో గట్టిగా మంచి హైప్ క్రియేట్ చేసింది. ఆ సినిమా అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేకపోయినప్పటికీ విజయ్ కు మాత్రం హిందీ మార్కెట్లో బలం ఎంత ఉందో చూపించింది. ఆ సినిమా విజయ్ కెరీర్ లోనే మంచి బిజినెస్ చేసింది.

రాబోయే బెస్ట్ కాంబినేషన్స్: ప్రస్తుతం విజయ్ శివ నిర్వాణ దర్శకత్వంలో సమంతతో ఖుషి మూవీ చేస్తున్నాడు. ప్యూర్ లవ్ స్టొరీగా ఈ చిత్రాన్ని దర్శకుడు ఆవిష్కరించాడు. దీంతో పాటు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయనున్నాడు. రీసెంట్ గా పూజా కార్యక్రమాలతో ఆ చిత్రం ప్రారంభం అయ్యింది. దీంతో పాటు దిల్ రాజు బ్యానర్ లో పరశురామ్ దర్శకత్వంలో ఒక మూవీ కమిట్ అయ్యాడు. త్వరలో ఈ సినిమా ఈ మూవీ కూడా స్టార్ట్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది.

Happy Birthday Vijay Devarakonda

లేటెస్ట్ స్టైలిష్ లుక్ వైరల్: ఇదిలా ఉంటే విజయ్ దేవరకొండ పుట్టిన రోజు సందర్భంగా ఫ్యాన్స్ కి ట్రీట్ గా ఖుషి మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. మోస్ట్ స్టైలిష్ యాక్టర్ గా, యూత్ ఐకాన్ గా విజయ్ దేవరకొండని అందరూ చూస్తారు. తాజాగా బర్త్ డే సందర్భంగా విజయ్ దేవరకొండ న్యూ లుక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ లుక్ లో క్యాజువల్ గా కనిపిస్తున్న డిఫరెంట్ కాస్ట్యూమ్స్ తో రౌడీ స్టార్ ఎట్రాక్ట్ చేస్తూ ఉండటం విశేషం. ఈ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Happy Birthday Vijay Devarakonda
విజయ్ రెమ్యునరేషన్ ఎంతంటే..: విజయ్ దేవరకొండ తను నటించిన లైగర్ సినిమాకు అత్యధికంగా 30 కోట్లకు పైగానే రెమ్యునరేషన్ తీసుకున్నట్లుగా ఇండస్ట్రీలో ఒక టాక్ అయితే వినిపించింది. ఇక ప్రస్తుతం అతను చేస్తున్న ఖుషి సినిమాకు కూడా దాదాపు అదే తరహాలో ఛార్జ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక రాబోయే సినిమాలకు కూడా అతనికి నిర్మాతలు గట్టిగానే ఆఫర్ చేస్తున్నారట. విజయ్ దేవరకొండ సుకుమార్ కాంబినేషన్లో కూడా ఒక సినిమా చేయనున్నట్లుగా గతంలో క్లారిటీ ఇచ్చాడు. ఇక ఆ ప్రాజెక్టు ఎప్పుడు తెరపైకి వస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X